EDITION English తెలుగు
"పీవీ సింధు..మమ్మల్ని క్షమించు"   Video: ప్రియురాలి శవానికి తాళి కట్టి పెళ్లి చేసుకున్న ప్రేమికుడు.   Video: ఒక్క పాటతో ఇంటర్నెట్ ని ఊపేస్తున్న మల్లు బ్యూటీ..!   నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా చేసాడు.. సంపాదించిన ఆస్తి రూ.3930 మాత్రమే..!   మహేష్ బాబు, అల్లు అర్జున్ లకు షాక్ ఇచ్చిన రజినీకాంత్..!   లవర్స్ మధ్య జరిగిన ఈ వాట్సాప్ చాట్ లు చూస్తే ఖచ్చితంగా నవ్వుకుంటారు..! 3వది అయితే హైలైట్..!   మహారాజశ్రీ హైకోర్టు న్యాయమూర్తి గారికి....! కదిలించిన జెడ్పి విద్యార్థినిల లెటర్..!   హైదరాబాద్ లోని ఈ హాస్పిటల్ లో రూ. 10 లక్షలు అయ్యే చికిత్సలు అన్ని ఉచితం..!   తల్లి చనిపోతూ తన కొడుక్కి రాసిన లెటర్..! అది చదివితే కన్నీళ్లొస్తాయి...!   బీటెక్ స్టూడెంట్స్ కు నెలకు రూ.80వేల స్కాలర్ షిప్.
Home / Entertainment / తొలి ప్రేమ సినిమా రివ్యూ & రేటింగ్.

తొలి ప్రేమ సినిమా రివ్యూ & రేటింగ్.

తొలిప్రేమ రివ్యూ రేటింగ్ వరుణ్ తేజ్

Alajadi Rating

2.75/5

Cast: వరుణ్ తేజ్, రాశి ఖన్నా, సప్నా పబ్బి, ప్రియదర్శి, హైపర్ ఆది...

Directed by: వెంకీ అట్లూరి

Produced by: BVSN ప్రసాద్

Banner: శ్రీవెంకటేశ్వర సినీచిత్ర ఎంటెర్టైన్మ్నెట్స్.

Music Composed by: థమన్

ఫిదా సినిమాతో బ్లాక్ బ్లాస్టర్ హిట్ అందుకున్న వరుణ్ తేజ్ కొత్త కుర్రాడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో రాశి ఖన్నా హీరోయిన్ గా తొలి ప్రేమ అనే టైటిల్ తో వచ్చాడు, పవన్ కళ్యాణ్ బెస్ట్ సినిమాల్లో ఒకటైన తొలిప్రేమ టైటిల్ తో వస్తున్న వరుణ్ తేజ్ సినిమా ఎలా ఉందో మీరు తెలుసుకోండి.

కథ:

అనుకోకుండా ట్రైన్ లో పరిచయం అయి విడిపోయిన ఆది (వరుణ్ తేజ్), వర్ష (రాశి ఖన్నా) ఒకే ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతుంటారు, వాళ్ళ మధ్యలో లవ్ మంచి స్టేజిలో ఉన్న సమయంలో కొన్ని కారణాల వల్ల విడిపోతారు, ఆ తరువాత ఆది లండన్ వెళ్ళిపోయి వేరొక అమ్మాయితో లవ్ లో ఉన్నప్పటికీ వర్షని మర్చిపోలేకపోతాడు, అసలు ఆది, వర్ష ఎందుకు విడిపోయారు..? మళ్ళీ కలిసారా..? చివరికి ఏం జరిగింది….? అనేది మిగిలిన కథ.

అలజడి విశ్లేషణ:

కాలేజీలో హీరో, హీరోయిన్ ల మధ్య లవ్, కొన్ని కారణాల వల్ల విడిపోవడం, చివర్లో కలవడం.. స్టోరీ రొటీన్ యే కానీ స్క్రీన్ ప్లే కొత్తది, హీరో, హీరోయిన్ ల మధ్య లవ్ ట్రాక్ ని డైరెక్టర్ వెంకీ అట్లూరి చాలా బాగా చూపించాడు, ముఖ్యంగా కెమెరా వర్క్ సినిమాకి హైలైట్ గా నిలిచింది.

ఫస్ట్ ఆఫ్ లో హీరో, హీరోయిన్ ల మధ్య రొమాంటిక్ లవ్ ట్రాక్ ప్రేక్షకులని బాగా ఆకట్టుకుంటుంది, పాటలు కూడా చాలా బాగా తీశారు, కాలేజీ నేఫథ్యంలో వచ్చే కామెడీ సీన్స్, రొమాంటిక్ సీన్స్ చాలా బాగున్నాయి, ఇంటర్వెల్ కి ముందు వచ్చే సీన్స్ సెకండాఫ్ పై అంచనాలు పెంచేలా ఉంటుంది.

ఫస్ట్ ఆఫ్ ని చాలా బాగా డీల్ చేసిన డైరెక్టర్ సెకండ్ ఆఫ్ లో కొంచెం తగ్గాడు, ఫస్ట్ ఆఫ్ లో ఉన్న స్ట్రాంగ్ ఎమోషన్ ని సెకండ్ ఆఫ్ లో చూపించలేకపోయాడు, హీరో, హీరోయిన్ ల మధ్య ఎమోషనల్ సీన్స్ ని చాలా బాగా చూపించారు, ఫస్ట్ ఆఫ్ తో పోలిస్తే సెకండ్ ఆఫ్ కొంచెం డల్ గా అనిపిస్తుంది, సినిమాలో ప్రతి ఫ్రేమ్ లో ముఖ్యంగా పాటల విషయంలో కెమెరా వర్క్ అద్భుతంగా ఉంది, చివరగా తొలిప్రేమ ఒక మంచి ఫీల్ గుడ్ రొమాంటిక్ లవ్ స్టోరీ.

నటీనటుల పెర్ఫార్మన్స్:

ఈ సినిమాలో వరుణ్ తేజ్ చాలా వేరియేషన్ లలో కనిపించాడు, కొత్త లుక్ తో ఆకట్టుకున్నాడు, ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ లో చాలా బాగా నటించాడు, హీరోయిన్ రాశి ఖన్నా స్లిమ్ లుక్ లో రొమాంటిక్ గా చాలా బాగా నటించింది, వరుణ్ తేజ్, రాశి ఖన్నాల మధ్య కెమిస్ట్రీ చాలా బాగా కుదిరింది, ఇంకా సెకండ్ హీరోయిన్ సప్నా పబ్బి, ప్రియదర్శి, హైపర్ ఆది, సుహాసిని అందరు బాగా చేసారు.

ప్లస్ పాయింట్స్:

  • వరుణ్ తేజ్, రాశి ఖన్నా
  • కెమెరా వర్క్
  • స్క్రీన్ ప్లే
  • పాటలు

మైనస్ పాయింట్స్:

  • సెకండ్ ఆఫ్
  • క్లైమాక్స్

పంచ్ లైన్: కొన్ని సినిమాలు హిట్ అయిన, ప్లాప్ అయిన గుర్తుండిపోతాయి.. తొలి ప్రేమ కూడా అంతే…!

Comments

comments