Home / Inspiring Stories / 80 ఏళ్ళ వయసులో జాతీయ ఝంఢాలతో దేశమంతా కాలినడకన తిరిగే ఈ వృద్దుడెవరు ??

80 ఏళ్ళ వయసులో జాతీయ ఝంఢాలతో దేశమంతా కాలినడకన తిరిగే ఈ వృద్దుడెవరు ??

Author:

nO sMOKING 4

ఏమైంది ఈ నగరానికి..? ఒక వైపు నుసీ..మరోవైపు పొగ…ధూమ పానానికి తప్పదూ భారీ మూల్యం…అంటూ వచ్చే ఒక ఆడ్ ని మీరు చూసారు కదా…. పొగాకు వల్లా సిగరెట్ వల్లా తమని తామే కాల్చుకుంటు..తమ పక్క వాళ్ళని కూడా కాల్చేసే ధూమపాన ప్రియుల మీద మీక్కాస్త కోపం కూడా వచ్చి ఉంటుంది.. కానీ వద్దని చెప్పలేం. వారి వ్యక్తి గత స్వేచ్చ ఒక కారణం ఐతే, అలా బానిసలవటానికి వారి వారి కారణాలు వాళ్ళకీ ఉండొచ్చు అన్న ఆలోచన ఒకటి. ఐతే ఈ రెండు కారణాలతో సాటి మనిషొకడు ఊపిరి తిత్తులు పాడై పోయీ,రక్తనాళాలు బిగుసుకుపోయీ,గుండె పగిలే భాదననుభవిస్తూ చనిపోతాడన్న భాద కూడా మనలో కొందరికి ఉండొచ్చు. అయినా మనమేం చేయగలం.. వారితో ఎలా మానిపించగలం? అనుకుంటాం ఐతే బగీచా సింగ్ అలా అనుకోలేదు.

No Smoking 1

కేవలం ఒక అలవాటు వల్ల,చిన్న బలహీనత వల్ల తన దేశ పౌరులు,యువకులూ ఆరోగ్యాలను పాడు చేసుకుంటూంటే ఆ తండ్రి మనసు తట్టూకోలేక పోయింది. తన దేశాన్ని పోగాకు కాస్టంలో దగ్దం కానివ్వకూడదనుకున్నాడు. ఐతే ఒక్కడే మామూలుగా ఎంత మందికి చెప్పగలడు. అందుకే దాన్నొక ఉధ్యమం చేయాలనుకున్నాడు. తానొక్కడే ఉధ్యమ కర్త. తానే ఆ ఉధ్యమ నాయకుడూ,తానే ఉధ్యమ కార్యకర్తా అయ్యాడు. కాలినడకన తన “పొగాకు వ్యతిరేక ఉధ్యమ ర్యాలీ మొదలు పెట్టాడు” అదికూడా కాష్మీర్ నంచి కన్యాకుమారి వరకూ….

వయసు 60 దాటింది ఇప్పుడు నువ్వు ఇంతటి సాహసం చేయటం మంచిది కాదు అని చెప్పిన తన వారి మాటను పట్టించుకోలేదు.ప్రయాణంలో తనకు కావలసిన సామాగ్రీ అంతా సిద్దం చేసుకున్నాడు. మొత్తం సామాగ్రీ భుజాలకెత్తుకున్నాడు. దాని బరువెంతో తెలుసా…!? 80 కే.జీ.లు. అరవయ్యేళ్ళ వృద్దున్ని కదా ఇదంతా మోయగలనా..? అనుకోలేదు. అలాగే 1992 లో తన ప్రయాణం మొదలు పెట్టాడు. రోజుకి కొన్ని పదుల కిలోమీటర్లు నడిచాడు. స్ఫూర్తిగా తన భుజాల మీద రెండు త్రివర్ణ పతాకాలను పెట్టుకున్నాడు. కనిపించిన వారి కల్లా ధూమపానం వల్లా,పొగాకు ఉత్పత్తుల వాడకం వల్లా వచ్చే సమస్యలనూ, దేశానికి ఉపయోగ పడాల్సిన యువకులు వీటి వల్ల పాడైపోతే ఈ దేశానికి వచ్చే సమస్యలనూ వివరిస్తూ ప్రయాణం చేస్తూనే ఉన్నాడు.

No sMOKING 3

పొగాకు వాడకం ఎక్కువగా ఉండే యూపీ,బీహార్ లలో ప్రతీ పట్టణాన్నీ ప్రతీ టౌన్ నీ సందర్శించాడు. అన్నేసి కేజీల బరువు మోస్తూ నడుస్తూనే ఉన్నాడు. ఈ ఇరవయ్యేల్లకు పైగా సాగిన తన ప్రయాణాలలో ఎన్నొ ఆనుభవాలు. ఒక్కో ప్రయాణం తర్వాతా. కొన్ని రోజులు మాత్రం విశ్రాంతి తీసుకొని మళ్ళీ ప్రయాణం మొదలు. చివరి గా 2015 లో తాను హైదరాబాద్ వచ్చినప్పుడు. టైమ్స్ అఫ్ ఇండియా కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ.. చెప్పిన అనుభవం అందరినీ ఆశ్చర్య పరిచింది. ఆ మహా యోధుడికి “సలాం” అనిపించింది. అతడి మాటల్లోనే… ” తేజ్ పూర్ టూ గౌహతీ. అస్సాం లోని ఈ రెండు టౌన్లకీ మధ్య దట్టమైన అడవి ఉంది. ఆ దారిలో వెళ్ళాలంటే అక్కడ ఉండే అడవి ఏనుగుల గుంపుకి మనం “టాక్స్” చెల్లించాలి… అదేంటో తెలుసా..? అరటి పళ్ళు. ఆ మార్గం గుండా ప్రయాణించే అందరూ తమ వాహనాల్లో అరటిపళ్ళు తీసుకు వెళతారు. నేనూ డజన్ల కొద్దీ అరటి పళ్ళు మోసుకు వెళ్ళాను వాటికి భక్తిగా నా టాక్స్ చెల్లించుకున్నాను.అయితే వాళ్ళు నాకు రిసిప్ట్ కూడా ఇవ్వలేదు లెండి. అవి అరటి పళ్ళని తింటూంటే నా నడక కొనసాగించాను. కొంత దూరం తర్వాత నన్ను అక్కడ ఉందే ఆటవికజాతి గిరిజనులైన నాగాజాతి మనుషులు అటకాయించారు. నా వస్తువులన్నీ ఇచ్చేయమంటూ బెదిరించారు. అప్పుడొక అద్బుతం జరిగింది. అక్కడ టాక్స్ తీసుకుని ఆ దారిలోని ప్రయాణీకులను రక్షించే “రక్షణ దళం వాళ్ళు” వచ్చారు ఆ నాగాలను తమ తొండాలతోనూ అరుపులతోనూ భయపెట్టి తరిమేసారు. తర్వాత నా సామానుని కూడా వారి తొండంతో మోస్తూ నేను మెయిన్ రోడ్డు చేరేదాకా నా వెనకే వచ్చారు” అంటూ ఆ ఏనుగులకు మరోసారి నమస్కారం పెట్టుకున్నాడు..

తనకి ఎంతగానో ఫ్రెండ్లీ పీపుల్ అనిపించిన హైదరాబాద్,తెలంగాణా,తెలుగు మనుషులు అధికంగా సిగరెట్లు తాగటం,ఎక్కువగా గుట్కా నమిలే వాళ్ళే అయి ఉండటం మాత్రం ఈయనకి నచ్చలేదట. అది తనకు భాద కలిగించిందంటూ చెప్పుకొచ్చాడు. ఇక్కడి ప్రజలు ఆ పొగాకును పక్కన పెడితే నిజంగా తనకు ఆనందంగా ఉంటుంది అని చెప్పాడు.

No Smoking 2

ఇప్పుడు బగీచా సింగ్ వయస్సు 80 సంవత్సరాలు. ఇదివరకు పొద్దున్నే ఏడుగంటలకే నడక మొదలు పెట్టి 12 వరకూ నడిచేవాడట. ఒక గంట విశ్రాంతి తర్వాత మళ్ళీ నడక మొదలు పెట్టి రాత్రి 9 గంటల దాకా నడక సాగేది. అయితే వయసు మీద పడటం వళ్ళ కంటి చూపు తగ్గింది. ఇప్పుడు సాయంత్రం 7 గంటలకే ఆపేస్తున్నాడట. అంతే కాదు మోకాళ్ళ నొప్పులు ఇబ్బంది పెడుతున్న తన లక్ష్యం వైపు నడుస్తూనే ఉన్నాడు. పొగాకు మహమ్మారిని ఈ దేశం నుంచి వెళ్ళ గొట్టేందుకు ఇప్పటి వరకూ 5,70,000 కిలోమీటర్ లు కాలినడకన తిరిగిన ఈ బగీచా సింగ్ అనే ఈ భారతీయుడికి అలజడి.కాం “సలాం చెప్తోంది. మరి మీరు..???

(Visited 726 times, 38 visits today)