EDITION English తెలుగు
కాలా సినిమా రివ్యూ & రేటింగ్.   డేవిడ్ వార్నర్ మరియు భార్య కాండిస్ బాల్-టాంపెరింగ్ కుంభకోణం తరువాత గర్భస్రావం చేస్తారు   చైనా హఫీజ్ సయీద్ ను వెలుపలికి వెలుపల కోరుకుంటున్నారు.   MH17 రష్యన్ సైనిక క్షిపణి వ్యవస్థ డౌన్ కూలిపోయింది, పరిశోధకులు చెప్పారు   అమెరికాపై ఆధారపడిన సంబంధం భారత్కు ఎప్పటికీ ఉండదు: నిపుణుడు కాంగ్రెస్ సభ్యులకు చెబుతాడు   హెల్త్కేర్ యాక్సెస్ అండ్ క్వాలిటీలో 195 దేశాలలో నెమ్మదిగా మెరుగుపరుచుకోవడం, భారతదేశం రాంక్స్ 145   ఢిల్లీ మనిషి తన కుమారుని హతమార్చాడు   పెట్రోల్ ధరలు పెరగడంతో పలు నగరాల్లో 80 రూపాయల మేరకు ధరలు పెరిగాయి   కేరళ ప్రభుత్వం గత 24 గంటల్లో బాధిత ప్రాంతాల్లో తాజా కేసులను నమోదు చేయకుండా, సమయానుగుణ జోక్యం ద్వారా వ్యాప్తిని తగ్గించింది.   మనిషి ఇండోర్-గోవా ఇండిగో విమానంలో టేకాఫ్ ముందు తన ప్రియురానికి ప్రతిపాదించాడు.

అంతరిస్తున్న సహజ నివాసాలు- టునీషియా భూ గర్భ గృహాలు

Author:

ఆదిమ మానవులు గుహలలో నివసించారని మనం చదువుకొన్నాం. ఆధునిక విల్లాలు, గేటెడ్ కమ్యూనిటీలు ఏర్పాటు చేసుకొంటున్న ఈరోజుల్లో కూడా ఇంకా భూగర్భంలో నివాసాలు ఏర్పరచుకొని నివసిస్తున్న వారు ఉన్నారని మీకు తెలుసా?

3

టునీషియా దేశంలో ఇప్పటికీ చాలా మంది భూ గర్భాన్ని తొలిచి తయారు చేసుకొన్న గృహాలలోనే నివసిస్తున్నారు.ఇందుకు కారణం యుద్ధ భయమో, మరొకటో కాదు ఎడారిని తలపించే ఆదేశ వాతవరణ పరిస్థితులే! అతి ఉష్ణం, అతి శీతల పరిస్థితులను తట్టుకొనే సాంప్రదాయ గుండ్రంగా తవ్వి తొలిచిన ఇళ్ళలోనే నివసిస్తున్నారు. అంతేకాదు ఆఇళ్ళలో కరెంటు ,గ్యాస్ లాంటి ఆధునిక సౌకర్యాలు కూడా ఉన్నాయి. ఈ ఇళ్ళ గురించి మొదటిసారి స్టార్ వార్స్ సినిమా వల్ల ప్రాచుర్యం లభించింది. ఆసినిమాలో కొంత భాగం ఈ భూగృహాల్లోనే చిత్రీకరించారు.

4

అయితే ఆధునిక నివాసాలు పెరగడం, వలసలు, ఉపాథి లేకపోవడం, పట్టణీకరణ వంటి కారణాలతో చాలా మంది తమ భూ గృహాలు వదిలి వెళ్ళి పోతున్నారట. ఇది వరకు చాలా మంది టూరిస్టులు తమ ఇళ్ళను చూసేందుకు వచ్చే వసరని ఇప్పుడు వారి సంఖ్య కూడా తగ్గుముఖం పట్టిందని స్ధానికులు వాపోయారు. అయినప్పటికీ కొన్ని భూ గృహాలను హోటళ్ళు రిసార్టులుగా మార్చి నిర్వహిస్తున్నారు. ఏదేమైనా ఈఅరుదైన సహజ నివాసాలు అంతరించటం బాధాకరమే!

తెలుగు డాట్ అలజడి డాట్ కామ్ ను ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌,ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.

(Visited 1 times, 226 visits today)

Comments

comments