EDITION English తెలుగు
కాలా సినిమా రివ్యూ & రేటింగ్.   డేవిడ్ వార్నర్ మరియు భార్య కాండిస్ బాల్-టాంపెరింగ్ కుంభకోణం తరువాత గర్భస్రావం చేస్తారు   చైనా హఫీజ్ సయీద్ ను వెలుపలికి వెలుపల కోరుకుంటున్నారు.   MH17 రష్యన్ సైనిక క్షిపణి వ్యవస్థ డౌన్ కూలిపోయింది, పరిశోధకులు చెప్పారు   అమెరికాపై ఆధారపడిన సంబంధం భారత్కు ఎప్పటికీ ఉండదు: నిపుణుడు కాంగ్రెస్ సభ్యులకు చెబుతాడు   హెల్త్కేర్ యాక్సెస్ అండ్ క్వాలిటీలో 195 దేశాలలో నెమ్మదిగా మెరుగుపరుచుకోవడం, భారతదేశం రాంక్స్ 145   ఢిల్లీ మనిషి తన కుమారుని హతమార్చాడు   పెట్రోల్ ధరలు పెరగడంతో పలు నగరాల్లో 80 రూపాయల మేరకు ధరలు పెరిగాయి   కేరళ ప్రభుత్వం గత 24 గంటల్లో బాధిత ప్రాంతాల్లో తాజా కేసులను నమోదు చేయకుండా, సమయానుగుణ జోక్యం ద్వారా వ్యాప్తిని తగ్గించింది.   మనిషి ఇండోర్-గోవా ఇండిగో విమానంలో టేకాఫ్ ముందు తన ప్రియురానికి ప్రతిపాదించాడు.

పెళ్లి జరగట్లేదా? ఇలా చేస్తే మీ ఇంట పెళ్లి బాజా మోగాల్సిందే!!!

Author:

 

ప్రతి ఇంట్లో అబాయికైన, అమ్మాయికైన యుక్త వయసు రాగానే సరైన పెళ్లి సంబంధం చూడడం, అన్ని కుదరగానే అంగరంగ వైభవంగా పెళ్లి చేసేయడం జరుగుతుంటుంది. లెదంటే కనపడ్డ వారల్లా అడిగే మొదటి ఏ ఇంకా పెళ్లి అవలేదా?, పెళ్ళెప్పుడు అని గుచ్చి గుచ్చి అడగడం.. పిల్లలు, తల్లిదండ్రులు మొహాలు వేలాడేయడమూ చూస్తూంటాం. కొంతమంది ఎల్లి ప్రయత్నాలు చేసినా ఎదో ఒక అడ్డంకి వారి ఇంట్లో పెళ్ళి అవకుండా ఆపుతుంది. పెళ్ళి కోసం పూజలు పునస్కారాలు చేసి, జాతకాలూ, పూజారుల వెంట పడి తిరుగుతుంటారు కొంతమంది. అయితే ఇంటి వాస్తు దోశం వలన కూడా పెళ్ళి కి ఇబ్బంది కలుగుతుందని తెలుపుతున్నారు వాస్తు నిపుణులు. వారు చెప్పినట్లుగా ఇంట్లో చిన్న చిన్న మార్పుల చేస్తే దెబ్బకు ఇంట్లో పెళ్లి బాజాలు మార్మోగే చాన్స్ ఉంది మీరు ప్రయత్నించండి.

marriage postponed

పెళ్లి జరగాల్సిన అమ్మాయి రూమ్ నైరుతిలో ఉంటే పెళ్లి త్వరగా జరుగుతుందట. నైరుతి మూల స్థిరత్వానికి ప్రతిరూపం కాబట్టే అమ్మాయిల గది ఈ మూలన ఉంటె జీవితం, ఆమే పెళ్ళిలో కూడా స్థిరత్వం ఉంటుదట. ఒకవేళ నైరుతి కుదరకపోతే, వాయువ్యం కానీ పశ్చిమం కానీ బెటర్ అంట. ఇక అబ్బాయిలకైతే దక్షిణం కానీ పశ్చిమంలో కానీ రూమ్ ఉండాలట. కొందరి ఇళ్ళల్లో పెళ్ళికి సుముఖంగా లేని అమ్మాయిలు అబ్బాయిలు ఉంటారు.. ఎంత నచ్చ చెప్పినా వినరు. అలాంటప్పుడు ఒక గాజు ప్లేట్ లేదా గ్లాస్ లో క్రిస్టల్ బాల్స్ వేసి ఉత్తర దిక్కున పెడితే మంచి మార్పు ఉంటుంది.

ఇంకా కొన్ని సందర్భాల్లో పెళ్లి ఆల్మోస్ట్ ఓకే అయినా అబ్బాయి కుటుంబం తరపునుంచి ఏమైనా ఇబ్బందులెదురవుతుంటే గనక, మీ ఇంటి గుమ్మం లో కానీ గుమ్మం ఎదురుగా కానీ ఎవరు కూర్చోకపోవడం వల్ల ఈ సమస్య తగ్గుముఖం పడుతుంది. ఇక పెళ్లి చూపులు జరిగినా ఆ సంబందం ముందుకు వెళ్ళకుండా ఆగిపోతుంటే ఆ ఇంటి గోడలకు పింక్ లేదా లేత పసుపు, తెలుపు రంగులేయడం వల్ల సత్పలితాలు ఉంటాయి. ఇక కుజ దోషం ఉన్న వారైతే ఇంటి డోర్స్ కి ఎరుపు లేదా పింక్ కలర్ వేయడం వలన పెళ్లి పనులు వేగం అవుతాయట. ఇంకా అమ్మాయి, అబ్బాయి రూముల్లో వేస్టేజ్ ఎక్కువగా ఉన్నా, మంచాల కిందా ఇనుప రాడ్స్ ఉన్న పెళ్లి లేట్ అవుతుందట. ఇలాంటివి లేకుండా జాగ్రత్తపడటం మేలు. నైరుతి దిశలో వాటర్ టాంకులు, సంపులు ఉన్నా కూడా పెళ్లి ఆలస్యమయ్యే అవకాశముంది. ఈ చిన్న చిన్న మార్పులతో పాటూ కాస్త పాసిటివ్ థింకింగ్ తో ఉంటె మీ ఇంట్లో త్వరలోనే పెళ్లి బాజాలు మోగి, పెళ్లి పందిల్లేసి, పప్పన్నం పెట్టె గడియ వచేస్తుందట. ఇక మీ ఇళ్ళల్లో పెళ్లి సందల్లే. శీగ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు….

(Visited 1,225 times, 145 visits today)

Comments

comments