EDITION English తెలుగు
"పీవీ సింధు..మమ్మల్ని క్షమించు"   Video: ప్రియురాలి శవానికి తాళి కట్టి పెళ్లి చేసుకున్న ప్రేమికుడు.   Video: ఒక్క పాటతో ఇంటర్నెట్ ని ఊపేస్తున్న మల్లు బ్యూటీ..!   నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా చేసాడు.. సంపాదించిన ఆస్తి రూ.3930 మాత్రమే..!   మహేష్ బాబు, అల్లు అర్జున్ లకు షాక్ ఇచ్చిన రజినీకాంత్..!   లవర్స్ మధ్య జరిగిన ఈ వాట్సాప్ చాట్ లు చూస్తే ఖచ్చితంగా నవ్వుకుంటారు..! 3వది అయితే హైలైట్..!   మహారాజశ్రీ హైకోర్టు న్యాయమూర్తి గారికి....! కదిలించిన జెడ్పి విద్యార్థినిల లెటర్..!   హైదరాబాద్ లోని ఈ హాస్పిటల్ లో రూ. 10 లక్షలు అయ్యే చికిత్సలు అన్ని ఉచితం..!   తల్లి చనిపోతూ తన కొడుక్కి రాసిన లెటర్..! అది చదివితే కన్నీళ్లొస్తాయి...!   బీటెక్ స్టూడెంట్స్ కు నెలకు రూ.80వేల స్కాలర్ షిప్.
Home / Inspiring Stories / ప్రభుత్వం నాకు జీతం ఇస్తుంది, లంచం అవసరం లేదు అని బోర్డు పెట్టిన ప్రభుత్వ ఉద్యోగి.

ప్రభుత్వం నాకు జీతం ఇస్తుంది, లంచం అవసరం లేదు అని బోర్డు పెట్టిన ప్రభుత్వ ఉద్యోగి.

Author:

ప్రభుత్వ ఆఫీస్ లలో ఏదైనా పని జరగాలంటే ఖచ్చితంగా ఎంతో కొంత డబ్బుని లంచం రూపంలో సమర్పించుకోవాల్సిందే, లంచం ఇవ్వకుంటే అసలు పనే కాదు అనేంతగా ప్రభుత్వ ఆఫీస్ లు అవినీతిలో కూరుకుపోయాయి, ఎక్కడో ఒక చోట నిజాయితీగా పని చేసే అధికారులు ప్రజలని లంచం కోసం పీడించకుండా ఉంటారు, ప్రభుత్వ ఆఫీస్ లలో లంచం తీసుకునే సంస్కృతిని పారద్రోలడానికి కేరళ ప్రభుత్వ ఉద్యోగి ఒక కొత్త మార్గంలో తనవంతు ప్రయత్నిస్తూ అందరి చేత మన్ననలు అందుకుంటున్నాడు.

ర‌ళ‌కు చెందిన అబ్దుల్ స‌లీమ్ ప‌ల్లియ‌ల్‌తోడి అంగ‌డిపురం పంచాయ‌తీ ఆఫీసులో క్ల‌ర్క్‌గా ప‌నిచేస్తున్నాడు. లంచం అనే మాట త‌న‌కు చిరాకు తెప్పిస్తుంద‌ని చెబుతున్నాడు. ప్ర‌జ‌ల‌కు సేవ‌చేసేందుకు ప్ర‌భుత్వం త‌న‌కు రోజుకు రూ.811 నెల‌కు రూ.24,340 చెల్లిస్తోందంటూ త‌ను ప‌నిచేసే డెస్క్ వ‌ద్ద ఒక బోర్డు ఉంచాడు. అంతేకాదు త‌న సేవ‌ల‌తో ప్ర‌జ‌లు తృప్తి పొంద‌కుంటే త‌న‌కు చెప్పాల్సిందిగా ఆ బోర్డుపై రాసి ఉంచాడు.

/this-kerala-clerks-anti-bribery-message-is-winning-hearts-on-the-internet

గ‌త‌మూడేళ్లుగా ఆ పంచాయ‌తీ ఆఫీసులో ప‌నిచేస్తున్న స‌లీం త‌న పే స్కేల్ మారిన‌ప్పుడ‌ల్లా క్ర‌మం త‌ప్ప‌కుండా త‌న జీతం బోర్డుపై రాస్తున్న‌ట్లు ఆఫీస్ స్టాఫ్ చెబుతోంది. త‌మ ప‌నుల‌పై అక్క‌డికి వ‌చ్చిన కొంద‌రు వ్య‌క్తులు స‌లీం పెట్టిన బోర్డును చూసి ఫోటో తీసి సోష‌ల్ మీడియాలో పోస్టు చేయ‌డంతో దేశ‌వ్యాప్తంగా వైర‌ల్ అయ్యింది. దీంతో అవినీతి లేని స‌మాజం కోసం స‌లీంలాంటి వ్య‌క్తులు అవ‌స‌ర‌మ‌ని చాలామంది త‌మ అభిప్రాయాల‌ను షేర్ చేస్తున్నారు. ఇందులో కేంద్ర‌మంత్రి వెంక‌య్య‌నాయుడు కూడా ఉన్నారు.

40శాతం పోలియోతో బాధ‌ప‌డుతున్న‌ప్ప‌టికీ స‌లీం ఏనాడు అది చూసి కుంగిపోలేదు, ప్రజలు ఎలాంటి సహాయం కోరిన త‌న‌కు చేత‌నైనంత స‌హాయం చేస్తాడు, చుట్టుపక్కల గ్రామాలలో పర్యటిస్తూ ప్రజలకి తమ హక్కుల గురుంచి అవ‌గాహ‌న కూడా క‌ల్పిస్తున్నాడు, అలాగే ఆ ప్రాంతంలో దాదాపు అన్ని ప్రభుత్వ కార్యాయాలలో లంచం అనేది లేకుండా పని జరుగుతుంది అంటే అది సలీమ్ కృషి వల్లనే అని అక్కడి అధికారులు , ప్రజలు గొప్పగా చెప్పుకుంటున్నారు, తన కోసం కాకుండా ప్రజల కోసం ఆలోచిస్తున్న సలీంకి హాట్స్ ఆఫ్.

Comments

comments