ఈ మొక్కలు ఇంట్లో ఉంటడం వల్ల అందం,ఆరోగ్యంతో పాటు సిరిసంపదలు కూడా చేకూరుతాయి.

Author:

ఇంట్లో ఎన్ని మొక్కలు ఉంటే అంతా అందంగా కనిపిస్తుంది. మొక్కలు పెంచుకోని వారి ఇల్లు బోసిపోయినట్లు కనిపిస్తుంది. మొక్కలు పెంచడం చాలా మంచి అలవాటు. మొక్కలతో పచ్చదనంతో పాటుగా అదృష్టం కూడా వరిస్తుందని చాలామంది నమ్మకం. ప్రతి ఇంట్లో కొన్ని మొక్కలు తప్పనిసరిగా ఉంటే మంచిదని మన పూర్వీకులు అప్పట్లోనే చెప్పారు. ఈ క్రింది మొక్కలు ఇంట్లో ఉంటడం వల్ల అందం, ఆరోగ్యంతో పాటు సిరిసంపదలు కూడా చేకూరుతాయి.

lucky-plants

తులసి మొక్క: అమ్మవారికి ప్రతిరూపమైన తులసి చాలా పవిత్రమైంది. మన భారతీయులు ఎక్కువగా పూజింజే మొక్క తులసి. తులసి మొక్క ఖచ్చితంగా ఇంట్లో ఉండాలి. అలా ఉంటే అదృష్టం, ఆరోగ్యం రెండూ ప్రాప్తిస్తాయి. తులసి మొక్కని అనేక ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు.

ఉసిరి మొక్క:  ఉసిరి మొక్కను సాక్షాత్తూ విష్ణుమూర్తిగా భావిస్తారు. అందుకే ఉసిరి మొక్క ఇంట్లో ఉంటే శుభదాయకం. కార్తీక మాసంలో ఉసిరి, తులసిని కలిపి పూజ చేయడం కూడా తెలిసిందే.

కలబంద: దిష్టి దోషాలు పోవాలంటే ఖచ్చితంగా కలబంద మొక్క ఇంటి ముందు ఉండి తీరాల్సిందే, మనలో చాలా మంది ఇళ్లలో గుమ్మానికి కలబంద మొక్క వేలాది దీసి ఉండటం గమనిస్తూనే ఉంటాం, ఈ మొక్క వల్ల దిష్టి దోషాలన్నీ పోతాయి.

మనీ ప్లాంట్ : ఈ మొక్క పేరులోనే డబ్బు ఉంది, ఈ మొక్క ఇంటి పరిసరాల్లో ఉంటే ధనం పుష్కలంగా సమకూరుతుంది అని నమ్మకం. డబ్బే కాకుండా ఈ మొక్క కారణంగా ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఈ పాజిటివ్ ఎనర్జీ వల్ల తెలియకుండానే, మనకు చాలా లాభం చేకూరుతుంది. అయితే రోజూ ఈ మొక్కకి కొద్దిగా నీళ్లు పోయాలి. అప్పుడు మాత్రమే మంచి ఫలితాలు ఉంటాయి.

(Visited 6,622 times, 516 visits today)