Home / Inspiring Stories / డబ్బూ,మతమూ,రాజకీయాలూ లేని గ్రామం మన దేశం లోనే ఉందని తెలుసా?

డబ్బూ,మతమూ,రాజకీయాలూ లేని గ్రామం మన దేశం లోనే ఉందని తెలుసా?

Author:

auroville town people

తమిళనాడులోని విలుప్పురం జిల్లాలో ఆరోవిల్లే అనే గ్రామం ఉంది. ఈ గ్రామం నుంచి పుదుచ్చెరికి దాదాపు 10 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇక్కడ ప్రజలు ఒక దేశానికి చెందిన వాళ్ళుకాదు. కానీ వీళ్ళందరూ ఒకే గ్రామం లో ఉంటున్నారు. ఈ ఊళ్ళో ఉన్న ప్రజలకు మతం లేదు, వీళ్ళకి తమ ఊరు అన్న గుర్తింపుతప్ప మరే పౌరసత్వమూ,అక్కర్లేదు. ప్రపంచం లో ఉన్న ఏ మత సాంప్రదాయమూ,నమ్మకాలూ వీళ్లకి ఉండవు. తమ ఊరినే ఒక దేశం గా మలుచుకున్నరు వీళ్ళు. ప్రపంచంలో ఏ మూలన జీవిస్తున్న వారైనా సరే ఈ గ్రామానికి రావచ్చు. ఇక్కడ హాయిగా ప్రశాంతంగా జీవించవచ్చు. ఇంకా విచిత్రం ఏమిటంటే ఇక్కడి ప్రజలందరూ అసలు డబ్బుని వాడరు తమ తమ పనులకు, సేవలకు, వస్తువులకు ఒకరి దగ్గర మరొకరు డబ్బులు తీసుకోరు.

auroville village environment
ఈ గ్రామాన్ని 1968లో ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త శ్రీ అరబిందో శిష్యురాలు మిర్ర అల్పాస్సా నిర్మించారు. ఈ పట్టణం నిర్మించిన మొదట్లో 124 దేశాల నుంచి ప్రజలు వచ్చి ఇక్కడి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాలుపంచుకునే వారు. ఇప్పుడీ పట్టణంలో 50 దేశాలకు చెందిన 2,345 మంది ప్రజలు నివాసం వుంటున్నారు. మానవులంతా ఒక్కటే, శాంతి సమానత్వంతో ఎక్కడైనా నిరభ్యంతరంగా జీవించవచ్చు అనే సిద్ధాంతంతో ఈ పట్టణాన్ని ఆమె నిర్మించారు.మిర్ర అల్పాస్సా ఆశయాల ప్రకారమే ఇక్కడి వారు కుల, మత, జాతి అంతరాలు లేకుండా ఆధ్యాత్మిక జీవనం సాగిస్తున్నారు. ఈ పట్టణం స్వయం ప్రతిపత్తి గల ప్రాంతం. ఇక్కడి పరిపాలన మూడు విభాగాలుగా ఉంటుంది. ప్రజా అసెంబ్లీ, ప్రభుత్వ మండలి, అంతర్జాతీయి సలహా మండలి ఉంటాయి. వీటి ద్వారానే పట్టణ పరిపాలన సాగుతుంది. ఈ పట్టణ బాధ్యత మానవ వనరుల శాఖ తీసుకుంటుంది.
మనుషులంతా ఒక్కటే అనే చాటిచెప్పడానికి ఈ గ్రామం ఏర్పాటైంది. ప్రస్తుతం ఇక్కడ దాదాపు 50 దేశాలకు చెందిన ప్రజలు జీవనం సాగిస్తున్నారు. 3 వేల జనాభా కలిగిన ఈ గ్రామంలో చిన్నారుల నుంచి 80 ఏళ్ల వృద్ధుల వరకు అందరూ ప్రశాంత జీవితం గడుపుతున్నారు. స్వయం ప్రతిపత్తితో నడుస్తున్న ఈ గ్రామం, హ్యూమన్ రిసోర్స్‌ డెవలప్‌మెంట్‌ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఉంటుంది.

1968, ఫిబ్రవరి 28న ఆరోవిల్లేకు శంకుస్థాపన చేశారు. 124 దేశాలకు చెందిన ప్రజలతో పాటు, భారత్‌లోని ప్రతీ రాష్ట్రానికి చెందిన పౌరులు ఆరోవిల్లే టౌన్‌షిప్ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు. మిర్రా ఆదేశానుసారం ఇక్కడ నివసించాలనుకున్న ప్రతీ దేశ పౌరుడు తమతో పాటు మాతృభూమి మట్టిని కూడా ఇక్కడకు తీసుకువచ్చారు. వాళ్లు తీసుకువచ్చిన మట్టినంతటిని కలిపి ఒక కళాఖండాన్ని తయారుచేయించారు. అదీ ఆరోవిల్లే టౌన్‌షిప్ మధ్యలో గోళాకారంగా బంగారు రంగులో ఉంటుంది.

auroville golden temple

గ్రామం మధ్యలో ఉన్న ప్రదేశమే ‘పీస్‌ ఏరియా’(శాంతి మందిరం), అందమైన పెద్ద తోట, సరస్సు, భారీ మర్రి చెట్టులతో పాటు ఆరోవిల్లేయన్స్ అందిరికీ ఒకే మందిరం ఉండటం విశేషం. దీన్ని ‘మంత్రిమందిర్‌’గా వ్యవహరిస్తారు. ప్రజలంతా ఇక్కడ సమావేశం అవుతుంటారు, సాయంత్రాలు ఇక్కడ సరదాగా గడుపుతూంటారు. అంతా ఒకే కుటుంబంగా ఆడుకుంటారు, మాట్లాడుకుంటారు. గ్రామ విశేషాలను చర్చిస్తుంటారు. ఇండస్ర్టియల్‌, కల్చరల్‌, ఇంటర్నేషనల్‌, రెసిడెన్షియల్‌ ఇలా నాలుగు భాగాలుగా గ్రామాన్ని విభజించారు.
ఆరోవిల్లే గ్రామంలోని ఇల్లు కూడా చాలా భిన్నంగా ఉంటాయి. ఈ గ్రామానికి ప్రత్యేక టౌన్‌ప్లానింగ్‌ బ్యూరో ఉంది. పరిశోధనాశాలలు, ఆడిటోరియం, రెస్టారెంట్లు, తోటలు, గెస్ట్‌హౌజ్‌లు, 40 పరిశ్రమలు ఇక్కడ ఉన్నాయి. అంతేకాదు ఆరోవిల్లేయన్సకు ‘ఆరోనెట్‌’ పేరుతో ప్రత్యేక ఈ-మెయిల్‌ నెట్‌వర్క్‌ ఉండటం విశేషం.

unity people
ప్రపంచం లో ఉన్న ప్రతీ కోపానికీ,మనుషుల మద్య ఏర్పడుతున్న దూరానికీ ఏకైక కారణం వ్యక్తిగత ఆస్తి అందుకే వీరంతా ఉమ్మడి గా తప్ప సొంతానికి అంటూ తమ వద్ద డబ్బు ఉంచుకోరు, వివక్షతకూ కారణం అయిన రంగూ,జాతీ దేశమూ అనే పదాలను కనీసం తమ ఆలోచనలకు కూడా రానివ్వరు… ఈ గ్రామం లాగా మన దేశమూ, ఈ ప్రపంచమూ మారిపోతే ఈ యుద్దాలూ, చావులూ, కోర్టులూ, నేరాలూ ఉండవేమో కదా….!

(Visited 5,082 times, 47 visits today)