Home / Inspiring Stories / ప్యారిస్ లో మళ్ళీ మొదలైన కాల్పులు.

ప్యారిస్ లో మళ్ళీ మొదలైన కాల్పులు.

Author:

Paris Attacks

పారిస్‌‌లో మళ్లీ కలకలం రేగింది. మొన్నటి మారణకాండ తరువాత ఉగ్రవాదుల కోసం గాలిస్తున్న పోలీసులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఉత్తర పారిస్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ప్రస్తుతం పోలీసులకు దుండగులకు మధ్య కాల్పులు జరుగుతున్నట్లు సమాచారం. ఆ ప్రాంతంలో వాహనాల రాకపోకలను అధికారులు నిలిపివేశారు. మూనటికి మొన్న ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ పై ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో దాదాపుగా 170 మందికి పైగా మృతిచెందిన గటన నుండీ ప్యారిస్ ఇంకా ఉద్రిక్త పరిస్థితిలనుండి బయట పడ లేదు. ఆరు చోట్ల కాల్పులు, మూడు చోట్ల బాంబు దాడుల్లో 170 మందికి పైగా జనం ప్రాణాలు కోల్పోగా, వందలాది మందికి గాయాలయ్యాయి. నగరంలోని బటక్లాన్ థియేటర్ వద్దే ఉగ్రవాదులు ఏకంగా వంద మందిని కాల్చిచంపారు. థియేటర్ లో పట్టుకున్న ముగ్గురు ఉగ్రవాదులు నిలబెట్టి మరీ కాల్చి చంపారు. మరింత మంది ఉగ్రవాదులు ప్యారిస్ లోకి చొరబడి ఉంటారన్న అనుమానంతో పోలీసులు ముమ్మర తనిఖీలలో మరో ఐదుగురిని కాల్చి చంపారు. ఈ దాడులకు పాల్పడ్డ ఉగ్రవాదుల్లో 8 మందిని మట్టుపెట్టినట్టు పోలీసులు వెల్లడించారు. మరిన్ని దాడులు జరగకుండా గాలింపుచర్యలు ముమ్మరం చేశారు.ఇంకా భయానక వాతావరణం నుండి ప్యారిస్ పూర్తిగా కోలుకోకముందే మరోమారు ఐఎస్ఐఎస్ రెచ్చిపోవడం ప్రపంచాన్ని షాక్ కు గురిచేస్తుంది.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సెయింట్ డేవిస్ అనే ప్రాంతంలో ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు విచక్షణా రహిత కాల్పులకు తెగబడ్డారు. అప్రమత్తమైన భద్రతా బలగాలు ఉగ్రవాదులతో ప్రత్యక్ష కాల్పులకు దిగాయి. భారత కాలమాన ప్రకారం ఉదయం బుధవారం9 గంటలకు ఈ ఘటన చోటు చేసుకోగా.. పోలీసులకు, ఉగ్రవాదులకు మధ్య ఇంకా కాల్పులు కొనసాగుతూనే ఉన్నట్టు సమాచారం. తాజా ఘటనతో ప్యారిస్ లో కల్లోల పరిస్థితులు నెలకొన్నాయి.

ఈ నేపథ్యంలోనే పారిస్ విమానాలకు బాంబు బెదిరింపులు రావడంతో యూఎస్ నుండి పారిస్ వెళ్లే రెండు విమానాలను దారి మళ్లించారు. ఇక ఐసిస్ బెదిరింపులతో పారిస్ లో పలు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. కాగా పారిస్ లో మళ్లీ కాల్పులు జరుగుతున్నాయి. ఉగ్రవాదుల కోసం గాలిస్తున్న పోలీసులపై దుండగులు కాల్పులు జరిపారు. దీంతో పోలీసులు, దుండగుల మధ్య కాల్పులు జరుగుతున్నాయి. అమెరికాలోని లాస్ఏంజెలెస్ నుంచి పారిస్ వెళ్లల్సిన ఎయిర్ ఫ్రాన్స్ విమానం-65ను సాల్ట్‌లేక్ సిటీ మీదుగా దారి మళ్లించగా, వాషింగ్టన్ నుంచి పారిస్ వెళ్లాల్సిన మరో విమానాన్ని నోవా స్కోటియా మీదుగా మళ్లించారు. విమానాలు సురక్షితంగా ఫ్రాన్స్ చేరుకున్నట్లు అధికారులు తెలిపారు. ఫ్రాన్స్ పై ఉగ్రవాదుల దాడులు మళ్లీ జరగవచ్చు అన్న సమాచారం అక్కడి ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి.

(Visited 111 times, 10 visits today)