EDITION English తెలుగు
కాలా సినిమా రివ్యూ & రేటింగ్.   డేవిడ్ వార్నర్ మరియు భార్య కాండిస్ బాల్-టాంపెరింగ్ కుంభకోణం తరువాత గర్భస్రావం చేస్తారు   చైనా హఫీజ్ సయీద్ ను వెలుపలికి వెలుపల కోరుకుంటున్నారు.   MH17 రష్యన్ సైనిక క్షిపణి వ్యవస్థ డౌన్ కూలిపోయింది, పరిశోధకులు చెప్పారు   అమెరికాపై ఆధారపడిన సంబంధం భారత్కు ఎప్పటికీ ఉండదు: నిపుణుడు కాంగ్రెస్ సభ్యులకు చెబుతాడు   హెల్త్కేర్ యాక్సెస్ అండ్ క్వాలిటీలో 195 దేశాలలో నెమ్మదిగా మెరుగుపరుచుకోవడం, భారతదేశం రాంక్స్ 145   ఢిల్లీ మనిషి తన కుమారుని హతమార్చాడు   పెట్రోల్ ధరలు పెరగడంతో పలు నగరాల్లో 80 రూపాయల మేరకు ధరలు పెరిగాయి   కేరళ ప్రభుత్వం గత 24 గంటల్లో బాధిత ప్రాంతాల్లో తాజా కేసులను నమోదు చేయకుండా, సమయానుగుణ జోక్యం ద్వారా వ్యాప్తిని తగ్గించింది.   మనిషి ఇండోర్-గోవా ఇండిగో విమానంలో టేకాఫ్ ముందు తన ప్రియురానికి ప్రతిపాదించాడు.

సహజంగా బరువు తగ్గడానికి అధ్బుతమైన టిప్స్..!

Author:

ఈ రోజుల్లో ఎక్కువగా ప్రజలు ఇబ్బంది పడుతున్న సమస్య అధిక బరువు, ఈ సమస్య ముఖ్యంగా యువతరం మీద చాలా ప్రభావం చూపిస్తుంది. దీనితో యువకులు ఆలోచన విధానం మారిపోయి వారు అనుకున్న రంగంలో రాణించలేక పోతున్నారు. కొందరు అధిక బరువు ఉండి  ఎలాంటి పని చేయలేకపోతున్నాం అని అర్థంతరంగా తనువూ  చాలించినవారు చాలా మంది ఉన్నారు. ఈ అధిక బరువు ఉన్నవారి కోసం  పట్టణాలలో అనేక వ్యాయామ శాలలు, అలాగే అనేక ఆసుపత్రిలు కొత్త రకమైన ట్రీట్ మెంట్ లతో  చాలా డబ్బులు గుంజుతున్నారు. మరి ఇలాంటి ఖరీదైన సమస్యకు ఇంట్లోనే పరిస్కారం లభిస్తే ఎలా ఉంటుందో ఒక్కాసారి ఆలోచించండి…. అవును మీరు ఇప్పుడు ఇంట్లోనే ఉండి ఆధిక బరువు నుండి విముక్తులు కావొచ్చు.

Tips-To-reduce-weight-naturally

కృత్రిమ పద్దతులలో బరువు తగ్గడం వలన భవిష్యత్ లో ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి సహజ పద్ధతుల్లో బరువు తగ్గవచ్చు, సహజ పద్దతాల్లో ప్రయతించడం వల్ల ఎటువంటి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం లేదు, ఈ మధ్య కాలంలో చాలా మంది హాస్పిటల్ ల చుట్టూ తిరగటం మానేసి ఇంట్లో ఉండే సహజంగా శరీరంలోని కొవ్వుని కరిగించుకుంటున్నారు, అలా ఎక్కువ మంది ప్రయత్నించిన కొన్ని చిట్కాలని మీకోసం కింద ఇవ్వడం జరిగింది.

సహజంగా బరువు తగ్గడానికి ఉపయోగపడే చిట్కాలు:

  1. అధిక బరువుకు ముఖ్య కారణం అధిక ఆహారపు అలవాటు, అలాగే కొవ్వు పదార్థాలు ఉండే ఆహారం కావున ఉదయం పూట ఎక్కువగా ప్రోటీన్స్ ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ఇలా చేయడం వలన రోజంతా తక్కువగా ఆకలి అవుతుంది. దానితో తక్కువగా ఆహారం తీసుకుంటాం.
  2. మనం ఏమైనా తినే సమయంలో తొందరతొందరగా తిన కూడదట, అలా తినడం వలన ఆహారం తొందరగా జీర్ణం కాకుండా అజీర్తి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటున్నారు నిపుణులు.
  3. కొవ్వు, ఆయిల్, ఐస్ పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారానికి దూరంగా ఉండటమే చాలా మేలు
  4. అలాగే ఆహారం తీసుకునే ముందు రెండు గ్లాసుల నీరు తాగడం వలన ఆహారం తక్కువగా తీసుకుంటాం.
  5. సాల్యుబుల్ పైబ‌ర్ అనేది ఎక్కువగా కొవ్వుని కరిగిస్తాయట! ఇవి ఎక్కువగా పచ్చి కూరగాయలు, పచ్చి పండ్లు, అలాగే బార్లీ, న‌ట్స్, సీడ్స్, బీన్స్, లెంటిల్స్ , బ‌ఠాణీలు వంటి వాటిలో ఎక్కువగా ఉంటుంది అందుకని వీటిని ఎక్కువగా తినాలి.
  6. కాఫీ, టీ తాగడం వలన బరువు పెరుగుతుంది అనుకుంటారు చాలా మంది కానీ వీటిలో ఉండే కెఫిన్ జీవక్రియల్ని పెంచుతుంది.
  7. మనం ఆహారం తినే సమయంలో తినే ప్లేట్ పెద్దగా ఉంటే ఎక్కువ ఆహారం పడుతుంది దానితో ఎక్కువగా తింటాం. అందుకని చిన్న ఫ్లేట్ లో తినడం మంచింది ఎందుకంటే దానిలో తక్కువ ఆహారం పడుతుంది.
  8. ఒక మనిషి ఆరోగ్యం కంటి నిండా నిద్ర, కంటి నిండా నిద్రపోవడం కూడా ఒక వ్యాయామమే. కంటి నిండా నిద్రపోతే బరువు తగ్గొచ్చు.
  9. అలాగే ప్రతి మనిషి ప్రతి రోజు ఎంతో కొంత వ్యాయామం చేయాలి ఎందుకంటే రక్త ప్రసరణ వ్యావస్థ అనేది చురుకుగా పని చేయాలంటే తప్పని సరిగా వ్యాయామం చేయాలసిందే, వ్యాయామంతో వంట్లో ఉండే కొవ్వు కరుగుతుంది,రక్త ప్రసరణ వ్యవస్థ కూడా సక్రమంగా జరుగుతుంది..
(Visited 5,729 times, 524 visits today)

Comments

comments