EDITION English తెలుగు
"పీవీ సింధు..మమ్మల్ని క్షమించు"   Video: ప్రియురాలి శవానికి తాళి కట్టి పెళ్లి చేసుకున్న ప్రేమికుడు.   Video: ఒక్క పాటతో ఇంటర్నెట్ ని ఊపేస్తున్న మల్లు బ్యూటీ..!   నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా చేసాడు.. సంపాదించిన ఆస్తి రూ.3930 మాత్రమే..!   మహేష్ బాబు, అల్లు అర్జున్ లకు షాక్ ఇచ్చిన రజినీకాంత్..!   లవర్స్ మధ్య జరిగిన ఈ వాట్సాప్ చాట్ లు చూస్తే ఖచ్చితంగా నవ్వుకుంటారు..! 3వది అయితే హైలైట్..!   మహారాజశ్రీ హైకోర్టు న్యాయమూర్తి గారికి....! కదిలించిన జెడ్పి విద్యార్థినిల లెటర్..!   హైదరాబాద్ లోని ఈ హాస్పిటల్ లో రూ. 10 లక్షలు అయ్యే చికిత్సలు అన్ని ఉచితం..!   తల్లి చనిపోతూ తన కొడుక్కి రాసిన లెటర్..! అది చదివితే కన్నీళ్లొస్తాయి...!   బీటెక్ స్టూడెంట్స్ కు నెలకు రూ.80వేల స్కాలర్ షిప్.
Home / General / జూన్ 16 నుంచి పెట్రోల్ బంక్ ల దేశవ్యాప్త బంద్?

జూన్ 16 నుంచి పెట్రోల్ బంక్ ల దేశవ్యాప్త బంద్?

Author:

జూన్ 16 నుంచి పెట్రోల్, డీజిల్ రేట్లు రోజు వారీ పద్ధతిన మారనున్నాయన్న విషయం మనదరికీ తెలిసిందే. అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకున్నఈ నిర్ణయాన్ని పెట్రోల్ బంక్ యాజమాన్యాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ నిర్ణయం అమలయితే తాము ఇకపై బంకులు నడ పలేమని ఆరోపిస్తున్నారు బంకు యజమానులు. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే, జూన్ 16వ తేదీ నుంచి చమురు సంస్థల నుంచి కొనుగోళ్లు నిలిపివేస్తామని యాజమాన్య సంఘాలు హెచ్చరించాయి. చమురు సంస్థల నుండి కొనుగోళ్ళు ఆగిపోతే నిల్వలు తగ్గిపోయి ఒకటి రెండు రోజుల్లో బంక్ లు మూసే పరిస్తితి వస్తుంది. అయితే ఈ బంద్ బంకుల మూసివేత కాదని, పెట్రోల్,  డీజిల్ కొనుగోళ్లను మాత్రమే నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేశారు అఖిల భారత పెట్రోలియం డీలర్ల సంఘం అధ్యక్షుడు అజయ్ బన్సాల్. ఇప్పటికే ఈ రోజువారీ విధానాన్ని ఐదు నగరాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తోంది ప్రభుత్వం. ఈ 5 నగరాల్లోనే రోజువారీ ధరల మార్పుతో పరిస్తితి దారుణంగా ఉందని, ఇక ఈ రోజు వారీ పద్దతిని దేశవ్యాప్తంగా అమలు చేస్తే తాము బంకులు నడపలేమని వాపోయారు అజయ్ బన్సాల్.

petrol bandh

ప్రస్తుతం 15 రోజులకు ఒకసారి పెట్రోల్, డీజిల్ ధరలను సవరిస్తున్నారు. అయితే నూతన విధానం వల్ల.. ఒక రోజు కొనుగోలు, మరో రోజు అమ్మకం అంటే.. రేట్లలో చాలా తేడా వస్తుందంటున్నారు డీలర్లు. ఈ కొత్త విధానం వల్ల తీవ్రంగా నష్టపోతామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే.. రోజువారీ ధరల సవరణతోనే పారదర్శకత పెరుగుతుందని చెబుతున్న కంపెనీలు, డీలర్ల నిరసనను ఏ మాత్రం పట్టించుకోవటం లేదు. దాంతో తమ కమిషన్ పెంచాలని డిమాండ్ చేస్తున్నారు డీలర్లు. నిజానికి దేశమొత్తం 57వేల పెట్రోల్ బంక్ లు ఉంటే, వాటిలో 95శాతం IOC, HPCL, BPCL కంపెనీల ఆధ్వర్యంలోనే నడుస్తున్నాయి. కేవలం 5వేల బంకులు మాత్రమే ఇతర కంపెనీలు నిర్వహిస్తున్నాయి.

Comments

comments