Home / Inspiring Stories / ఈ వాలంటైన్స్ డే కి మీదేరంగు గులాబీ..?

ఈ వాలంటైన్స్ డే కి మీదేరంగు గులాబీ..?

Author:

“What’s in a name? that which we call a rose By any other name would smell as sweet” పేరులో ఏముంది రోమియో..! గులాబీ ని వేరే పేరుతో పిలిచినా దాని పరిమళం మారదుకదా…! తనని కలుసుకోవటానికి వచ్చిన రోమియో తో జులియట్ అన్న మాటలివి..
లబ్..డబ్..లబ్..డబ్…శబ్దమేనా అది..! ఒక్కొసారి ప్రేమసందేశం కూడా..!
ఐతే..! మరి ఆ శబ్దాన్ని ఎలా అందించాలి. పుట్టిన క్షణం నుంచీ వెతుకూతూనే ఉన్నాను నీకోసం… పసితనం లో అమ్మ భుజం పై వాలినప్పుడు “చందమామ రావే అని పిలిచేది… ఐతే..! ఆ చందమామ కి నన్నుచేరటానికి ఇరవయ్యేళ్ళు పట్టింది”.. ఇప్పుడా చందమామ కి ఇన్నాళ్ళ అన్వేశణనీ, ఇన్నేళ్ళ నిరీక్షణనీ,ఇంక తనని విడిచి పెట్ట లేనన్న కోరికనీ ఒక్క మాటలో ఎలా చెప్పగలం..!? గుండే ఆకారం లోనే ఉన్న ఓ గులాబీ తన చేతిలో పెడితే తప్ప…. ఐతే ప్రేమ కోసం ఏదో ఒక గులాబీ ఇస్తే సరిపోదు మరి…. ఒక్కో రంగు గులాబీ కి ఒక్కో అర్థం ఉంది.. అది తెలీకుండా మీ వేలంటైన్ చేతిలో ఏదో ఒక గులాబీ ని ఇస్తే బాగోదు మరి…. “లవ్ ఎట్ ఫస్ట్ సైట్” కి ఊదా రంగు గులాబీ (లావెండర్ కలర్ రోజ్) సింబల్ అన్న మాట.మీరు మొదటిసారే ఆరెంజ్ కలర్ రోజ్ ఇచ్చారనుకోండి… మీరు కోరుకున్న అమ్మాయీ/అబ్బాయీ మిమ్మల్ని అపార్థం చేసుకునే చాన్సుందీ…. అదేంటంటారా? అదే మరీ రంగుకీ ఒక్కో అర్థం ఉంది…. ఒక్కో గులాబీ ఒక్కో సందేశానికి సింబల్ అన్న మాట… అదెంటో చూడండి ముందు…

రెడ్ రోజ్:

1

ప్రేమకు నిర్వచనం ఇదే. ఎర్ర గులాబీ ఇవ్వడం అంటే , అతనికీ/ఆమె కు ప్రేమిస్తున్నానై చెప్పడమే కాదు. వారి అందాన్ని అభిమానిస్తున్నట్టు, ప్రేమపై తమ ధైర్యాన్ని వ్యక్తపరిచి, ప్రేమికులకు గౌరవం ఇస్తున్నట్టు భావిస్తారు.

వైట్ రోజ్:

9

తమ ప్రేమ చాలా పవిత్రమైందని తెలుపు గులాబీ ఇవ్వడం ద్వారా ప్రేమికులు వ్యక్తం చేస్తారు.ఈ గులాబీ లా నా నిర్మల మైన మస్సుతో నీ ప్రేమని కోరుకుంటున్నానూ అని చెప్పటం.

పసుపు రంగు గులాబీ:

7
ప్రేమికురాలిని కలిశానన్న సంతోషాన్ని, ఆమె లేదా అతడిపై ఉన్న స్నేహభావాన్ని, కలిసేందుకు వచ్చిన వారికి స్వాగతం చెప్పడం అనేది పసుపు గులాబీ ఇవ్వడం ద్వారా చెబుతారు.

గులాబీ (పింక్) గులాబీ:

6

ఇది ప్రేమ మొదలయ్యాక ఇక అన్ని సందర్భాలలోనూ ఇచ్చుకుంటారు.ప్రేమికులు పరస్పరం అభినందనలు చెప్పుకోవడానికి, తమ సంపూర్ణ ఆనందానికి ఈ రంగు గులాబీ ఇస్తుంటారు. అలాగే తమలోని దయ, అనుగ్రహాన్ని కూడా ఈ గులాబీ ఇవ్వడం ద్వారా వ్యక్తపరుస్తారు.

లేత గులాబీ (లైట్ పింక్):

Pink-Rose
తమలో తియ్యనైన ప్రేమను లేతగులాబీ రంగు గులాబీ ఇవ్వడం ద్వారా ప్రేమికులు వ్యక్తపరుస్తారు. కష్టాల్లో ఉన్న ప్రేమికురాలు లేదా ప్రేమికుడిపై తమన సానుభూతిని కూడా ఈ గులాబీ ద్వారా వ్యక్తం చేసుకుంటారు.

బ్లూ రోజ్:

3
ఈ గులాబీ ఇవ్వడం ద్వారా తమ ప్రేమకు ఏదీ అసాధ్యం కాదని ప్రేమికులు నిరూపించుకుంటారు. పెద్దలను కాదని పెళ్లి చేసుకోవడమైనా, కుటుంబాల కోసం త్యాగాలకు సిద్ధపడినా.. దానికి నీలం రంగు గులాబీ ఇస్తారన్న మాట.

లేవండర్ రోజ్:

4
ఈ గులాబీ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ (తొలి చూపులోనే ప్రేమ)కు గుర్తు. చూడ గానే ప్రేమలో పడిపోయాను…. నీకంటే ప్రపంచం లో ఏదీ ముఖ్యం కాదు అని చెప్పటానికి ఈ రంగు గులాబీని ఇస్తుంటారు.

ఆరెంజ్ కలర్ రోజ్:

2
ప్రేమికులు ఈ గులాబీ ఇవ్వడం ద్వారా తమలోని కోరికలను, ప్రేమికుల నుంచి ఆశిస్తున్న ప్రేమను వ్యక్తం చేస్తారు. డేట్ కి వచ్చేందుకు సిద్దమేనా..!? అన్న ఆహ్వానం కూడా అందులో ఉంది.

అదన్న మాట సంగతి. ఇప్పుడు ఏవరికి ఏరంగు గులబీ కావాలో మీరే తేల్చుకొని తీస్కోండీ… లావెండర్ వాళ్ళకి ఆల్ ద బెస్ట్… మరి ఆరెంజ్ వాళ్ళకి కాస్త పెద్ద ఆల్ ద బెస్ట్ అన్న మాట…..! హ్యాపీ వాలంటైన్స్ డే

(Visited 882 times, 95 visits today)