EDITION English తెలుగు
"పీవీ సింధు..మమ్మల్ని క్షమించు"   Video: ప్రియురాలి శవానికి తాళి కట్టి పెళ్లి చేసుకున్న ప్రేమికుడు.   Video: ఒక్క పాటతో ఇంటర్నెట్ ని ఊపేస్తున్న మల్లు బ్యూటీ..!   నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా చేసాడు.. సంపాదించిన ఆస్తి రూ.3930 మాత్రమే..!   మహేష్ బాబు, అల్లు అర్జున్ లకు షాక్ ఇచ్చిన రజినీకాంత్..!   లవర్స్ మధ్య జరిగిన ఈ వాట్సాప్ చాట్ లు చూస్తే ఖచ్చితంగా నవ్వుకుంటారు..! 3వది అయితే హైలైట్..!   మహారాజశ్రీ హైకోర్టు న్యాయమూర్తి గారికి....! కదిలించిన జెడ్పి విద్యార్థినిల లెటర్..!   హైదరాబాద్ లోని ఈ హాస్పిటల్ లో రూ. 10 లక్షలు అయ్యే చికిత్సలు అన్ని ఉచితం..!   తల్లి చనిపోతూ తన కొడుక్కి రాసిన లెటర్..! అది చదివితే కన్నీళ్లొస్తాయి...!   బీటెక్ స్టూడెంట్స్ కు నెలకు రూ.80వేల స్కాలర్ షిప్.
Home / General / శివుడు కలలోకనిపించాడని రోడ్డు తవ్వేసారు

శివుడు కలలోకనిపించాడని రోడ్డు తవ్వేసారు

Author:

భక్తి ముదిరి పిచ్చిగా మారడమంటే ఇదే మరి. శివుడు కలలోకనిపించాడని ఏకంగా హైవే రోడ్డునే తవ్వేసారు ఈ మూఢ నమ్మకపు భక్తులు. నడి రోడ్డు మీద దాదాపు 12 అడుగుల లోతు గుంట చేసి పారేశారు. పెంబర్తి కి చెందిన మనోజ్ అనే వ్యక్తికి కలలో శివుడు కనబడి ఫలానా చోట తవ్వితే మహిమాన్వితమైన శివ లింగం లభిస్తుంది, దాన్ని ప్రతిష్టించి పూజించండి అని సాక్షాత్తూ దేవుడే సెలవిచ్చాడని ఊరి వారందరికీ చెప్పుకున్నాడు. మొదట్లో ఎవరూ నమ్మలేదు. కానీ ప్రతి రోజూ మనోజ్ ఆ ప్రాంతానికి వెళ్లి పూజలు నిర్వహిస్తుండడంతో మెల్లిగా ఒక్కొక్కరూ నమ్మడం మొదలుపెట్టారు. ఇంకేంముంది ఊరు ఊరంతా ఒక్కటైపోయింది.

villagers dig up highway in search of Shiva Lingam

హైదరాబాద్, వరంగల్ జాతీయ రహదారికి బయలు దేరారు. మామూలుగా పలుగు పార తో తవ్వితే సమయం ఎక్కువ పడుతుంది అనుకున్నారో ఏమో, ఏకంగా ప్రోక్లేనర్ నే రంగంలోకి దించారు. నడి రోడ్డుని తవ్వే ముందు పూజలు నిర్వహించారు. కొబ్బరికాయలు కొట్టారు. ఇక రోడ్డుని తవ్వడం మొదలెట్టారు. ఏకంగా పది అడుగుల పైనే తవ్వేశారు. అయినా ఆ పిచ్చి భక్తుడు మనోజ్ చెప్పినట్టు ఏ శివ లింగమూ కానరాలేదు. ఆ నోటా ఈ నోటా ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వచ్చి, అనుమతి లేకుండా.. అదీను హైవే మీద నది రోడ్డునే తవ్వేసినందుకు మనోజ్ ని, సహకరించినందుకు ఆ ఊరి సర్పంచు, మరికొందరిని అరెస్టు చేసి స్టేషన్ కి తీసుకెళ్ళారు.

అయితే నిత్యం శివ దీక్ష లో ఉండే సదరు మనోజ్ అనే వ్యక్తీ చాలా కాలంగా మనో వ్యాధితో బాధపడే వాడనీ, పిచ్చి ముదిరే ఇలా ప్రవర్తిస్తున్నడనీ స్థానికులు చెబుతున్నారు. అయితే అదేం కాదు కొంతమంది కలిసి గుప్త నిధుల కోసమే ఈ తవ్వకాలు చేసారనేది మరో వాదన. ఏది ఏమైనా కలలో ఎవరో చెప్పారని హైవే రోడ్డుని తవ్వటం తప్పే కదా..!

Comments

comments