EDITION English తెలుగు
Home / Latest Alajadi / రూ.1000 కోట్ల బడ్జెట్ తో హాలీవుడ్ రేంజ్ లో మహాభారతం సినిమా.

రూ.1000 కోట్ల బడ్జెట్ తో హాలీవుడ్ రేంజ్ లో మహాభారతం సినిమా.

Author:

భారతదేశ చరిత్రలో మహాభారత ఇతిహాసంకి ఉన్న ప్రాముఖ్యత గురుంచి ప్రతి భారతీయుడికి తెలుసు, మహాభారతం మీదుగా అనేక గ్రంథాలు, అనేక టీవీ సీరియల్లు ఇప్పటికే వచ్చాయి, మహాభారత గాథని సినిమాగా తీయడమే తన లక్ష్యం అని రాజమౌళి ఎన్నో సార్లు ప్రకటించాడు, బాహుబలి సినిమా తరువాత రాజమౌళి మహాభారతం సినిమానే తీస్తాడని అభిమానులు అనుకుంటున్నా సమయంలో అందరికి షాక్ ఇస్తూ మహాభారతం సినిమాని హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కించడానికి యూఏఈలో స్ధిరపడ్డ ఓ భారతీయ వ్యాపారవేత్త దాదాపు రూ.1000 కోట్లని ఖర్చు పెట్టబోతున్నాడు.

మహాభారతం సినిమా

మలయాళీ రచయిత ఎం.టి వాసుదేవన్‌ నాయర్‌ రాసిన ‘రాందమూళం’ నవల ఆధారంగా తీసుకొని రూపొదించనున్నారు. మొదట ఇంగ్లీష్, హిందీ, మలయాళం, కన్నడ, తమిళం, తెలుగు భాషల్లో చిత్రీకరించి..తరువాత మన దేశంలోని అన్ని భాషల్లోనే కాదు 100కు పైగా విదేశీ భాషల్లోనూ డబ్బింగ్‌ చేయాలనే ప్రణాళికతో ఉన్నారు, ఈ సినిమాలో అన్ని భాషల నటులని భాగం చేయబోతున్నారు, మలయాళ నటుడు మోహన్ లాల్ ప్రధాన పాత్ర పోషించబోతున్నాడు, ప్రీ ప్రొడక్షన్ పనులు చిత్ర బృందం త్వరగా పూర్తి చేసుకొని 2018లో షూటింగ్ ప్రారంభించనున్నట్లు చెప్పారు నిర్మాత శెట్టి . ‘’ ది మహాభారత ‘’ పేరుతో తెరకెక్కనున్న ఈ చిత్రం మొదటి భాగం విడుదలైన 90 రోజుల గడువులోనే రెండవ భాగం కూడా విడుదలవుతుందని నిర్మాత తెలియజేశారు. అంటే 2020 కి ఈ సినిమాను థియేటర్లలో చూడొచ్చనే అనుకోవాలి.

(Visited 628 times, 48 visits today)