2014 సంవత్సరపు సాహస బాలల అవార్డు తీసుకున్న 8ఏళ్ళ చిన్నారి సాహస గాథ.

Author:
awarded

Source: Logical Indian

ధైర్యం ఉన్నప్పుడు వయసూ,పెద్దరికం తో పనిలేదు. సరైన సమయం లో ఉండాల్సిన తెగువని చూపించకపోతే ఎంతటి బలవంతులైనా పెద్ద తేడా ఏముందీ? 8 ఏళ్ళే అయినా ఈ చిన్నరి చూపిన తెగువ తన అమ్మమ్మ ప్రాణాలని కాపాడింది. ఇంతకీ ఈ అమ్మయి పేరు మోన్ బెజి ఈజంగ్ నాగాలాండ్ లో ఉంటుంది. మనలాగా ఎండాకాలం సెలవులు కాకుండా నాగా ల్యాండ్ లో చలికాలం సెలవులుంటాయన్న మాట. ఈ సెలవులలో తన అమ్మామ్మ దగ్గర గడపటానికి వెళ్ళింది ఈ పాప. అమ్మమ్మ రెంతుగ్లో ఈ జంగ్ వయస్సు 78 ఏళ్ళు అయినా మనవరాలి సంతోషం కోసం చేపలు పట్టటానికి తనని దగ్గర్లోనే ఉన్న నది దగ్గరికి తీసుకువెళ్ళింది. అక్కన్నుంచి ఊరు కూడా చాలాదూరమే.

ఇద్దరూ చేపలు పడుతున్నారు ఉనంట్టుండి ఒక్కసారిగా గుండెలో నొప్పిరావటం తో రెంతుగ్లో ఈ జంగ్ నొప్పితో మెలికలు తిరుగుతూ నదిలో పడిపోయింది.ఐతే నదీ ప్రవాహం తక్కువగానే ఉండటం తో కొట్టుకుపోలేదు గానీ బయటకు తీయటం మాత్రం ఆ ఎనిమిదేళ్ళ చిన్నారికి అసాధ్యం.తన ప్రయత్నాలు ఫలించవని అర్థం కాగానే మోన్ బెజి ఈజంగ్ పక్కనే ఉన్న దట్టమైన అడవిలోకి పరుగుతీసింది… పులులు లేకపోయినా కనీసం ఒక తోడేలు చాలు తనని తినేయటానికి,అసలు ఎవరూ లేని అలాంటి నిర్మానుష్య ప్రదేశం లో ఆ వయసు పిల్లలెవరైనా ఏడుస్తూ కూచుంటారు కానీ ఈ అమ్మయి ఏడ్చింది కానీ ఏడుస్తూ అడవిలోకి పరుగు తీసింది ఒకటేఏ రెండూ కాదు ఏకంగా అయిదు కిలోమీటర్లు వెళ్ళాక అక్కడ అడవిలో నివసించే కొందరు ఆటవికులకు తన అమ్మమ్మ విషయం చెప్పింది. వాళ్ళు వచ్చేసరికి అమ్మమ్మ ఇంకా అక్కడే పడి ఉండటం చూసి నదిలోకి దూకి ఆమెను ఆసుపత్రికి తీసుకువెళ్ళారు. చివరికి మోన్ బెజి ఈజంగ్ మామ్మ బతికింది కళ్ళు తెరిచి చూసింది.

ఇదంతా 2014 జనవరిలో జరిగిన సంఘటన.. ఈ పాప తెగువని గుర్థించిన ప్రభుత్వం ప్రతీ ఏటా ఇచ్చే సాహసబాలల అవార్డుకు నామినేట్ అయిన ఇరవై నాలుగుమందిలోనూ మోనో నే సెలెక్ట్ సారు. రాష్ట్రపతి చేతుల మీదుగా సాహస బాలిక అవార్డు తీసుకున్నాక “నీకు భయం వెయ్యలేదా అంతదూరం అడవిలో ఎలా వెళ్ళవ్?” అని అడిగిన ప్రశ్నకు సమాధానం గా “నాకు మా అమ్మమ్మ అంటే చాలా ఇష్టం అప్పుడు అమ్మమ్మ తప్ప భయం అసలే గుర్తుకు రాలేదు కానీ మళ్ళీ అక్కడికి రెండో సారి వెళ్ళినప్పుడు మాత్రం ఎవరూ లేకుండా అప్పుడేలా ఉన్నానూ అని కొంచం భయం వేసింది” అని నవ్వుతూ చెప్పింది..

(Visited 485 times, 14 visits today)