Home / Videos / Video: అర్జున్ రెడ్డిని మించిన ఇంటర్వ్యూ ఇది..!

Video: అర్జున్ రెడ్డిని మించిన ఇంటర్వ్యూ ఇది..!

Author:

గత పదిరోజులుగా టాలీవుడ్ లో అర్జున్ రెడ్డి గురుంచే డిస్కషన్స్ నడుస్తున్నాయి, అర్జున్ రెడ్డి సినిమా సూపర్ ఉంది, పాత్ బ్రేకింగ్ మూవీ అని కొందరు, ఈ సినిమా యువతని చెడగొట్టేలా ఉందని కొందరు, బూతులు ఉన్నాయని మరికొందరు ఈ సినిమా గురుంచి చెప్పుకొచ్చారు, సినిమా ఫలితం పక్కకి పెడితే ఈ సినిమాలో లీడ్ రోల్ లో నటించిన విజయ్ దేవరకొండ గురుంచి హాట్ హాట్ డిస్కషన్ లు జరుగుతున్నాయి, రిలీజ్ కి ముందు విజయ్ దేవరకొండ ఇచ్చిన స్పీచ్ గురుంచి, రిలీజ్ తరువాత విజయ్ దేవరకొండ ఇచ్చిన ఇంటర్వ్యూల గురుంచి సోషల్ మీడియాలో పెద్ద పెద్ద డిస్కషన్స్ జరుగుతున్నాయి, వివిధ ఇంటర్వ్యూలలో విజయ్ దేవరకొండ ఇచ్చే సమాధానాలకి ప్రేక్షకులు ఫిదా అయిపోతున్నారు, రీసెంట్ గా TV9 ఛానెల్ లో ఇంటర్వ్యూ ఇచ్చిన విజయ్ దేవరకొండ ఇరుకున పెట్టె ప్రశ్నలకి కూడా సింపుల్ గా సమాధానాలు ఇచ్చేసి రివర్స్ లో యాంకరమ్మకే దిమ్మ తిరిగేలా చేసాడు.


విజయ్ దేవరకొండకి ఎలాగైనా కాంట్రవర్సీలోకి లాగాలని యాంకర్ ఎంత ప్రయత్నించినా విజయ్ దేవరకొండ మాత్రం సింపుల్ గా యాంకర్ కే కౌంటర్ లు వేసాడు, విజయ్ దేవరకొండ ఎప్పుడో అన్నమాటని పట్టుకొని బాలయ్య ఫ్యాన్స్ తో కాంట్రవర్సీ చేయాలనీ యాంకరమ్మ ప్రయత్నించినా విజయ్ దేవరకొండ మాత్రం నవ్వుతూనే యాంకర్ కి పంచ్ లు ఇచ్చేసాడు, ఈ ఇంటర్వ్యూ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది, ఆ వీడియో పై మీరు ఓ లుక్కు వేసుకోండి.

Comments

comments