Home / Inspiring Stories / హైదరాబాద్ లో ఇక టికెట్ లెస్ జర్నీ

హైదరాబాద్ లో ఇక టికెట్ లెస్ జర్నీ

Author:

Ticket less journey in Hyderabad City Busses

డబ్బులతో పని లేకుండా నే కార్డులతోనే కాలం గడిపే రోజుల్లోకొచ్చాం మనం. ఇప్పుడు కార్డులతో బిల్లులు కట్టటం మామూలుగా జరిగే విషయం..బస్సులో చిల్లర కోసం జరిగే గొడవలు చూస్తూనే ఉంటాం కదా..! మన సిటీ బస్సుల్లో అయితే మరీ ధారుణం అనుకోండీ కండక్టర్ కీ పాసింజర్ కీ మధ్య యుద్దాలు జరిగే సంఘటనలు మనకు సాధారణ దృశ్యాలే.. అదొక్కటే సమస్య కాదు కానీ టికెట్లూ చెకింగ్లూ వంటి జంజాటాలేం లేకుండా స్మార్ట్ ప్రయాణం బానే ఉంటుందికదా..! అందుకే నగరం లో స్మార్ట్ ప్రయాణం అందుబాటు లోకి తెచ్చే పనిలో పడింది మన ఆర్టీసీ ప్రస్తుతం ముంబయిలో కేవలం బస్‌పాస్‌లకే పరిమితమైన స్మార్ట్‌కార్డులను హైదరాబాద్‌లో బస్‌పాస్‌లతో పాటు, రోజువారి టిక్కెట్‌లకు కూడా వర్తింప చేస్తారు.అంటే ఇప్పుడు అమల్లో ఉన్న డే పాస్ తరహాలో అన్నమాట..

ఈ స్మార్ట్‌కార్డులు ప్రీపెయిడ్ తరహాలో ఉపయోగపడుతాయి. ప్రస్తుతం రైల్వేలో ఈ తరహా కార్డుల వినియోగం ఉంది. ఏటీవీఎంల ద్వారా ఇలాంటి ప్రీపెయిడ్ కార్డులను విక్రయిస్తున్నారు. ప్రయాణికులు తమ రోజువారి ప్రయాణాన్ని, అందుకయ్యే ఖర్చును దృష్టిలో ఉంచుకొని రూ.50,రూ.100 నుంచి రూ.500, రూ.1000 వరకు తమ అవసరాన్ని బట్టి స్మార్ట్‌కార్డులను కొనుగోలు చేయవచ్చు. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి హైటెక్‌సిటీ, మాధాపూర్, గచ్చిబౌలీ, తదితర ప్రాంతాల్లోని ఐటీ కారిడార్‌లకు రాకపోకలు సాగించే సాఫ్ట్‌వేర్ నిపుణులు, ఉద్యోగులకు స్మార్ట్‌కార్డులు చాలా సౌకర్యంగా ఉంటాయి. అలాగే నగరానికి వచ్చే పర్యాటకులు, సందర్శకులకు ఈ స్మార్ట్‌కార్డులు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. ఒక్కసారి కార్డు కొనుగోలు చేసి నగరమంతా పర్యటించేందుకు అవకాశం ఉంటుంది.

ఇప్పటికే రెండు రాష్ట్రాల అధినేతలకూ ప్రియమైన దేశం సింగపూర్ లో ఈ స్మార్ట్ కార్డ్ పద్దతే ఎప్పటినుంచో అమలులో ఉంది. ఈ తరహా సదుపాయాన్ని త్వరలో హైదరాబాద్ లో కూడా ప్రయోగాత్మకంగా అమల్లోకి తెచ్చేందుకు ఆర్టీసీ సన్నాహాలు చేపట్టింది. ఒకటి, రెండు ప్రధాన రూట్లలో ఈ ప్రాజెక్టు అమలు తీరును పరిశీలించిన తరువాత ఫలితాలను బట్టి మిగతా రూట్‌లకు విస్తరిస్తారు. సిటీ బస్సుల్లో టిక్కెట్ లెస్, క్యాష్‌లెస్ ప్రయాణ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు నెల రోజుల క్రితమే ఆర్టీసీ స్మార్ట్‌కార్డుల కోసం ప్రణాళికలను రూపొందించింది కూడా. ఈమద్యనే ఈ ప్రాజెక్టును అమలు చేసేందుకు ముందుకు వచ్చిన బాష్ కంపెనీ ఈ స్మార్ట్‌కార్డుల పనితీరు, వాటిని ఉపయోగించే విధానంపై బస్‌భవన్‌లో ఆర్టీసీ అధికారులకు ఒక డెమో ప్రదర్శన నిర్వహించింది. ఈ డెమో లో పాల్గొన్న ఆర్టీసీ ఉన్నతాధికారులు ఈ పద్దతిపట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు. త్వరలో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేపట్టారు. మొదట దిల్‌సుఖ్‌నగర్-పటాన్‌చెరు, సికింద్రాబాద్-కొండాపూర్, ఉప్పల్-హైటెక్‌సిటీ, సికింద్రాబాద్-శంషాబాద్ వంటి ఎక్కువ దూరం ఉన్న రూట్‌లలో రెండింటిని ఎంపిక చేసి మెట్రో లగ్జరీ, పుష్పక్ బస్సుల్లో ప్రవేశపెడతారు. ఆ తరువాత వాటి పనితీరు, ప్రయాణికులు స్మార్ట్‌కార్డులు వినియోగించే తీరునుబట్టి మిగిలిన రూట్లకూ విస్తరించాలా వద్దా అనేది నిర్ణయిస్తారు.

రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (ఆర్‌ఎఫ్‌ఐడీ) సాంకేతిక పరిజ్ఞానంతో పనిచేసే స్మార్ట్‌కార్డులలో మైక్రో చిప్‌లు ఏర్పాటు చేస్తారు.చూదటానికి ఒక పెద్ద సిం కార్ద్ లాగా ఉంటుంది. ఆ కార్డు విలువ అంటే మనం కట్టిన ప్రేపెయిడ్ మనీ అందులో నమోదై ఉంటుంది. కండక్టర్‌ల వద్ద ఉండే టిక్కెట్ ఇష్యూయింగ్ (టిమ్స్) మిషన్‌లకు స్మార్ట్‌కార్డులను కూడా స్వీకరించే మరో ఆప్షన్‌ను ఇస్తారు.మామూలుగా క్రెడిట్/డెబిట్ కార్డులలానే స్వైప్ చేస్తే చాలు మీ టికెట్ ఇస్స్యూ ఐపోయినట్టే. ప్రయాణికులు తాము పయనించిన దూరానికి చెల్లించవలసిన చార్జీలు స్మార్ట్‌కార్డు నుంచి నేరుగా ఆర్టీసీ ఖాతాలో జమ అయ్యే విధంగా ఈ టిమ్స్ యంత్రాలను అనుసంధానం చేస్తారు. బస్‌పాస్ కౌంటర్‌లతో పాటు, కండక్టర్‌ల వద్ద కూడా స్మార్ట్‌కార్డులు అందే ఏర్పాటు చేయనున్నారు… మొత్తానికి హైదరాబాద్ కాస్త కాస్త సింగపూర్ కి దగ్గరౌతున్నట్టే ఉంది..

Must Read: వైఫై స్పీడ్ ని పెంచుకోవాలంటే బీరు తాగండి.

(Visited 4,982 times, 8 visits today)