Home / Entertainment / కిషోర్ కోసం క్యూ కడుతున్న స్టార్ హీరోలు, పెద్ద నిర్మాతలు.

కిషోర్ కోసం క్యూ కడుతున్న స్టార్ హీరోలు, పెద్ద నిర్మాతలు.

Author:

Nenu Sailaja Director

ఇప్పుడు టాలీవుడ్ దర్శకుల్లో హాట్ టాపిక్ గా మారిన పేరు… కిషోర్ తిరుమల. గత అయిదు చిత్రాలలో వరుస ఫ్లాపులతో సతమతమవుతూ వస్తున్న హీరో రామ్ కి ‘నేను..శైలజ’ చిత్రంతో సూపర్ హిట్ ఇచ్చి హీరోగా రామ్ కెరీర్ కి మంచి బ్రేక్ ఇచ్చిన దర్శకుడు. ఒక విభిన్న కథ కథనంతో నేను శైలజ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ దర్శకుడు తన డైలాగులు, దర్శకత్వంతో టాలీవుడ్ స్టార్ హీరోలను సైతం ఆకట్టుకున్నాడు. ‘సెకండ్ హ్యాండ్’ చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన కిషోర్ తిరుమల, ధనుష్ హీరోగా నటించిన ‘రఘువరన్ బిటెక్’ చిత్రానికి డైలాగులు రాసిన కిషోర్ ఆ చిత్రంతో మంచి పేరు తెచ్చుకున్నాడు. తన రెండవ చిత్రం ‘నేను..శైలజ’ తో సూపర్ హిట్ కొట్టాడు దీంతో ఈ దర్శకుడితో సినిమా చేయాలనీ టాలీవుడ్ లోని ప్రముఖ నిర్మాతలు, హీరోలు వెంటపడుతున్నారు.

అందుకు కారణం ఒక తక్కువ బడ్జెట్ లో ‘నేను..శైలజ’ ని పూర్తి చేయడంతో పాటు, ఫ్లాప్ హీరోగా ఉన్న రామ్ కే అంత మంచి హిట్ ఇస్తే హిట్స్ లో ఉన్న మాకెంత సూపర్ హిట్ ఇవ్వగలడోనని స్టార్ హీరోలు సైతం లెక్కలు వేసుకుంటున్నారు. ఇక రామ్ తన తదుపరి చిత్రాన్ని కూడా కిషోర్ తిరుమల దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని స్రవంతి మూవీస్ బ్యానర్ పై నిర్మించనున్నారు.

(Visited 264 times, 9 visits today)