EDITION English తెలుగు
"పీవీ సింధు..మమ్మల్ని క్షమించు"   Video: ప్రియురాలి శవానికి తాళి కట్టి పెళ్లి చేసుకున్న ప్రేమికుడు.   Video: ఒక్క పాటతో ఇంటర్నెట్ ని ఊపేస్తున్న మల్లు బ్యూటీ..!   నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా చేసాడు.. సంపాదించిన ఆస్తి రూ.3930 మాత్రమే..!   మహేష్ బాబు, అల్లు అర్జున్ లకు షాక్ ఇచ్చిన రజినీకాంత్..!   లవర్స్ మధ్య జరిగిన ఈ వాట్సాప్ చాట్ లు చూస్తే ఖచ్చితంగా నవ్వుకుంటారు..! 3వది అయితే హైలైట్..!   మహారాజశ్రీ హైకోర్టు న్యాయమూర్తి గారికి....! కదిలించిన జెడ్పి విద్యార్థినిల లెటర్..!   హైదరాబాద్ లోని ఈ హాస్పిటల్ లో రూ. 10 లక్షలు అయ్యే చికిత్సలు అన్ని ఉచితం..!   తల్లి చనిపోతూ తన కొడుక్కి రాసిన లెటర్..! అది చదివితే కన్నీళ్లొస్తాయి...!   బీటెక్ స్టూడెంట్స్ కు నెలకు రూ.80వేల స్కాలర్ షిప్.
Home / Inspiring Stories / పేద పిల్లల కోసం పాత చెప్పులు,షూలని రీసైక్లింగ్ చేసి కొత్త చెప్పులని తయారుచేస్తున్నారు.

పేద పిల్లల కోసం పాత చెప్పులు,షూలని రీసైక్లింగ్ చేసి కొత్త చెప్పులని తయారుచేస్తున్నారు.

Author:

మన చెప్పులు కొంచెం పాడైన వెంటనే కొత్త చెప్పులని కొనుక్కొని ఆ పాత చెప్పులని చెత్తలో పడేస్తాం, అలా పాడైయిపోయిన చెప్పులన్నీ చెత్తలో కలిసిపోవాల్సిందే, మనం అలా కొంచెం పాడైన ఆ చెప్పులని పడేసి కొత్త చెప్పులని, షూలని కొంటుంటాం, ఒకవైపు మనం పడేసిన చెప్పులు, షూలతో చాలా చెత్త పేరుకుపోతుంది, మరోవైపు మనదేశంలో చాలామంది ముఖ్యంగా పేద కుటుంబాలకి పిల్లలు చెప్పులు లేకుండా ఉంటున్నారు, ఈ పరిస్థితిని గమనించిన శ్రీయాన్స్ భండారి, రమేష్ ధామి అనే మిత్రులు ఒక మంచి ఆలోచనతో GreenSole అనే కంపెనీని స్థాపించారు.

ఈ గ్రీన్ సోల్ కంపెనీలో పాత చెప్పులని సేకరించి వాటిని రీసైక్లింగ్ చేసి కొత్త చెప్పులని తయారుచేస్తారు, అలా తయారుచేసిన వాటిని చెప్పులు లేని ప్రభుత్వ స్కూల్ పిల్లలకు, స్లమ్ ఏరియాలోని పిల్లలకు ఉచితంగా అందజేస్తారు, వీరి ఆలోచనకు చాలామంది చేత ప్రశంసలతో పాటు డబ్బు రూపంలో, పాత చెప్పుల రూపంలో విరాళాలు కూడా అందాయి, వీళ్ళకి దాదాపు 17 కార్పొరేట్ కంపెనీల నుండి సహకారం అందుతుంది.

గ్రీన్ సోల్

గ్రీన్ సోల్ కంపెనీ వాళ్ళు వివిధ నగరాలూ, పట్టణాలు తిరిగి సేకరించిన పాత చెప్పులు, షూలని మొదట జాగ్రత్తగా పరిశీలించి కొంచెం పాడైన చెప్పులని సరిచేస్తారు, మిగతా వాటిని పూర్తిగా రీసైక్లింగ్ చేసి వివిధ మోడల్ లలో కొత్త చెప్పులని తయారుచేస్తారు, వాటిని వివిధ స్వచ్ఛంద సంస్థలకి, అనాధ శరణాలయాలకి, గ్రామీణ ప్రాంతాలకి , ప్రభుత్వ పాఠశాలలకి ఉచితంగా పంపిస్తారు, మనం కూడా ఈ చెప్పులని ఆన్ లైన్ ద్వారా కొనుక్కోవచ్చు.

గ్రీన్ సోల్

కొన్ని కొన్ని నగరాలలో కాలేజీలు, సంస్థల సహకారంతో పాత చెప్పులని, షూలని సేకరిస్తున్నారు, పేద పిల్లలను ఆదుకునే విధంగా ఉన్న వీళ్ళ ఆలోచనని రతన్ టాటా, బరాక్ ఒబామా లాంటి దిగ్గజాలు కూడా మెచ్చుకున్నారు, అంతేకదా దేనికి పనికిరాదు అని మనం చెత్తలో వేసే చెప్పులతో వాళ్ళు కొత్త చెప్పులు తయారు చేసి చెప్పులు లేని వాళ్ళకి ఇస్తుండటం చాలా గొప్ప విషయం..!

గ్రీన్ సోల్

ఈ కంపెనీ గురుంచి మరిన్ని విషయాలకి Green Sole అనే వెబ్ సైట్ ని , www.facebook.com/greensole.in ఫేస్ బుక్ పేజీ ని చూడండి.

Comments

comments