Home / Inspiring Stories / న్యాయం కోసం అడుక్కుంటున్నాడు.

న్యాయం కోసం అడుక్కుంటున్నాడు.

Author:

shiv Singh Beggar Studying Law Course at the Age of 48

జైపూర్ కి చెందిన శివ్ సింగ్ గంగాపూర్ గవర్నమెంట్ కాలేజ్ నుంచి డిగ్రీ అందుకున్నాడు.మంచి మార్కులు బాగా వచ్చాయ్ కానీ ఉద్యోగం మాత్రం రాలేదు.అప్పటికే పెళ్ళయ్యింది కుటుంబాన్ని పోషించటానికి చిన్నా చితకా పనులకోసం వెతికాడు… రోజుకూలీగా పని చేసినా ఆ వృత్తిలోనూ కంటిన్యూ కాలేకపోయాడు. ఇల్లు గడవకపోవడంతో భార్యా,పిల్లలు కూడా అతనిని వదిలిపెట్టేశారు.ఒంటరివాడయ్యాడు ఇక తనకు తానే అనుకున్నాడు. రోడ్డు మీదనే బతకటం మొదలెట్టాడు. బతకటం కోసం అడుక్కోవటమూ మొదలైంది. అలా ఒక గ్రాడ్యుఏట్ విజయవంతంగా బిచ్చగాడయ్యాడు….

48 ఏళ్ల శివ్ సింగ్ కి ఎందుకో మళ్ళీ చదువుకోవాలనిపించింది. పాత సర్టిఫికెట్ల దుమ్ము దులిపి రాజస్ధాన్ యూనివర్సిటీ నుంచి ‘లా’ కోసం అప్లై చేసాడు సీట్ వచ్చింది. మరి యూనివర్సిటీ చదువంటే ఖర్చులూ ఉంటాయ్ కద మరెలా..!? అందుకే రోజూ సాయంత్రం నుంచీ అర్థరాత్రి దాకా అడుక్కుంటాడు.పొద్దున్న కూడా సిగ్నల్స్ దగ్గర వాహనాల అద్దాలు తుడిచి డబ్బులడుక్కుంటాడు.మధ్యాహ్నం 3 కాగానే లా కాలేజ్ లకు వెళ్ళి. ప్రొఫేసర్ చెప్పే వాటిని నోట్ చేసుకుంటాడు . ఇంటికొచ్చాక మళ్లీ కాలేజ్ లో ప్రోఫేసర్ చెప్పిన పాఠాలను మరోసారి చదువుతాడు. మరో విషయం ఏంటంటే ఇప్పటి వరకు ఒక్క రోజు కూడా కాలేజ్ ఎగ్గొట్టలేదు. క్లాస్ ఉంటే కాలేజ్ లో, క్లాస్ లేకపోతే లైబ్రరీలో “లా” పుస్తకాలతో బిజీగా గడుపుతాడు శివ్ సింగ్. రాత్రి భిక్షాటన చేస్తూ.. పగలు ‘లా’ చదువుకుంటున్నాడు. కోర్టులో ఉద్యోగం సంపాదించడమే తన లక్ష్యం అని కూడా చెబుతున్నాడు.

చదువు కోసం తపన కొత్తేం కాకపోవచ్చు కానీ జీవితంలో అట్టడుగు స్థాయి ఓటమిని పొందిన శివ మళ్ళీ తన చదువుని కొనసాగించటం మామూలు విషయం ఏమీ కాదు. అదీ తనకంటూ రిజర్వేషన్ అడగకుండా, అమ్మా నాన్నలు పంపే డబ్బుతో విలాసవంతమైన హాస్టల్ లలో ఉంటూ ఖరీదైన మొబైల్ ఫోన్లు ఆధునిక స్టైలిష్ బైకులూ కలిగి ఉండి తగినంత వయసూ ఉండి సమయాన్ని వృధా చేసుకునే వారి మధ్య… ఇంకో అడుగు ముందుకువేసి మేనేజ్ మెంట్ కోటా కాబట్టి మేనేజ్ చేసుకొని అరకొర చదువే అయినా మార్కులనూ కొనుక్కునే గ్రాడ్యుయేట్ల కాలం నడుస్తున్నప్పుడు… శివ్ సింగ్ లాంటి ఒక “విధ్యార్థి” ఖచ్చితంగా ఆదర్శ ప్రాయుడే అనుకోవచ్చేమో.ఎందుకంటే పార్ట్ టైం లో కూడా ఉధ్యోగానికి అతని సమయమూ ఆరోగ్యమూ సహకరించని పరిస్థితివల్లే శివ అడుక్కుంటున్నాడు అది కూడా వాహనాలను తుడిచాకనే చెయ్యి చాపుతున్నాడు…. ఔను..! అతను నిజంగానే న్యాయాన్ని అడుక్కునే సాధించుకుంటున్నాడు..

(Visited 290 times, 6 visits today)