చెన్నైలో పోలీసులే వాహనాలని తగలబెట్టారు, పగుల గొట్టారు…!

Author:

సాధారణంగా ఎక్కడైనా అల్లర్లు, గొడవలు జరిగితే ఆందోళనకారులు అక్కడ ఉన్న వాహనాలకు నిప్పు పెడతారు, ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులని ధ్వంసం చేస్తారు, వారిని పోలీసులు లాఠీ ఛార్జి చేసో, ఇంకేదో చేసో పరిస్థితిని అదుపులోకి తెస్తారు, కానీ చెన్నైలో జల్లికట్టు పై నిషేధాన్ని తొలగించడానికి యువకులంతా కలిసి చేసిన శాంతియుత నిరసనలో పోలీసులే రెచ్చిపోయారు, నిరసన చేస్తున్న యువకులని చెడగొట్టడానికి పోలీసులే వాహనాలకు నిప్పుపెట్టారు. కొన్ని వాహనాలను పగులగొట్టారు.


పోలీసులు చేసిన దారుణాలని కొంతమంది వీడియోలు చేసి సోషల్ మీడియాలో పెట్టడంతో వారి బాగోతం బయటి ప్రపంచానికి తెలిసింది, ఈ వీడియోలలో పోలీసులే ఒక ఆటోకి, ఒక ఇంటికి నిప్పు పెడుతున్నట్టుగా ఉంది, మరికొంతమంది పోలీసులు ఇంటి ముందు నిలిపివుంచిన బైక్ లని పగులగొట్టిన దృశ్యాలు రికార్డు అయ్యాయి, పోలీసులే నిప్పు పెట్టి యువకులపై నిందలు మోపడం ఏంటి అని తమిళనాడు ప్రజలు మండిపడుతున్నారు.

(Visited 509 times, 19 visits today)