Home / Inspiring Stories / అతనొక బిచ్చగాడే కానీ ఆ పిల్లల పాలిటి దేవుడు.

అతనొక బిచ్చగాడే కానీ ఆ పిల్లల పాలిటి దేవుడు.

Author:

Beggar 3

“బేటీ బచావో బేటీ పడావో” అంటూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకం కోసం అధికారులు ఎంత పని చేస్తున్నారో తెలియదు కానీ.,గుజరాత్ లోని మెహ్సనా జిల్లాకు చెందిన ఖింజీ భాయ్ ప్రజాపతి మాత్రం. ఆడపిల్లల చదువుకోసం ప్రోత్సాహకాలను ఇచ్చి మరీ చదువు కొవటానికి ప్రోత్సహిస్తున్నాడు. ఈ సంవత్సరం అక్కడ అంగన్వాడీ లో ఉన్న అందరికంటే పేదవారైన పదిమంది ఆడపిల్లలు బడి మానేయనందుకు. ఒక్కొక్కరికీ బంగారు చెవిపోగులు కొనిపెట్టాడు. ఇంతకీ ఈ ప్రజాపతి అనే మనిషి కోటీశ్వరుడా…! అంటే కాదు కనీసం లక్షాధికారి కానీ,నెల జీతం తెచ్చుకునే ఉధ్యోగి కూడా కాదు. అతనొక బిచ్చగాడు… అంతే కాదు చంక కర్రల ఊతం లేనిదే నడవలేనివాడు.

అతను ఒక బిచ్చగాడు. రోజూ గుడి మెట్ల మీద అడుక్కోవటమే అతని పని ఐతే అందర్లా తన కడుపు నింపుకోవటానికే అడుక్కోవటం లేదతను. వచ్చిన డబ్బుతో పేద ఆడపిల్లల చదువుకోసం ఖర్చుచేస్తాడు.పుస్త కాలూ పెన్నులూ కొనిస్తాడు. కొందరికి స్కూల్ యూనిఫారం లూ,చెప్పులూ కొనిస్తాడు.తన యాచకత్వ సంపాదనంతా ఇలా ఖర్చు చేసాక మళ్ళీ గుడిమెట్ల దగ్గర చేరి అడుక్కోవటం మొదలుపెడతాడు.అలా ఇప్పటివరకూ అతను ఖర్చు చేసింది పైపైన లెక్కవేస్తేనే 80 వేల రూపాయలకు పైగా తేలింది. “నా కాళ్ళు బావుంటే నేను పని చేసి వారికి అండగా నిలిచేవాన్ని కానీ నాకు దేవుడు ఆ అవకాశం ఇవ్వలేదు. అందుకే ఇలా సంపాదిస్తున్నాను.నేనెవరినీ మోసం చేయటం లేదు,బలవంతంగా వసూలు చేయటం లేదు కూడా. వారిచ్చిన డబ్బుని నా అవసరాలకు సరిపోగా మిగిలిన దానితోనే నేనీ పనులు చేస్తున్నా” అంటాడు ఖింజీభాయ్.

Beggar 2

“ఒక బిచ్చగాడన్న సంగతి పక్కన పెట్టండి అసలు ధన వంతులు కూడా పిల్లలు బడి మానేయకుండా చదువుకోవటానికి బంగారు చెవిపోగులు ఇవ్వగా నేను చూడలేదు”అంటూ తన ముందుకు వచ్చిన టైంస్ ఆఫ్ ఇండియా ప్రతినిథులతో చెప్పాడట ఈ అంగాన్వాడీ సెంటర్ నడిపే శీతల్ సత్వారా. ఒక్కొక్కరి ఇంటి పరిస్థితులని ప్రథ్యక్షంగా వెళ్ళి చూసి పదిమంది బాలికలను ఎంపిక చేసింది ఈయనే. అంతే కాదు ఖింజీ మొదట బంగారు పోగులు కొనటానికి వెళ్ళినప్పుడు. అతని ఆలోచన విని ఇంతచేస్తున్న అతని పనిలో తానూ పాలు పంచుకోవాలనిపించి తన వంతు గా 13000 రూపాయలలో 3000 వేలు తగ్గించాదట. జ్యూఎలరీ షాపు యజ మాని అయిన దీపక్ షా..

పోయిన మూడేళ్ళలోనే అడుక్కున్న సంపాదన ద్వారా ఇప్పటి వరకూ స్కూలు పిల్లల కోసం 80,000లకు పైగానే ఖర్చు పెట్టాడట ఖింజీ భాయ్. “అసలు మా జీవితం లో ఒక బంగారునగ చూస్తామనే అనుకోలేదు పిల్లని బడికి పంపిస్తాం అనగానే మాకోసం ఇంత చేసిన ఈ పెద్దాయన కోసమైనా మా అమ్మాయిని ఆపకుండా ఎంత కష్టమైనా చదివిస్తాం” అంటూ మెరుస్తున్న కళ్ళతో చెప్పింది మూడేళ్ళ కూతురు “భూమి” ని పట్టుకున్న కుముద్ లోహారియా…

Beggar 1

ఆ రోజు వేరే గ్రామానికి బదిలీ అయిన ఒక మహిళా టీచర్ వెళ్ళే ముందు ఖింజీ చేతికి 500 ఇచ్చారు నేను చేయలేని పని అతను చేసాడు కనీసం నేను ఇది కూడా చేయక పోతే సంతృప్తిగా బోజనం చేయలేను”అంటూ చెప్పందావిద. ఇక చివరగా అందరూ వెళ్ళిపోయాక తన కర్రల సాయంతో గుడిదాకా వెళ్ళిన ఖింజీభాయ్ అక్కడే కూచొని అడుక్కోవటం మొదలు పెట్టాడు…. అతను తనకోసం అడుక్కొవటం లేదు పిల్లల కోసం కనీసం వారి పేరుని కూడా వాడుకోకుండానే విరాళాలు సేకరిస్తున్నాడు. ఖింజీభాయ్ నిజంగా మనకన్నా ఎన్నోరెట్లు ధనవంతుడు. మనమే డబ్బుకోసం వెతుకుతూ మనశ్శాంతిని కూడా అడుక్కునే పేదవాళ్ళమేమో…

(Visited 613 times, 43 visits today)