Home / Inspiring Stories / ఇద్దరు వైద్య విద్యార్దుల చొరవ ఒక ప్రాణాన్ని నిలబెట్టింది.

ఇద్దరు వైద్య విద్యార్దుల చొరవ ఒక ప్రాణాన్ని నిలబెట్టింది.

Author:

Hyderabad Girls saved victim of an accident

మన చుట్టూ ఉన్న బిజీ ప్రపంచంలో పడి మనమూ కొట్టుకు పోతూనే ఉన్నాం. ఈ బిజీ బిజీ జీవితాల్లో మనం మామూలు భావోద్వేగాలకూ, స్పందనలకూ దూరంగా జరిగిపోతున్నాం ఎంతగా కరుడు కట్టిపోయాం అంటే టీవీల్లో భూకంప భీబత్సాన్ని కూడా హ్యాపీగా భోజనం చేస్తూ చూసేంత, రోడ్డు మీద ఒక ఆక్సిడెంట్ జరిగినప్పుడు కనీసం ఆ మనిషి పరిస్థితేంటో ఒక రెండు క్షణాలు కూడా ఆలోచించకుండా అతన్ని ఫొటోతీసి సోషల్ మీడియాలొ పోస్ట్ చేసేంతగా మనం సున్నిత భావాలను కోల్పోతున్నాం. ఐతే అప్పుడప్పుడూ కొన్ని సంఘటనలు మనలో ఉండే కొద్దిపాటి మానవత్వాన్నీ, ఎక్కడో ఉన్న మనిషితాలూకు స్పందననీ బయటికితెస్తుంది అలాంటిదే ఒక సంఘటన నిన్న జరిగింది…

ఫైజా అంజుం, సావిత్రీ దేవి ఇద్దరూ వైధ్య విధ్యార్థులు సికింద్రాబాద్ అపోలో హాస్పిటల్ లో ఇంటర్న్ షిప్ డాక్టర్లుగా చేస్తున్నారు.(చదువుకుంటూనే ప్రాక్టీస్ చేయటం). నిన్న సాయంత్రం ఇద్దరూ మామూలుగా బయటికి వచ్చారు. రోడ్డు మీద కనిపించిన ఒక దృశ్యం ఇద్దరినీ కలచి వేసింది. ఒక వ్యక్తి యాక్సిడెంట్ కి గురై రక్తపు మడుగులో పడి ఉన్నాడు. ఐతే చుట్టూ మూగిన జనం అతన్ని సెల్ ఫోన్ లో ఫొటోలు తీసుకుంటూ దూరం నుంచే చూస్తున్నారు తప్ప, దగ్గరగా వెళ్ళి అతనికి కనీస సహాయం కూడా చేసేవారు లేరు. అంజుం,సావిత్రీ ఇద్దరూ డాక్టర్లే కావటం వళ్ళ అతన్ని పరీక్షిస్తూనే ఆంబులెన్స్ కి కాల్ చేసారు. అప్పటికే అతను అపస్మారక స్థితికి వెళ్ళిపోతున్నాడు. పళ్ళ మధ్య పడి నాలుక తెగి రక్తం కారుతోంది.ఎలాంటి వైద్య పరికరాలూ వాళ్ళ దగ్గర లేవు కేవలం వాళ్ళ సమయస్పూర్తి మాత్రమే అతన్ని బతికించగలదు.

వెంటనే నాలుక గొంతుకి అడ్డం పడి శ్వాసకి ఇబ్బంది లేకుండా పెన్నుని నోటిలో నాలుకకి అడ్డంగా ఉంచారు. అతని చాతీ మీద ప్రెస్ చేస్తూనే న్యూస్ పేపర్ ని పైప్ లాగా చుట్టి కృత్రిమ శ్వాస అందించారు. 25 నిమిషాలు దాటినా అంబులెన్స్ చేరుకోలేదు. అప్పటికీ వాళ్ళు చేస్తూనే ఉన్నారు. (చాతీ మీద మర్థనా ద్వారా గుండెని ఆక్టివేట్ చేయటం) అరగంట తర్వాత ఆంబులెన్స్ వచ్చింది ఆక్సీజన్ పెట్టి అతని హార్ట్ బీట్ మెరుగవగానే అతన్ని హాస్పిటల్ కి తరలించారు. ఇప్పుడా వ్యక్తికి ప్రాణాపాయం తప్పింది.ఆ ఇద్దరు డాక్టర్లూ ఊపిరి పీల్చుకున్నారు. ఒక ప్రాణం కాపాడటం అంటే డాక్టర్ గా ఉండల్సిన తపన ఏమిటో వాళ్ళిద్దరూ చూపించారు.

అంతే కాదు మనం మరిచిపోతున్న “దయ” అనే ఒక ఫీలింగ్ ని మరో సారి గుర్తు చేసారు.స్మార్ట్ ఫోన్ వచ్చాక మనిషి మరీ హార్డ్ గా తయారై పోతున్నాడు. ఏదైనా జరిగినప్పుడు సెల్ ఫోన్ లో ఫొటోలు తీసుకుంటూ. ఆ ధారుణాన్ని కూడా ఎంజాయ్ చేసే స్థితికి జారిపోతున్నాడు. ఒక సారి ఫైజా,సావిత్రీ లు మనిషిలో సున్నిత కోణాన్నీ కనీస భాద్యతనూ గుర్తు చేసారు.

(Visited 942 times, 22 visits today)