EDITION English తెలుగు
"పీవీ సింధు..మమ్మల్ని క్షమించు"   Video: ప్రియురాలి శవానికి తాళి కట్టి పెళ్లి చేసుకున్న ప్రేమికుడు.   Video: ఒక్క పాటతో ఇంటర్నెట్ ని ఊపేస్తున్న మల్లు బ్యూటీ..!   నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా చేసాడు.. సంపాదించిన ఆస్తి రూ.3930 మాత్రమే..!   మహేష్ బాబు, అల్లు అర్జున్ లకు షాక్ ఇచ్చిన రజినీకాంత్..!   లవర్స్ మధ్య జరిగిన ఈ వాట్సాప్ చాట్ లు చూస్తే ఖచ్చితంగా నవ్వుకుంటారు..! 3వది అయితే హైలైట్..!   మహారాజశ్రీ హైకోర్టు న్యాయమూర్తి గారికి....! కదిలించిన జెడ్పి విద్యార్థినిల లెటర్..!   హైదరాబాద్ లోని ఈ హాస్పిటల్ లో రూ. 10 లక్షలు అయ్యే చికిత్సలు అన్ని ఉచితం..!   తల్లి చనిపోతూ తన కొడుక్కి రాసిన లెటర్..! అది చదివితే కన్నీళ్లొస్తాయి...!   బీటెక్ స్టూడెంట్స్ కు నెలకు రూ.80వేల స్కాలర్ షిప్.
Home / Latest Alajadi / పసుపు తో క్యాన్సర్ కి చెక్ పెట్టవచ్చు.

పసుపు తో క్యాన్సర్ కి చెక్ పెట్టవచ్చు.

Author:

శరీరంలో ఏదో ఒక భాగంలో అతి చిన్నగా మొదలై కొన్ని సంవత్సరాల తరువాత ఆ మనిషి ప్రాణాలనే హరించే అంత భయంకరంగా క్యాన్సర్ రోగం ఉంటుంది, క్యాన్సర్ సోకింది అని తెలుసుకునేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోయి ప్రాణాల మీదకే వస్తుంది, క్యాన్సర్ రోగాన్ని ఆదిలోనే గుర్తిస్తే నయం చేయవచ్చు, రోగం ముదిరిన తరువాత దానిని నయం చేయడం చాలా కష్టంతో కూడుకున్న పని, మాములుగా క్యాన్సర్ 40 ఏళ్ళు పైబడిన వారిలోనే ఎక్కువగా కనిపించేది, కానీ కొన్ని సంవత్సరాల నుండి చిన్నపిల్లలు సైతం క్యాన్సర్ బారిన పడుతున్నారు, కొంత మందికి జన్యు పరంగా, వంశపారంపర్యంగా క్యాన్సర్ వస్తుంది, కానీ ఈ మధ్య మన ఆహార అలవాట్ల వల్ల కూడా శరీరంలోని క్యాన్సర్ కణాలు వేగంగా వృద్ధి చెందుతున్నట్లు అనేక పరిశోధనలు నిరూపించాయి, కొన్ని రకాల క్యాన్సర్ లని ఆదిలోనే నిర్ములించే శక్తి, ఔషధ గుణాలు పసుపులో ఉన్నాయని అమెరికాకి చెందిన శాస్త్రవేత్తలు, వైద్య నిపుణుల బృందం పరిశోధనలో తేలింది.

పసుపు

సెంట్రల్ ఫ్లోరిడా యూనివర్శిటీకి చెందిన శాస్త్రవేత్తలు. అనేక రోగాలను పోగొట్టే ఔషధ గుణాలు పసుపులో ఉన్నాయి. పసుపు శరీరంలోని వేడిని తగ్గిస్తుంది. విష లక్షణాలను హరిస్తుంది. పుళ్లను మాన్పుతుంది. దురదలతో పాటు చర్మ వ్యాధులు కూడా పసుపు ద్వారా నశిస్తాయి. అనేక ఔషధ గుణాలున్న పసుపును వివిధ రకాల మందులు తయారు చేయడానికి ఉపయోగిస్తారు. ముఖ్యంగా దీన్ని చర్మ సౌందర్యానికి ఉపయోగించే క్రీముళ్ళో వాడుతారు. టీబీ, కిడ్నీ తదితర రోగాల నివారణ కోసం వాడే మందుల్లో సైతం పసుపు వాడుతారు. పురాణాల్లో సైతం పసుపుకు దైవశక్తితో పాటు ఓషధిశక్తి ఉందని పేర్కొన్నారు. పూజ విధానాల్లో సైతం పసుపుకు ప్రత్యేక స్థానం ఉంది. ఊర్లలో చిన్న చిన్న గాయాలకు యాంటీ సెప్టిక్ గా పసుపుని ఉపయోగిస్తారు, ఇంతటి ప్రాధాన్యత కలిగిన పసుపులో క్యాన్సర్ ని ముఖ్యంగా పిల్లల క్యాన్సర్ ని నయం చేసే అనేక ఔషధ గుణాలు ఉన్నాయని అమెరికా శాస్త్రవేత్తలు కనుగొన్నారు, పసుపుని విరివిగా ఆహారంలో తీసుకోవడం వల్ల కాన్సర్ కణాలని ఆదిలోనే నిర్మూలించవచ్చని తెలిపారు.

Comments

comments