EDITION English తెలుగు
బాలకృష్ణపై నాగబాబు షాకింగ్ కామెంట్స్.! అసలు బాలకృష్ణ గురించి ఎందుకు టాపిక్ వచ్చింది?   ఈ స్వీట్ కేజీ 9000 రూపాయలు అంట.! అంత ధర ఎందుకో తెలుసా.? ఎలా తయారుచేస్తారంటే?   ముంబై ఎయిర్ పోర్ట్ లో సరికొత్త రికార్డ్.! అంబానీ కూతురు పెళ్లా మజాకా...!   పాతబస్తీలో ఓటింగ్ తగ్గడానికి కారణం అదేనంట.? ఆలస్యంగా వెలుగులోకి.!   సోదరి సుహాసిని తరుపున ఎన్ఠీఆర్ ఎందుకు ప్రచారం చేయలేదో తెలుసా.? కారణం ఇదేనట!   చాలామంది పండ్లపై ఉప్పు చల్లుకొని తింటారు..! అలా తినడం వల్ల ఏమవుతుందో తెలుసా.?   2014లో ఎంత శాతం మంది ఓట్లు వేసారో తెలుసా.? ఇప్పుడు మారిన లెక్కల వల్ల గెలుపు తారుమారవుతుందా.?   రాజమౌళి, ఎన్ఠీఆర్ ఓట్లు వేశారు.! మరి రామ్ చరణ్ ఎందుకు వేయలేదు.? అసలు కారణం ఇదే!   పాటలు పాడుతూ.. స్టెప్‌లు వేసిన కోహ్లీ.! మైదానంలో కోహ్లీ వెరైటీ డాన్స్ వైరల్ వీడియో.!!   గుత్తాజ్వాల ఓట్ల గల్లంతుపై మరో సంచలన ట్వీట్..! నెట్ లో చూస్కుంటే..?
Home / General / అతడిని కోటీశ్వరుడిని చేసిన ఒక ట్రాఫిక్ పోలీస్ చేసిన తప్పు

అతడిని కోటీశ్వరుడిని చేసిన ఒక ట్రాఫిక్ పోలీస్ చేసిన తప్పు

Author:

న్యూయార్క్ నగరంలోని ట్రాఫిక్ పోలిస్ చేసిన తప్పుడు ఛ‌లానా ఒలివ‌ర్ అనే యువకుడిని మిలియనీర్ ని చేసింది. ఏప్రిల్ 2015 లో ఒలివర్ అనే యువకుడు తన కార్ ని డ్రైవ్ చేస్తూ డ్రైవింగ్ అండర్ ఇన్ఫ్లుఎన్స్ (DUI) కింద ఛ‌లానా కట్టమని ఒక ట్రాఫిక్ పోలీస్ అతనిపై కేసు వేసాడు. ఒలివర్ తాను  త్రాగి కారు నడపడం లేదని చెప్పినా కూడా అతను వినిపించుకోకుండా అతనిపై ఛ‌లానా విధించాడు.

ట్రాఫిక్ పోలీస్ తనపై విధించిన ఛ‌లానాని ఛాలెంజ్ చేస్తూ ఒలివర్ న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. తన డ్రైవింగ్ లైసెన్స్ ని రద్దు పరిచిందే కాకుండా, తనని మానసికంగా శారీరకంగా కూడా గాయపరిచాడంటూ పేర్కొన్నాడు. అతడు తన కారుని బ్రూక్లిన్ లో క్రాష్ చేసాడని, తను తాగి కారు నడపలేదని ఎంత చెప్పినా వినకుండా దురుసుగా ప్రవర్తించి తనకు జరిమానా విధించాడని చెప్పాడు. క్రాష్ అయిన కార్ ని తిరిగి ఇన్సూరెన్స్ ద్వారా రిపేర్ చేయించడానికి వీలు లేకుండా తన డ్రైవింగ్ లైసెన్స్ ని రద్దు చేసాడని చెప్పాడు.

కేసుని ఇన్విస్టిగేట్ చేసిన‌ సిబ్బంది ఒలివర్ చెప్పింది అంతా నిజమేనని, ఆ పోలీసు ఆఫీసర్ అతనిపట్ల చాలా దురుసుగా ప్రవర్తించాడని న్యాయస్థానానికి నివేదిక సమర్పించారు. ఆ పోలీసు ఆఫీసర్ నిజాన్ని దాచి అబద్దపు సాక్ష్యాలను సమర్పిచాడని, ఒలివర్ పట్ల దుర్మార్గంగా ప్ర‌వ‌ర్తించాడ‌ని తేలడంతో, కోర్టు ఒలివర్ కి  1 మిలియన్ డాలర్లు పోలీసు డిపార్టుమెంటు నుండి నష్ట పరిహారంగా అందచేయల్సినదిగా తీర్పునిచ్చింది.

తెలుగు డాట్ అలజడి డాట్ కామ్ ను ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌,ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.

(Visited 1 times, 1,549 visits today)