Home / General / Video: ఒక్క చిట్కాతో 350 ఉన్న షుగర్ లెవెల్స్ ని 90 కి తీసుకొచ్చారు..! ఎలాగో తెలుసా..!?

Video: ఒక్క చిట్కాతో 350 ఉన్న షుగర్ లెవెల్స్ ని 90 కి తీసుకొచ్చారు..! ఎలాగో తెలుసా..!?

Author:

ప్రస్తుతం మనదేశంలో ఎక్కువమందిని వేధిస్తున్న ఆరోగ్య సమస్యలు అధిక బరువు, షుగర్ (డయాబెటిస్), బిపి… వీటిని తగ్గించుకోవడం కోసం టాబ్లెట్లు మింగుతూ.. ఫుడ్ ని కంట్రోల్ చేసుకుంటూ.. ఇంకా వ్యాయామాలు చేస్తూ ఉంటారు చాలామంది, చాలా కష్టపడి ఇవన్నీ చేసిన ఈ అనారోగ్య సమస్యల నుండి బైటపడలేకపోతున్నారు, ఇలాంటి వారి కోసం వీరమాచినేని రామకృష్ణరావు అనే వ్యక్తి ముల్లుని ముల్లుతోనే తీయాలనే చిట్కాని కనిపెట్టారు.

శరీరంలో కొవ్వు పెరిగిపోవడం వల్లనే ఎక్కువ ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని స్వయంగా గుర్తించిన వీరమాచినేని రామకృష్ణరావు కొవ్వుని కొవ్వుతోనే కరిగించాలనే చిట్కాతో చాలా మంచి ఫలితాలని రాబట్టారు, కొన్నేళ్ల క్రితం రామకృష్ణారావు బరువు 123 కిలోలు! తన భారీకాయాన్ని తగ్గించుకోవడానికి శరీరాన్ని చాలా కష్టపెట్టేవారు. ఉదయాన్నే సైకిల్‌ తొక్కడం.. ఇతరత్రా వ్యాయామాలు చేసేవారు. అదే సమయంలో… ఊబకాయం, మధుమేహం, ఇతర జీవన శైలి సంబంధిత సమస్యలకు పరిష్కారాన్ని కనిపెట్టడం మొదలుపెట్టారు. చైనా సంతతికి చెందిన కెనడా నెఫ్రాలజిస్టు జీసన్‌ఫెంగ్‌ పరిశోధనలని చదివిన రామకృష్ణ వాటి ఆధారంగా… కొవ్వుకు కొవ్వవుతోనే చెక్‌ చెప్పే ఆహార నియమావళిని రూపొందించారు. ఈ ప్రయోగాన్ని తొలుత తనపైనే చేసుకున్నారు. ఆయన బరువు 60 రోజుల్లోనే 123 కిలోల నుంచి 93 కిలోలకు తగ్గింది. తర్వాత… మధుమేహంతో బాధపడుతున్న ఓ స్నేహితుడిని ఒప్పించి, ఈ ఆహార నియమాలను పాటించేలా చేశారు. ఆయన షుగర్‌ లెవెల్‌ తగ్గినట్లు గమనించారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలతోపాటు ఇతర రాష్ట్రాలు, ఆస్ట్రేలియా, అమెరికా, లండన్‌, దుబాయి దేశాల్లోని అనేక మంది తెలుగు వారు ఈ డైట్‌ పాటిస్తున్నారు.

“నా ఫ్రెండ్‌ ఇంజనీర్‌ ఒకరు షుగర్ తో బాధపడుతుండేవాడు. దానిని నియంత్రించుకునేందుకు రోజుకు నాలుగు టాబ్లెట్లు తీసుకునేవాడు. షుగర్‌ రోగులు సకాలంలో టాబ్లెట్లు, ఆహారం తీసుకోవాలంటారు కదా. కానీ మేమిద్దరం మాట్లాడుకుని వాటిని ఆపేశాం. చక్కెర లేకుండా గ్రీన్‌ టీలో రెండు స్పూన్ల కొబ్బరి నూనెను తాగించా. 350 ఉన్న చక్కెర వ్యాధి ఒకటో రోజుకే 90కి వచ్చింది. రెండో రోజే ఆయనతో సైకిల్‌ తొక్కించా. ఎంతో వేగంగా సైకిల్‌ తొక్కాడు. రోజూ ఒక స్పూన్‌ కొబ్బరి నూనెతో కేవలం 5 రోజుల్లో 6 కేజీలు తగ్గినట్టు శాస్త్రీయంగా చూడగలిగాం. డయాబెటిక్‌, స్పాండిలైటస్‌, ఆర్థటైస్‌కు మందులకు కనిపెట్టేంత స్థాయి నాది కాదు. కానీ అనుకోకుండా ఓ మ్యాజిక్‌లా కొబ్బరినూనెతో షుగర్‌ పోతుంది అని నిరూపించాం” అని వివరించారు వీరమచానేని రామకృష్ణారావు.

‘హై ఫ్యాట్‌’ డైట్‌ను వ్యక్తుల అవసరాలను బట్టి రెండు నెలల నుంచి నాలుగు నెలలు అనుసరించాలి. లక్ష్యం సాధించాక ఈ డైట్ ప్రోగ్రామ్‌ నుంచి బయటికి వచ్చి.. కొంచెం కంట్రోల్ తో ఆహారం తీసుకోవచ్చు. ఆయిల్‌ ఫ్యాట్‌, నిమ్మకాయలు, మంచినీళ్లు, పల్చటి మజ్జిగ, మల్టీ విటమిన్‌ టాబ్లెట్లు.. హై ఫ్యాట్ డైట్ తరువాత తీసుకునే ఆహారంలో ఇవే కీలకం. బాదం, పిస్తా, వాల్‌నట్‌, గుమ్మడి గింజలు, పొద్దు తిరుగుడు, పుచ్చ, అవిసె గింజలు, తెల్ల నువ్వులు తినవచ్చు. రోజుకు ఆరు వరకు కోడిగుడ్లు (పచ్చసొనతో సహా) తినొచ్చు. పావు కిలో మటన్‌, చికెన్‌, ఫిష్‌, రొయ్యలను నిర్దిష్ట విధానంలో వండుకుని తీసుకోవచ్చు. స్వీట్లు, పండ్లు, పాలు, పాల పదార్థాలు, చక్కెర, బెల్లం, తేనె, కూల్‌డ్రింక్స్‌, కొబ్బరినీళ్లు, కాఫీ, టీ, మద్యం, ధూమపానం, గుట్కాలు పూర్తిగా నిషిద్ధం. గ్రీన్‌ టీ, షుగర్‌ లెస్‌ లెమన్‌ టీ తీసుకోవచ్చు.

ఈ హై ఫ్యాట్ డైట్ ని ఆరునెలలు పాటిస్తే ఎలాంటి ఆపరేషన్ లు, చికిత్సలు అవసరం లేకుండా మధుమేహం, బీపీ, థైరాయిడ్‌, స్పాండిలైటిస్‌, ఆర్థరైటిస్‌, అధిక బరువు వంటి అనారోగ్య సమస్యలని దూరం చేసుకోవచ్చని.. అనారోగ్యం పేరుతో మనకి ఇష్టమైన ఆహారాన్ని దూరం చేసుకోవాల్సిన అవసరం లేదని వీరమాచినేని చెప్తున్నారు, ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో అనేకమంది వ్యక్తులతో పాటు కొంతమంది డాక్టర్లు కూడా ఈ డైట్ ని ఫాలో అయ్యి ఆరోగ్య సమస్యల నుండి బయటపడ్డారని వీరమాచినేని తెలిపారు, మరిన్ని వివరాల కోసం 9246472677 నెంబర్‌కు ఫోన్‌ చేయొచ్చు.

(Visited 1,602 times, 91 visits today)