Home / User Stories / అసభ్యంగా చేతులు వేస్తే షకీలా అలా చేసేదంట.? ఆ 20 మంది చివరికి!

అసభ్యంగా చేతులు వేస్తే షకీలా అలా చేసేదంట.? ఆ 20 మంది చివరికి!

Author:

ప్రస్తుతం దేశవ్యాప్తంగా మీ టూ ఉద్యమం ఎంత సంచలనం అయ్యిందో కొత్తగా చెప్పనవసరంలేదు. అవకాశాల కోసం ఒక్క ఛాన్స్ అంటూ వచ్చిన హీరోయిన్స్ ని అవకాశం ఇస్తామని నమ్మించి మోసం చేసారని ఎంతో మంది సినీ నటులు మీ టూ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై తాజాగా మలయాళ శృంగార నటి షకీలా వింతగా స్పందించారు. తాజాగా ‘ఆలీతో సరదాగా..’ కార్యక్రమంలో పాల్గొని తన పరిస్థితిపై మరింత ఓపెన్ అయింది షకీలా.

లైంగికంగా ఎవరైనా వేధిస్తే ఆలస్యంగా స్పందించే రకం కాదు నేను. అలాంటి వాళ్లకు వెంటనే తగిన బుద్ది చెప్పే దాన్ని అని షకీలా మీటూ ఉద్యమం గురించి మాట్లాడింది. ఏళ్ల తరువాత స్పందించడం తెలివైన పని కాదు అని షకీలా పేర్కొంది. తనపై కూడా చాలా మంది అసభ్యంగా చేతులు వేసేవారని షకీలా పేర్కొంది. తాను వారికీ అక్కడిక్కడే బుద్ది చెప్పేదానిని. అప్పట్లో నాతో అసభ్యంగా ప్రవర్తించిన వారే ఇప్పుడు తనని చూసి చేతులు కట్టుకుంటారని షకీలా పేర్కొంది.

తన జీవితంలో 20 మంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారని.. కానీ చివరికి వాళ్లల్లో ఎవ్వరూ తనతో నిలవలేదని షకీలా చెప్పడం విశేషం. తానకు ఎవరైన బాగా నచ్చితే.. వెంటనే ఇంప్రెస్ అయ్యి.. మరుసటి రోజుకే ప్రేమలో పడిపోయేదాన్నని.. ఈ లెక్కన తన జీవితంలో 20 ప్రేమకథలున్నాయని షకీలా తెలిపింది. కానీ వారు ఎవరు తనతో ఎక్కువ కాలం ఉండలేదని చెప్పింది. ఒకరు తన తల్లిని దూరం పెట్టమని అడగడంతో.. ఇంకొకరు అన్నయ్యకు సాయం చేయొద్దని చెప్పడంతో.. ఇంకొకరు తన మీద అజమాయిషీ చేయడంతో.. ఇలా ఒక్కొక్కరిని ఒక్కో కారణంతో దూరం పెట్టానని షకీలా తెలిపింది. తనతో ఉన్నవాళ్లలో కొందరు తనను శారీరకంగా చాలా హింసించారని చెప్పింది.

(Visited 1 times, 24 visits today)