Home / Inspiring Stories / వాళ్ళ కరెంట్ వాళ్ళే తయారు చేసుకుంటున్నారు

వాళ్ళ కరెంట్ వాళ్ళే తయారు చేసుకుంటున్నారు

Author:

solar village

1.3 బిలియన్ మందికి ఇంకా కరెంట్ అనేది అందకుండానే జీవిస్తున్నారు,మనదేశంలో ఆ సంఖ్య 300 మిలియన్ మంది, కానీ ఇప్పటికీ కరెంట్ అవసరమైనంత అందించలేకపోతున్నాం. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా బొగ్గు నిల్వలు అడుగంటుతున్నాయి. అణువిద్యుత్ ఎంతటి భయంకరమైనదో మనకు తెలియందికాదు. దీనికి పరిష్కారం….!

తరగని శక్తివనరు సోలార్ విద్యుత్ పారిశ్రామికావసరాల కోసం ఇప్పుడు విద్యుత్ ని వాడుతూనే సొలార్ పవర్ తో గృహావసరాల ను తీర్చుకోవచ్చు చిన్న స్థాయి లో గ్రామాలలో ఈ సోలార్ విద్యుత్ ప్లాంట్ల వల్ల ఎన్నొ జీవితాల్లో వెలుగులు నింపొచ్చు… ఇప్పటికే ఇలాంటి ప్రయత్నాలు జరుగుతూనే ఉన్న కూడా ఇంకా విస్తరించాల్సిన అవసరం ఉంది. ఐతే కొన్ని స్వచ్చంద సంస్థలూ,కొందరు మనుషులూ సూర్యుని వెలుగులని దోసిల్లలో నింపుకోని దోసిల్లలో నిరుపేద గ్రామాళ్ళో వెదజల్లే ప్రయత్నం చేసారు, ఇంటింటా విద్యుత్ తీగలు పాకించి వెలుతురు పువ్వులు పూయంచే ప్రయత్నం చేసారు, చీకట్లోనే మగ్గుతున్న గ్రామాలలో కొత్త కాంతి తో చీకటిని తుడిచేసుకునే ప్రయత్నం చేసారు.వివరాల్లోకి వెళితే…

 

solar village durnai

“కిస్మత్‌ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కతియా అనే చిన్న గ్రామం గ్రామం. దేశ రాజధానికి 600 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఊరికి కనీస అవసరాలైన మంచినీరూ,కరెంటూ రెండూ లేవు. కానీ కరెంట్ వస్తే నీటి సమస్య తీరుతుంది.మోటార్లు,బోర్ల ద్వారా మంచినీటి సమస్యనూ కొంతవరకూ తీర్చొచ్చు. ఈ గ్రామ ప్రజలకు కరెంట్ అంటే ఎలా ఉంటుందో కూడా ఈ ఏడాది(2015) ఏప్రిల్ వరకు తెలియదు. కిస్మత్ చేసిన ప్రయత్నం ఆ ఊరికి కరెంట్ తెచ్చింది. ముంబై లో ఉన్న తన భర్తతో మాట్లాడేందుకు చార్జింగ్ దగ్గర మొదలైన కిస్మత్ ఆలోచన ఆ వూరికే వెలుగునిస్తూ, కిస్మత్ సోలార్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎంపికైంది.ఢిల్లీలో జరిగిన అంతర్జాతీయ సదస్సుకు ముఖ్య అతిధిగా హాజరైంది. అక్కడ కిస్మత్ గురించి,ఆమె గ్రామం కథా తెలిసి ఉత్తర ప్రదేష్, బీహార్ రాష్ట్రాల్లో మరికొన్ని సోలార్ ప్లాంట్లను నిర్మించటానికి సహకారం అందిస్తాం అంటూ రాక్‌ఫెల్లర్ ఫౌండేషన్ స్మార్ట్ పవర్ ఇండియా ప్రాజెక్ట్ ముందుకొచ్చింది. సాదాసీదా మహిళ తన జీవితంలో వెలుగులు నింపుకుని ఆ గ్రామానికి దారి చూపుతున్న దేవతగా మారింది. ఇప్పుడు “చిరాగ్ దీదీ” (దీపం అక్కా..!) అని పిలుచుకుంటున్నారు కథియా గ్రామస్తులు…”

 

baripatha solar village

“61 ఇళ్లు, 350 మంది జనాభా కలిగిన బారిపత గ్రామాన్ని విద్యుత్ శాఖ అధికారులు ఎవరూ పట్టించుకోలేదు. భువనేశ్వర్‌కు కేవలం 25 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నప్పటికీ ఇంత చిన్న గ్రామానికి కరెంటా? అంటూ ఎవరూ పట్టించుకోలేదు. కానీ అయిన జైదీప్నాయక్ అనే ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి రగిల్చిన చైతన్యంతో గ్రామస్థులంతా ఒకటిగా కదిలారు. నాల్కో, ఎకో సోలార్, జాన్సన్ సోలార్ తదితర అందుబాటులోవున్న అన్ని సోలార్ కంపెనీల వద్దకు తిరిగారు. తమ గ్రామాని కరెంట్ ఇవ్వటానికి ప్రభ్త్వం ముందుకు రాకున్నా సూర్యుడి తోనే తాము కరెంట్ తెచ్చుకుంటామంటూ ప్రయత్నాలు చేసారు. చివరకు పలు కంపెనీల సహకారంతో ఊరి మొత్తానికి సోలార్ వెలుగులను తెచ్చుకున్నారు. అక్టోబర్ రెండు, గాంధీ జయంతి రోజున తమ ఊరి కోసం తామె తెచ్చుకున్న విద్యుత్ ప్లాంట్‌ను ఆవిష్కరించుకున్నారు. ఇంతకీ ఆ అరవై ఇళ్ళకూ అసలు కోత అంటూ లేని కరెంట్ ఇవ్వటానికి అయిన ఖర్చు ఎంతో తెలుసా? ఏడు లక్షల రూపాయలు. మొత్తం సోలార్ ప్లాంట్‌కు ఏడు లక్షల రూపాయలు ఖర్చుకాగా, అందులో సగం సొమ్మును గ్రామస్థులు భరించగా మిగతా సొమ్మును సోలార్ కంపెనీలే భరించాయి. ఊరి కూడలిలో పెద్ద సోలార్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసి, దాని నుంచి 61 ఇళ్లకు కరెంట్ ఇచ్చారు.ఊరందరికి నీటిని సరఫరాచేసే బోరింగ్‌కు కూడా సోలార్ విద్యుత్‌ను ఏర్పాటు చేసుకున్నారు. సోలార్ ప్యానెల్ వ్యవస్థ పూర్తిగా గ్రామం ఆధీనంలోనే కొనసాగుతుంది. సోలార్ ప్యానెళ్లను ఎప్పటికప్పుడు శుభ్రంగా తుడిచేందుకు, బ్యాటరీల్లో నీటి లెవళ్లను పర్యవేక్షించే బాధ్యతలను గ్రామానకి చెందిన ఐటీఐ డిప్లొమా హోల్డర్ ఎపిల్ కుమార్‌కు అప్పగించారు.”

 

banjerpally solar powered village in medak

“మెదక్ జిల్లా సిద్దిపేట మండలం బంజేరుపల్లి ఇది మన రాష్ట్రం లోనిదే ఒక ఊరు ఊరు మొత్తం తమ కరెంటు కస్టాలను తీర్చుకోవటానికీ,కరెంటును ఆదాచేయటానికీ నడుం కట్టారు. గ్రామంలో మొత్తం నూట ఇరవై ఇళ్ళకు గానూ నూటా ఇరవ అంటే ! 100% అన్నమాట ప్రతీ ఇంటి పైకప్పు మీదా సోలార్ ప్యానెల్సే కనిపిస్తాయి. అందుకే గ్రామంలో ఎవ్వరినోటా కూడా కరెంటు కోతలన్న మాట వినిపించదు. ఇదివరకు ఊరు పరిస్థితి ఇలా ఉండేది కాదు కరెంట్ ఎప్పుడు పోతుందో ఎప్పుడు ఉంటుందో తెలియని పరిస్థితి. కానీ ఇప్పుడు ఊరి రూపమే మారిపోయింది. మొత్తం సోలార్ ప్యానల్స్ తో పవర్ కోసం ఒక్కో యూనిట్ కు ఎనభై ఐదు వేల రూపాయలు ఖర్చవుతుంది. దీంట్లో ప్రభుత్వం తొంబై శాతం సబ్సిడీ ఇస్తుంది. మిగితా ఎనిమిది వేల 500 రూపాయలను మాత్రమే లబ్దిదారుడు కట్టాల్సి ఉంటుంది. దీన్ని ఉపయోగించుకొని గ్రామస్తులంతా పవర్ కట్ పై సమరశంఖం పూరించారు. సోలార్ పవర్ ప్రొడక్షన్ పై దృష్టి పెట్టారు. ప్రస్తుతం బంజేరుపల్లిలో ఒక్క యూనిట్ తో నాలుగు లైట్లు, రెండు ఫ్యాన్లు మరియు టీవీ నడుస్తున్నాయి. కొన్ని ఇళ్లలో ఫ్రిజ్జులకు కూడా సోలార్ పవర్ నే వాడుతున్నారు. గృహ అవసరాలతో పాటు సోలార్ పవర్ తో నడించే పంపు సెట్లను ఇచ్చే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తోంది. అదే జరిగితే పవర్ కష్టాల నుంచే రాష్ట్రం గట్టెక్కినట్టేనని బంజేరుపల్లి గ్రామస్తులు చెబుతున్నారు.”

 

solar powered village durnai

“బీహార్ లోని జెహనాయ్ జిల్లాల్లోని ధర్నాయీ అనే గ్రామానికి వెల్తూంటే ‘సోలార్ విద్యుత్ గ్రామానికి స్వాగతం అనే బోర్డు కనిపిస్తుంది. ఎందుకంటే వూళ్లో ఏర్పాటు చేసిన సోలార్ మైక్రోగ్రిడ్లే వారికి అవసరమైన మొత్తం కరెంటును ఉత్పత్తి చేసేస్తున్నాయి. అందుకే, ధర్నయి ఇప్పుడు దేశంలోనే పూర్తిస్థాయిలో సౌర విద్యుత్తును వినియోగించుకుంటున్న మొట్టమొదటి గ్రామంగా మరో ఘనతనూ దక్కించుకుంది.తమ కరెంట్ కష్టాలను ఎదుర్కునేందుకు ధర్నాయీ ప్రజలు సోలార్ గ్రిడ్ల ఏర్పాటు తో పెద్దమొత్తం లోనే కరెంటుని ఉత్పత్తి చేసుకుంటున్నారు. బీహార్ రాజధానికి కేవలం 70కిలోమీటర్ల దూరంలోనే ఉన్నా ఈ ఊరికి ముప్పైఏళ్ళు గాకరెంట్ లేదు. ముప్పయ్యేళ్ళ కిందట పేలిపోయిన ట్రాన్స్ఫారమర్ ఇప్పటికీ రిపేరవకుండా నుంది. గుడ్డి దీపాల వెలుగులో ఇన్ని సంవత్సరాలు గడిపిన ఆ గ్రామ వాసులు ఇక తాము ఎవర్నో బతిమాలేలా కాకుండా తమ సొంతానికి తామే కరెంట్ తయారు చేసుకోవాలనుకున్నారు.మూడు దశాబ్దాల పాటు ఎన్నో చీకటి కష్టాలు పడిన వారి జీవితాల్లో వెలుగులు నింపడానికి మూడేళ్ల కిందట’గ్రీన్‌పీస్ ఇండియా’ స్వచ్ఛంద సంస్థ ముందుకొచ్చింది. ఈ సమస్యకు పర్యావరణ సమతుల్యాన్ని కాపాడే దిశలో పరిష్కారం కనిపెట్టింది. అలా వచ్చినవే సూర్యకాంతిని తీసుకుని సౌర విద్యుత్తును ఉత్పత్తి చేసే మైక్రోగ్రిడ్లు. సీడ్(సెంటర్ ఫర్ ఎన్విరాన్‌మెంట్ అండ్ ఎనర్జీ డెవెలప్‌మెంట్), బేసిక్స్(మెరుగైన జీవన విధానానికి తోడ్పడే సంస్థ) అనే మరో రెండు స్వచ్ఛంద సంస్థలతో కలసి గ్రీన్‌పీస్ ఇండియా సుమారు మూడు కోట్ల రూపాయలను ఖర్చుపెట్టి సౌరఫలకాలున్న మైక్రోగ్రిడ్లను వూరంతటా ఏర్పాటు చేసింది. కేవలం మూడు నెలల వ్యవధిలోనే గ్రామంలోని ప్రతి ఇంటికీ సోలార్ విద్యుత్తును సరఫరా చెయ్యగలిగింది. అంతేకాదు, వంద కిలోవాట్ల సామర్థ్యం ఉన్న ఈ మైక్రో గ్రిడ్లు 450ఇళ్లూ 2400మంది జనాభా ఉన్న ధర్నయి గ్రామం మొత్తం అవసరాలకు విద్యుత్తును సరఫరా చేస్తున్నాయి. అందులో యాభై వాణిజ్య భవనాలూ రెండు పాఠశాలలూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కిసాన్ శిక్షణ సంస్థలూ నీటి పంపులు కూడా ఉన్నాయి. ఒకప్పుడు కిరోసిన్ దీపాలకే ఈ గ్రామస్థులు వందల రూపాయల్ని ఖర్చుపెట్టేవారు. కానీ ఇప్పుడు ఇంట్లోని అవసరాలన్నింటికీ సరిపడా విద్యుత్తును వాడినా వచ్చే బిల్లు రూ.రెండొందల లోపే. పైగా మైక్రో గ్రిడ్లను నిర్వహించే పనిని వూళ్లోని యువకులకే అప్పగించింది గ్రీన్‌పీస్ సంస్థ. దాంతో కొందరికి ఉపాధీ లభించింది. అందుకే, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా ఈ సౌర విద్యుత్తు మీద ఆసక్తి చూపిస్తున్నారు. ఇక, పర్యావరణానికి ఎంతగానో ఉపయోగపడే దిశలో దేశంలోని విద్యుత్తు అవసరాలను తీర్చే ఈ ఉపాయం కూడా ఎందరికో నచ్చింది. చిన్న చిన్న అవసరాలకోసం కూడా కరెంట్ ఉన్న పక్క గ్రామాలకు వెళ్ళ వలసి వచ్చేది ఇప్పుడా అవసరం లేదు మేమూ మాఊలుగా బతకగలం ఇది చాలా ఆనందంగా ఉంది అంటున్నారు ధర్మాయీ గ్రామస్తులు..”

(Visited 286 times, 79 visits today)