అన్ని కార్డులలో ఈ పెళ్ళి కార్డు స్టైలే వేరయ్యా….

Author:

ఈ మధ్య జనాలకు వింత వింత ఆలోచనలు వస్తున్నాయి. ఇప్పుడు శుభలేఖలను వెరైటీగా డిజైన్ చేయటం వింత అయిపోయింది. ఇటీవల గాలి జనార్దన్ రెడ్డి తన కూతురి పెళ్లి కోసం కేవలం ఒక్క శుభలేఖ ఆరువేల రూపాయలతో డిజైన్ చేయించాడు. ఈ శుభలేఖ గురించి దేశమంతా చర్చించుకున్న విషయం అందరికి తెలిసిందే. అందరూ ఖర్చు పెట్టి డిజైన్ చేయించుకోలేరు. కానీ, తన పెళ్ళి కొరకు ఏమాత్రం ఎక్కువ మొత్తంలో ఖర్చు చేయకుండా.. తక్కువ మొత్తంలోనే అందరూ ఆశ్చర్యపోయేలా శుభలేఖను డిజైన్ చేసుకున్నాడు కొత్తపల్లి మూర్తి.

marriage wedding card designed as aadhar card

అత‌ని పూర్తి పేరు కొత్త‌ప‌ల్లి మూర్తి. తూర్పు గోదావ‌రి జిల్లాలోని కడియం మండలం, బుర్రిలంక‌ అనే గ్రామస్థుడు. అతను చేసేది న్యాయ‌వాద వృత్తి. అయితే అతనికి ఫిబ్ర‌వ‌రి 1న పెళ్లి ముహూర్తం ఫిక్స్ అయింది. ఫిబ్రవరి ఒకటిన జరిగే తన పెళ్ళికి బంధుమిత్రులని ఆహ్వానించుటకై రొటీన్‌గా కాకుండా కాస్త వెరైటీగా శుభలేఖను ఆధార్ కార్డు రూపంలో డిజైన్ చేయించాడు. మూర్తి తన స్నేహితుల ఇళ్లకు వెళ్లి కార్డులు ఇస్తుంటే… అందరూ మొదట ఆధార్‌కార్డు ఇస్తున్నారేంటి? అని ఆశ్చర్యపోతున్నారు. పరిశీలించాక..‘భలేగుంది’ అని మెచ్చుకుంటున్నారు.

Also Read: ఈ కోడి మాంసం కిలో రూ.900 , కోడిగుడ్డు రూ.50…! ఈ కోడిలో ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసా..?

(Visited 2,637 times, 206 visits today)