EDITION English తెలుగు
"పీవీ సింధు..మమ్మల్ని క్షమించు"   Video: ప్రియురాలి శవానికి తాళి కట్టి పెళ్లి చేసుకున్న ప్రేమికుడు.   Video: ఒక్క పాటతో ఇంటర్నెట్ ని ఊపేస్తున్న మల్లు బ్యూటీ..!   నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా చేసాడు.. సంపాదించిన ఆస్తి రూ.3930 మాత్రమే..!   మహేష్ బాబు, అల్లు అర్జున్ లకు షాక్ ఇచ్చిన రజినీకాంత్..!   లవర్స్ మధ్య జరిగిన ఈ వాట్సాప్ చాట్ లు చూస్తే ఖచ్చితంగా నవ్వుకుంటారు..! 3వది అయితే హైలైట్..!   మహారాజశ్రీ హైకోర్టు న్యాయమూర్తి గారికి....! కదిలించిన జెడ్పి విద్యార్థినిల లెటర్..!   హైదరాబాద్ లోని ఈ హాస్పిటల్ లో రూ. 10 లక్షలు అయ్యే చికిత్సలు అన్ని ఉచితం..!   తల్లి చనిపోతూ తన కొడుక్కి రాసిన లెటర్..! అది చదివితే కన్నీళ్లొస్తాయి...!   బీటెక్ స్టూడెంట్స్ కు నెలకు రూ.80వేల స్కాలర్ షిప్.
Home / Entertainment / గ్యాంగ్ స్టర్ నయీమ్ చరిత్రని సినిమాగా తీయనున్న రామ్ గోపాల్ వర్మ.

గ్యాంగ్ స్టర్ నయీమ్ చరిత్రని సినిమాగా తీయనున్న రామ్ గోపాల్ వర్మ.

Author:

నయీమ్ అంటే ఇప్పుడు తెలియని వారు లేరు తెలుగు రాష్ట్రాలలో. గత వారం పది రోజుల నుండి ఏ ఛానల్ చూసిన, ఏ పేపర్ చూసిన కనిపించే ఫోటో, వినిపించే పేరు నయీమ్. ముందుగా నక్సలైట్ గా ఉన్న నయీమ్ ఆ తర్వాత లొంగిపోయి, పోలీసులకు కోవర్ట్ గా మారి ఎందరో నక్సలైట్స్ ని చంపండంలో పోలీసులకు సహకారం చేసాడు. అలా పోలీసుల అండ చూసుకొని చిన్న గ్యాంగ్ ని ఏర్పాటుచేసుకుని మొదటగా చిన్న వారిని ( డబ్బులేని వారిని) బెదిరిస్తూ పైసలు వసూల్ చేసిన ఈ కరుడుకట్టిన మృగం…. తరవాత పెద్ద (డబ్బున్న వారిని) వారిని బెదిరిస్తూ కొన్ని వేల కోట్లు సంపాదించాడు. ఎన్నో నేరాలు చేసిన ఈ నరహంతకుడిని ఎన్ కౌంటర్ లో చంపేయడంతో ఇప్పుడు చాలా మంది ఉపిరిపీల్చుకుంటున్నారు. అలాంటి నరహంతకుడిపై ఒక సినిమా రాబోతుంది. అది తీస్తున్నది ఎవరో కాదు ఎప్పుడు, ఎక్కడ, ఎలాంటి సంఘటనలు జరిగిన వాటి పై సినిమా తీస్తా అంటూ ఎప్పుడు ఎదో విధంగా వార్తల్లో ఉండే వర్మ.

Nayeem-Movie-ram-gopal-varma

ఈ విషయం గురించి వర్మ ట్వీట్ చేస్తూ …. నాకు ఇప్పుడిప్పుడే నయీమ్ గురించి నిజాలు తెలుస్తున్నాయి. అతని పై కచ్చితంగా సినిమా తీస్తా. ఒక్క సినిమాతో అతని స్టోరీ చెప్పడం కష్టం అందుకే మూడు భాగాలుగా తీయనున్న. నక్సలైట్ నుండి పోలీస్ ఇన్ ఫార్మర్ గా, ఆ తరువాత గ్యాంగ్ స్టర్ గా మారిన తీరు. ఇంతకు ముందు రక్త చరిత్ర రెండు పార్ట్స్ గా తీశాను. ఇప్పుడు నయీముద్దీన్ మూడు భాగాలు అంటూ ట్వీట్ చేశాడు. చూడాలి మరి ఈ సినిమా ఎవరి కోణంలో తీస్తాడో.

రామ్ గోపాల్ వర్మ ఇంతకుముందు తీసిన రక్త చరిత్రలో దాదాపు 80 శాతం వరకు నిజంగా జరిగిన సంఘటనలనే సినిమాగా తీసాడు, ఇప్పుడు కూడా నయీమ్ చరిత్రని కూడా ఎవరి బెదిరింపులకి లొంగకుండా తెరకెక్కిస్తే నయీమ్ కి అండగా ఉన్నవారికి , నయీమ్ తో కలిసి సెటిల్మెంట్స్ చేసిన పోలీసులు, రాజకీయ నాయకుల గురుంచి సామాన్య ప్రజలకి తెలిసే అవకాశం ఉంటుంది.

Comments

comments