Home / Entertainment / సన్ ఆఫ్ మహాలక్ష్మి లోఫర్ కాదు.

సన్ ఆఫ్ మహాలక్ష్మి లోఫర్ కాదు.

Author:

Puri Jaganath and Varun Tej Movie title

కంచె తరవాత వరుణ్ తేజ్ లోఫర్ అయిపోవటం కాస్త అనుమానమేనంటున్నారు సినీ జనాలు.దర్శకుడు పూరి జగన్నాథ్ సినిమాకు పెట్టిన టైటిల్ విషయంలోనే కొంచెం వివాదం నెలకొన్నది. పూరి జగన్నాథ్ తన ప్రతి సినిమా టైటిల్ కూడా నెగెటివ్ షెడ్ లో పెడుతున్నాడు. సినిమా హీరోను అలాగే చూపిస్తూ.. చివరికి వచ్చే సరికి హీరో క్యారెక్టర్ ను మార్చేసి.. అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాడు పూరి.

పూరి జగన్నాథ్ సినిమాలో హీరో అంటే ఎవరికీ భయపడడు. ఎంతమంది ఉన్నా సరే లెక్కచేయడు. పదునెక్కిన సంభాషణలతో చురకత్తిలా దూసుకెళ్తుంటాడు. ముందు అల్లరి చిల్లరిగా తిరుగుతూ ఇంటర్వెల్ లో ఒక పెద్ద మలుపుతో అతని వెనక పెద్ద స్టోరీ ఉందటమో లేదా అందరికీ నచ్చని పనులు చెసే హీరో సడెన్ గా మంచి వాడైపోవటమో చేసి ప్రేక్షకులని ఆశ్చర్య పరుస్తాడు ఐతే ఈ ఫార్ములా ఇప్పుడు బోర్ కొట్టేలా తయారయిందంటున్నారు ప్రేక్షకులు. పూరీ రోటీన్ ఫార్ములా పోకిరినుంచి పూరి అదే స్టైల్ లో నడుస్తోంది. దేశముదురు, నేను నా రాక్షసి.. రీసెంట్ గా టెంపర్ ఇవన్ని కూడా నెగిటివ్ షెడ్ టైటిల్స్. ఈ టైటిల్స్ తోనే పూరి మాస్ ప్రేక్షకులను ఇన్నాళ్ళూ ఆకట్టుకున్నాడు.

ఇక, తాజాగా పూరి.. మెగా ఫ్యామిలీ ప్రోడక్ట్ వరుణ్ తేజ్ లోఫర్ తో వస్తున్నాడు. రీసెంట్ గా కంచెతో హిట్ కొట్టిన వరుణ్ తేజ్ కి ఈ టైటిల్ సరిగా అనిపించలేదట,అలాగే మరికొందరు కూడా టైటిల్ విశయం లో అదే అభిప్రాయాన్ని వెలి బుచ్చటం తో కొద్దిగా ఆలొచనలో పడ్డాడట పూరీ. ఇక పూరీ గురు సమానుడిగా చెప్పుకునే సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సైతం పూరి ని లోఫర్ టైటిల్ మార్చమని సూచించాడు. లోఫర్ టైటిల్ గురించి ఒత్తిడి వస్తున్న కారణంగా పూరి లోఫర్ టైటిల్ ను చేంజ్ చేస్తున్నట్టు తెలుస్తున్నది.నిన్నటి తరం నటి రేవతి వరుణ్ కి తల్లిగా నటిస్తూండటం ,సినిమా లో మథర్ సెంటిమెంట్ కీలకం అవటం వల్ల కూడా సాఫ్ట్ టైటిల్ బావుంటుంది అనుకుంటున్నారట. అందిన సమాచారం ప్రకారం “మా అమ్మ మహాలక్ష్మి” లేదా “సన్ ఆఫ్ మహా లక్ష్మి” అనే టైటిల్స్ లో ఏదో ఒక దానిని ని ఖరారు చేయనున్నట్టు చెప్పుకుంటున్నరు. ఈ పేరే గనక ఓకే చేస్తే “అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి” తరవాత పూరీ పెట్టే సాఫ్ట్ టైటిల్ ఇదే ఔతుంది. ఏ టైటిల్ ఒకే చేస్తారో ఆ టైటిల్ ఎంత వరకు వర్కౌట్ అవుతుంతో తెలియాలి అంటే డిసెంబర్ 18 వరకు వెయిట్ చేయాల్సిందే.

(Visited 41 times, 18 visits today)