Home / Devotional / తిరుమల శ్రీవారి సన్నిధి లో సేవ చేయాలని ఉందా…? అయితే ఈ వివరాలు మీ కోసమే .

తిరుమల శ్రీవారి సన్నిధి లో సేవ చేయాలని ఉందా…? అయితే ఈ వివరాలు మీ కోసమే .

Author:

అదిగో అల్లదిగో శ్రీహరి వాసము అనుకుంటూ తిరుమలలో ఉన్న కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవారిని దర్శించుకోవడం ప్రతి ఒక్కరి ఆశ. జీవితంలో ఒక్కసారైనా ఆ శ్రీవారిని దర్శనం చేసుకోవాలనీ, దర్శనం చేసుకున్నవారు ఆ దివ్యమంగళ స్వరూపం చూసి జన్మ ధన్యం అనీ అనుకుంటారు. అలాగే ఏడుకొండలవాడ వెంకట రమణ గోవిందా గోవిందా అంటూ వాలంటీర్ గా సేవ చేయాలనీ చాలామంది అనుకుంటారు. అయితే టీటీడీ వారం రోజులపాటు ఆలా సేవ చేసుకొనే అవకాశం కలిగిస్తోంది. మరి వాలంటీర్ గా సేవ చేయాలంటే ఏం చేయాలి.. ఇదిగోండి మీ కోసం ఆ వివరాలు…..

voluntary work opportunity in tirupati

వాలంటీర్ గా చేయాలనుకునే వారు నెల రోజుల ముందుగానే టీటీడీ కి వారి వివరాలు అందజేయాలి. ఖచ్చితంగా ఆధ్యాత్మిక జ్ఞానం కలిగి ఉండాలి మరియు స్త్రీ పురుష బేధం లేకుండా గ్రూప్ లో పది మందికి తక్కువ కాకుండా చూసుకోవాలి. గ్రూప్ కి ఒకరు కో ఆర్డినేటర్ గా వ్యవహరించి మీ పేరు, వయస్సు, ఊరు, చిరునామా తదితర వివరాలు తిరుమల సేవ సదన్ లో అందించాలి. ఏ కులము వారైనా పరవాలేదు హిందువులై ఉంటే నమోదు చేసుకోవచ్చు. ఆ గ్రూప్ లోని సభ్యులు 18 నుండి 60 ఏళ్లలోపు వారై ఉండాలి. ఇలా నమోదు చేసుకున్నాక టీటీడీ వారు సభ్యులకి తేదీలను కేటాయిస్తారు. ఇలా కేటాయించిన తేదీలలో ఉదయం 10 నుండి సాయంత్రం 5లోపు టీటీడీ సేవ సదన్ లోని ప్రజా సంబంధాల అధికారికి రిపోర్ట్ చేయాలి. విధించిన పనులలో మాత్రమే సభ్యులు తమ సేవను అందించాలి. ప్రత్యేకించి గర్భ గుడిలో, క్యూ లైన్లలో సేవ గురించి అధికారులను ఒత్తిడి చేయడం సరి కాదు. శ్రీవారి సన్నిధిలో సేవ చేయడం అదృష్టము గా భావించి సేవలు అందించడం మంచిది. ప్రతి రోజు సాయంత్రం 4 గంటలకు శ్రీవారి సేవ సదన్ లో ఈ డ్యూటీ లను కేటాయిస్తారు. కేటాయించిన ప్రదేశం లో మాత్రమే వాలంటీర్లు సేవలు అందించాలి.
సేవకులకు ఉచిత బస కల్పిస్తారు. పురుషులకి పీఏసీ -3 లో, మహిళలకు సేవ సదన్ లో వసతి కల్పిస్తారు. సేవకులు ఎవరి లాకర్ వారే కీస్ తెచ్చుకోవాలి. సేవ చేయడం అనేది ఒక గొప్ప భావన. అలాంటప్పుడు దాన్ని మనస్ఫూర్తిగా నిర్వర్తించడం మన ధర్మం.

  • సేవ సమయంలో టీటీడీ అందించే స్కార్ఫ్ ధరించడం తప్పనిసరి.
  • అలాగే క్యూ లైన్ లో వెళ్లే భక్తులను గోవిందా గోవిందా అని సంభోదించాలి.
  • నియమాలు పాటించక పోతే రెండేళ్ల వరకు సేవ చేసే అదృష్టం కోల్పోతారు.
  • ఈ సేవ ఒక యాత్రికుల కోసం ఉద్దేశించిన స్వచ్ఛంద సేవ కాబట్టి ఈ సేవకి ఎలాంటి చెల్లింపులు ఉండవు. కావున సేవకులు అలాంటివి దృష్టిలో పెట్టుకోవాలి.
  • తిరుమల లోని ఆస్థాన మండపం లో ప్రతి శుక్రవారం ఉదయం 9 నుంచి శిక్షణ తరగతులు ఉంటాయి .
  • ఈ తరగతులను తప్పనిసరిగా సేవకులు అటెండ్ చేయాలి.
  • శిక్షణలో పేర్కొన్న విధానంగా తమ విధులను పూర్తి చేయాలి.
  • సేవకులు తమ వెంట పిల్లలని పెద్దవారిని తీసుకురాకూడదు .
  • అలాగే సేవకులకు టీటీడీ ఖచ్చితమైన ఒక డ్రెస్ కోడ్ పెట్టింది – మగవారు -తెలుపు రంగు వస్త్రాలు . ఆడవారు- ఆరంజ్ కలర్ సారీ విత్ మెరూన్ బార్డర్.

ఇలా తమ సేవ పద్దతిని పాటించి శ్రీవారి సన్నిధి లో సేవ చేసుకొనే అదృష్టం మీ సొంతం చేసుకోండి. మానవ సేవయే మాధవ సేవ అని గుర్తుంచుకోండి.

వివరాలు పంపవలసిన అడ్రస్ : పౌర సంబంధాల అధికారి ,టీటీడీ కపిల తీర్థం రోడ్, తిరుపతి .పిన్ -517501.
ఏదైనా వివరాల కొరకు 0877-2263544, 0877-2264392 నంబర్లకు కాల్ చేయొచ్చు.

(Visited 2,673 times, 261 visits today)