Home / Inspiring Stories / ఏడు సంవత్సరాల వయసులో ఉన్న చిన్నారి చూడకూడని సంఘటనలని నేను చూసాను.

ఏడు సంవత్సరాల వయసులో ఉన్న చిన్నారి చూడకూడని సంఘటనలని నేను చూసాను.

Author:

humans of bombay

ఏ పసిపాపా ఇటువంటి జీవితాన్ని చూడకూడదు..మరే చిన్నారి మనసూ ఇంతలా ఖోబించకూడదు..కానీ ప్రతీ పాపా ఇంతటి ఆత్మ విశ్వాసాని కలిగి ఉండాలి ప్రతీ లేత హృదయమూ ఇలాగే తన భవిష్యత్తును నిర్మించుకునే ధైర్యాన్ని కలిగి ఉండాలి.. హ్యూమన్స్ ఆఫ్ బాంబే అనే ఒక ఫేస్ బుక్  పేజీ లో ఒక వర్థమాన బెల్లీ డాన్సర్ తన చిన్న నాటి జీవితానీ,ఇప్పటివరకూ తాను ఎదుర్కున్న భాదలనీ షేర్ చేసింది….

తాగుడుకు భానిసైన తన తండ్రి ఆమె తల్లిని కొట్టినప్పుడు ఎంతలా భయపడ్డారో,అతని విపరీత చర్యలు తన బాల్యాన్ని ఎంతగా చిత్ర హింసకు గురిచేసాయో ఒక్కొక్క విశయమూ చదువుతూంటే మీ కళ్ళలో నీళ్ళు రాక మానవు…

ఒక ఏడు సంవత్సరాల వయసులో ఉన్న చిన్నారి చూడకూడని సంఘటనలని నేను చూసాను. వేరు వేరు మతాలకు చెందిన అమ్మా నాన్నా ప్రేమించి పెళ్ళి చేస్కున్నారు కానీ ఏమైందో మరి. మా నాన్న చాగుడుకి బానిసయ్యాడు అమ్మని కొట్టేవాడు.తాగొచ్చి అమ్మను కొట్టేటప్పుడు తను గట్టిగా ఏడిస్తే నేనూ నాకన్నా చిన్నదైన నా చెల్లెలూ ఎక్కడ భయపడతామోనని మౌనంగా భరించేది. అయితే నాన్న దెబ్బ బలంగా కొట్టడం వల్ల వచ్చే శబ్ధాన్ని మాత్రం ఆమె ఎలా ఆపగలుగుతుందీ ఆశబ్దం నాకు వినిపించేది. ఆ రోజులు చాలా భయంకరంగా ఉండేవి. ఇప్పటికీ నాకు అమ్మభాదని చూస్తూ ఊరుకున్నందుకు సిగ్గుగా అనిపిస్తూంటుంది.

ఒక రోజు మానాన్న బాగా తాగి ఇంటికొచ్చాడు అది ఎప్పుడూ జరిగేదే. కానీ ఆరోజు అమ్మని అంతకుముందు కంటే గట్టిగా కొట్టాడు. అమ్మ స్పృహతప్పి పడిపోయింది ఏం చేయాలో అర్థం కాలేదు మేం కూడా అమ్మ పక్కనే వాలిపోయాం. తెల్లవారుజామున రెండింటి తర్వాత అమ్మ స్పృహలోకి వచ్చింది, చెల్లిని నన్నూ తీసుకుని బయటికి నడిపించింది. ఎవరికీ కనీసం కళ్లకి చెప్పులు కూడా లేవు. మేముండే వీధి నుంచి మెయిన్ రోడ్డుకు చేరుకున్నాం. అక్కడే ఉన్న ఒక నైట్ బార్ దగ్గరికి వెళ్ళాము చాలామంది గుంపులుగా ఉన్నారక్కడ. “అన్నా..! ఒక  ఫోన్ చేసుకోనివ్వవా..! అని కౌంటర్ మీద కూర్చున్నవ్యక్తిని అడిగింది అమ్మ.ఫోన్ తోపాటు మాకు బోజనం కూడా ఇచ్చాడు. తెల్లవారేదాకా బార్ పరిసర ప్రాంతాల్లోనే ఎదురుచూశాం. అమ్మమ్మా తాతయ్య వచ్చి మమ్మల్ని వాళ్లతో తీసుకొచ్చేశారు. ఆరోజు ఉదయించే సూర్యున్ని బస్సు కిటికీ లోనుంచే చూసాను. అమ్మా, అమ్మమ్మలు మమ్మల్ని కొత్త స్కూల్లో చేర్పించారు. మాపేర్లు కూడా మార్చారు. స్కూల్లో పాఠం వింటుండగా అప్పుడప్పుడు మా నాన్న గుర్తొచ్చేవాడు. భయం, బాధతో ఏడ్చేదాన్ని. ఇది గమనించిన అమ్మ నన్ను బిజీగా ఉంచేందుకు భరతనాట్యం క్లాసులకు పంపేది. డాన్స్లో పడ్డాక నా పాదాలతోపాటు జీవితం కూడా పరుగెత్తింది.ఇలా కొన్నేళ్ళకు ఒక వార్త తెలిసింది “మానాన్న చనిపోయాడట” నాకు కొంచం కూడా ఏడుపురా లేదు. కొన్ని మరణాలు ఏడుపుకు కూడా నోచుకోవు.

అమ్మ.. తన వల్లాయ్యేదానికంటే ఎక్కువ కష్టపడేది. కాలికి గజ్జెలు, బ్యాగ్ నిండా పుస్తకాలు, కడుపునిండా అన్నం. అన్నింటికీ మించి మనసు నిండా ప్రేమను పంచేది. ఆ చివరిదంటే నాకు చాలా ఇష్టం. భరతనాట్యం నేర్చుకున్న నేను మంచి కెరీర్ కోసం బెల్లీ డాన్సర్గా మారాలనుకున్నప్పుడు, కాంపిటీషన్లో పాల్గొనేందుకు ఒంటరిగా చైనాకు, ఇండియాలోని మిగతా ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చినప్పుడు అమ్మ అడ్డు చెప్పలేదు. మిగతా ఉద్యోగాలకంటే డాన్సర్ జీవితం కాస్త ప్రమాదకరమనే భయాలేవీ నూరిపోయలేదు.అమ్మ ప్రేమ కవచంలా ఉంటూ నన్నెప్పుడూ కాపాడుతుందని అమ్మ బలంగా విశ్వసిస్తుందనిపిస్తుంది. చెల్లి చదువుకుంటోంది. బెల్లీ డాన్సర్గా ఇప్పుడిప్పుడే నాకు పేరొస్తోంది. తప్పకుండా ముంబైలో ది బెస్ట్ డాన్సర్ను అవుతా. అమ్మ మాత్రం ఇంకా పనిచేస్తూనే ఉంది. రెస్ట్ తీసుకోమని చెప్పడం నాకూ ఇష్టం లేదు. ఎందుకంటే తను మాకోసమే కష్టపడుతోందన్ని ఫీలింగ్ను వదులుకోవటం ఇష్టంలేదు నాకు.

ఇలా సాగిన లేఖ ఒక ఆత్మ విశ్వాసపు ఫీలింగ్ ని మనలో నింపుతుంది. అప్రయత్నం గానే ఆ అమ్మాయి బావుండాలన్న కోరికా.ఆమెని ఒక్క సారి కలిస్తే బావుండన్న భావన కలుగుతాయి. Humans of Bombay అనే ఫేస్ బుక్ పేజ్ లోకి చూస్తే ఆమె మీకు కనిపించవచ్చు. మీలో ఆత్మవిశ్వాసమూ,మనిషి మీద నమ్మకమూ మరింతగా పెరగవచ్చు ట్రై చేయండి…

(Visited 385 times, 95 visits today)