వంగవీటి రివ్యూ & రేటింగ్.

వంగవీటి రివ్యూ రేటింగ్

Alajadi Rating

2.75/5

[easy-social-share buttons="facebook,twitter" counters=0 total_counter_pos="left" hide_names="no" template="flat-retina" facebook_text="Share" twitter_text="Tweet"]

Cast: సందీప్ కుమార్ - నైనా గంగూలీ - శ్రీతేజ్ - వంశీ చాగంటి - కౌటిల్య తదితరులు

Directed by: రామ్ గోపాల్ వర్మ

Produced by: దాసరి కిరణ్ కుమార్

Banner: రామదూత క్రియేషన్స్.

Music Composed by: రాధాకృష్ణ - చైతన్య ప్రసాద్

రామ్ గోపాల్ వర్మ సినిమా అంటే కొంతమంది పిచ్చిగా ఎదురుచూస్తారు, ఇంకొంతమంది అస్సలు పట్టించుకోరు, కానీ బెజవాడ రౌడీయిజం కేంద్రంగా వర్మ తీసిన వంగవీటి సినిమా కోసం సినిమా ప్రేక్షకులతో పాటు సామాన్య జనం కూడా ఎదురుచూస్తున్నారు, ఎన్నో వివాదాల మధ్య విడుదల అవుతున్న ‘ వంగవీటి’ సినిమా ఎలా ఉందో తెలుసుకోండి.

వంగవీటి రివ్యూ రేటింగ్

కథ:

వెంకటరత్నం అనే కమ్యూనిస్ట్ నేత అండతో పెద్ద రౌడీగా ఎదుగుతాడు రాధా (సందీప్), ఆ తరువాత వెంకటరత్నంతో విభేదించి అతనికే ఎదురుతిరిగి హత్య చేస్తాడు, ఆ తరువాత బెజవాడలో తిరుగులేని రౌడీ నాయకుడిగా ఎదుగుతాడు, ఈ సమయంలో అన్నదమ్ములైన గాంధీ (కౌటిల్య).. నెహ్రూ (శ్రీతేజ్) అనే ఇద్దరు స్టూడెంట్ లీడర్స్ రాధకి దగ్గరవుతారు, వెంకటరత్నాన్ని చంపిన రాధాని వెంకట రత్నం అనుచరులు చంపేస్తారు. అప్పుడు రాధా తమ్ముడు రంగా తమ గ్రూప్ కి లీడర్ అవుతాడు. అక్కడి నుండి బెజవాడ రౌడీయిజంని రంగా ఎలా మలుపు తిప్పాడు,..? గాంధీ, నెహ్రు లతో ఎందుకు విభేదించాడు,..? వంగవీటి రంగాని ఎలా చంపేశారు..? అనేది మిగిలిన కథ.

అలజడి విశ్లేషణ:

హత్యలు, కుట్రలు, దెయ్యాలు లాంటి కథలతో సినిమా తీయడం వర్మకి కొట్టిన పిండే, తనకి ఎంతో ఇష్టమైన హత్య రాజకీయాలు అనే లైన్ కి వంగవీటి రంగా హత్య కథనాన్ని ఎంచుకొని వర్మ పెద్ద సాహసమే చేసాడు, వర్మ సినిమా అంటే ఇలా ఉంటుంది అనే మార్క్ టేకింగ్ తో వంగవీటి సినిమాని తెరకెక్కించారు, ఆ కెమెరా యాంగిల్స్, క్లోజప్ షాట్స్ కేవలం రామ్ గోపాల్ వర్మకే సాధ్యం అనేలా వంగవీటి సినిమాని తీశారు.

ఫస్ట్ ఆఫ్ లో చిన్న రౌడీ స్థాయి నుండి పెద్ద రౌడీగా వంగవీటి రాధా ఎదిగిన క్రమాన్ని చూపించిన విధానంలో వర్మ మార్క్ కనిపిస్తుంది, హత్య ఎపిసోడ్లని సరికొత్తగా తెరకెక్కించే వర్మ వంగవీటి సినిమాలో ఎక్కువ భాగం హత్య ఎపిసోడ్లతో నింపేసాడు, హత్య కి ముందు ప్లాన్ ఆతరువాత జరిగే పరిణామాలపై మాత్రమే దృష్టి పెట్టిన వర్మ సినిమాలో ఉన్న రాధా, రంగా, గాంధీ, నెహ్రు మరియు మురళి లాంటి ముఖ్య పాత్రల లోతుల్లోకి వెళ్ళలేదు. టేకింగ్ పరంగా చుస్తే వర్మ సినిమాల్లో మంచి సినిమాగా నిలిచిపోతుంది, కానీ కథ పరంగా చుస్తే వాస్తవంగా జరిగిన కొన్ని విషయాలని వర్మ అస్సలు పట్టించుకోలేదనే చెప్పొచ్చు.

నటీనటుల పెర్ఫార్మన్స్:

సందీప్: ఈ సినిమాకి ఆయువుపట్టు వంగవీటి రాధా, రంగా పాత్రలే, ఆ రెండు పాత్రలలో సందీప్ జీవించాడు.
వంశీ చాగంటి: హ్యాపీ డేస్ సినిమాలో శంకర్ అనే పాత్రలో చేసిన వంశిని, మురళి పాత్రలో చూసి ఆశ్ఛర్యపోతాం, తన నటనతో ఆ పాత్రకి న్యాయం చేసాడు.

ఇంకా గాంధీగా చేసిన కౌటిల్య, నెహ్రుగా చేసిన శ్రీతేజ్, రత్నకుమారిగా చేసిన నైనా గంగూలీ కూడా అదరగొట్టారు.

ప్లస్ పాయింట్స్:

  • వర్మ మార్క్ టేకింగ్.
  • సందీప్, వంశి లా పెర్ఫార్మన్స్.

మైనస్ పాయింట్స్:

  • కొన్ని సీన్స్ ని మధ్యలోనే ముగించడం.
  • కథ.

అలజడి రేటింగ్: 2.75/5

పంచ్ లైన్ : ఇది వంగవీటి సినిమా వర్మకి మాత్రమే సాధ్యమయ్యే పని.

(Visited 894 times, 50 visits today)