Home / Inspiring Stories / కేరళ ప్రజలు చేసిన పని మన హుస్సేన్ సాగర్ కోసం మనం చేయలేమా.

కేరళ ప్రజలు చేసిన పని మన హుస్సేన్ సాగర్ కోసం మనం చేయలేమా.

Author:

ఎప్పుడైనా సాయంత్రాలు చల్లటి గాలిలో ట్యాంక్ బండ్ మీద కూచున్నారా..? అక్కడ హుస్సేన్ సాగర్ మధ్యలో నిలబడ్డ బుద్దుడూ..ఎగిరే పక్షులూ… ఆహా ఎంత ఆనందంగా ఉంటుందో కదా..! ముఖ్యంగా నీటి పై నుండి వచ్చే చల్లని గాలీ దాని పరిమళం… ఏంటలా మొహం పెట్టారు? పరిమళమా పాడా అది “గబ్బు” అంటారు కదా మరి ఆ గబ్బు ఎవరిదీ ఎక్కడ నుంచి వచ్చిందీ…దాన్ని అలా చేసిందెవరూ అని ఎప్పుడైనా ప్రశ్నించుకున్నారా..? దాన్ని శుబ్రం చేయాలని ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా పరిస్థితి అలానే ఉంది. సాగర్ జలాలు పూర్థిస్థాయి కాలుష్యం తో నిండిపోయాయి. ఈపుడు ఆ జాలాలని ఎవరు శుబ్రపరచాలి? ఈ సంఘటన చదివితే మంకూ కొన్ని సమాధానాలు దొరకొచ్చు..

Hussain Sagar

కేరళ లోని కోజికోడ్ ప్రాంత ప్రజలు చాలాకాలం ఇలానే ప్రజలూ మన లానే కొల్లాం చిరా అనే సరస్సుని నిర్లక్ష్యం చేసారు.. ఫలితం..! సరస్సు పూర్తిగా కాలుష్యం తో నిండిపోయింది. అది చెత్త చెదారం పేరుకుపోయి చూడటానికే ఎబ్బెట్టుగా తయారైంది. ఎంతోకాలంగా అక్కడి ప్రజలు ఆ చెత్తను చూస్తూ ముక్కుమూసుకుని వెళ్లిపోయారే తప్ప ఒక్కరు కూడా దాని గురించి పట్టించుకోలేదు.తెలంగాణా ప్రభుత్వం లాగానే రాష్ట్రంలోని చెరువు కుంటల్లోని వ్యర్థాలను తొలగించేందుకు కేరళ రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసినా ఎన్ని చర్యలు తీసుకున్నా ఆ కొల్లాం సరస్సు పరిస్థితి మాత్రం అలాగే ఉండిపోయింది. ఒకప్పుడు చూడటానికి అందంగా కనిపించే ఆ కొలను ఎలా దయనీయంగా మారిపోయిందో అని మనసులో అనుకునే వారేగానీ ఎవ్వరూ పెద్దగా పట్టించుకోలేదు.

Kerala Clean Up 2

దాదాపు పద్నాలుగు ఎకరాల వెడల్పు ఉన్న ఆ చిన్న సరస్సును ఎలాగైనా బాగు చేయించాలనే ఆలోచన చేసారు ఆ జిల్లా కలెక్టర్ ఎన్ ప్రశాంత్ భూషణ్. అయితే ఆయన దీనికి ప్రభుత్వ పథకాల సాయం తీసుకోదలచుకోలేదు అక్కడ ఉన్న ప్రజల్లోనే దీనిపై అవగాహన తెప్పించాలనుకున్నాడు. దాని కోసం బలమైన సమాచార వ్యవస్థ ఫేస్ బుక్ ని వాడుకున్నాడు.అందుకే ఈ సరస్సు గురించిన వివరాలనూ,దాని పరిస్థితి నీ,ఇప్పుడు తాను చేయాలనుకుంటున్న పనినీ ఫొటోలతో సహా సోషల్ మీడియాలో పెట్టాడు. అంతేకాదు బిర్యానీ కూడా ఆఫర్ చేశారు.

Kerala Clean Up 5

అంతే 24 గంటల్లో దీనికి భారీ ఎత్తున స్పందన రావడమే కాకుండా దాదాపు నాలుగు గంటల పాటు ఆ చెరువులోకి దిగి చిన్నా, పెద్దా, అధికారి, కూలీ అనే వ్యత్యాసం లేకుండా తలా ఓ చేయి వేసి చెరువును బాగుచేసే పనిలో పడ్డారు. ఆ చెరువుకు పాత కళను తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో స్వయంగా కలెక్టర్ కూడా స్వయంగా పాలు పంచుకున్నారు తన సూటూ బూటూ వదిలేసి చెరువులోకి దిగి పని చేశారు.

kerala-clean-up

ఆ తర్వాత మొదలైంది అసలు సందడి.. అప్పటి వరకు చెరువు కుంటలో దిగి సహాయం చేసిన కలెక్టర్ ఆ వెంటనే గరిటె పట్టి వంటలు చేయడంలో కూడా పాల్గొన్నారు. ఘుమఘుమలాడే వంటలు చేయించి తన ఆలోచనకు మద్దతుగా దిగిన ప్రజలకు కూడా సేవ చేసారు. స్వయంగా ఆయనే భోజనం వడ్డించారు. అంతే కాకుండా వారితో కలిసి సహపంక్తి భోజనం చేశారు.ప్రశాంత్ భూషన్ ఇదొక్కటే కాదు ‘కంపాషనేట్ కోజికోడ్’ అనే ప్రత్యేక సంస్థను కూడా స్థాపించి దాని ద్వారా పలు సంక్షేమ కార్యక్రమాలు తానే ముందుండి వ్యక్తిగతంగా నిర్వహిస్తున్నారు.

Kerala Clean Up 4

Kerala Clean Up 3

ఇలాంటి ఒక్క అధికారి,ప్రజలలో ఈ దేశం నాది,ఈ పరిసరాలు నావి అనే భావన కలిగించి పనుల్లో వాళ్ళనీ భాగస్వాములను చేసే IAS లు ఇంకా ఉన్నారు మనం చేయాల్సిందల్లా వారికి మన సహకారం అందించటమే. మనం చేసిన తప్పుని మనమే కదా సరిదిద్దుకోవాలి… ప్రశాంత్ భూషన్ కి హ్యాట్సాఫ్ చెప్పటం తోనే మన భాధ్యత ఐపోలేదు…. మనమూ ఒక్క ఆలోచన చేద్దాం మన హుస్సేన్ సాగర్ వైపు అడుగులేసే దిశగా ఆలోచిద్దాం…

(Visited 2,298 times, 28 visits today)