EDITION English తెలుగు
కాలా సినిమా రివ్యూ & రేటింగ్.   డేవిడ్ వార్నర్ మరియు భార్య కాండిస్ బాల్-టాంపెరింగ్ కుంభకోణం తరువాత గర్భస్రావం చేస్తారు   చైనా హఫీజ్ సయీద్ ను వెలుపలికి వెలుపల కోరుకుంటున్నారు.   MH17 రష్యన్ సైనిక క్షిపణి వ్యవస్థ డౌన్ కూలిపోయింది, పరిశోధకులు చెప్పారు   అమెరికాపై ఆధారపడిన సంబంధం భారత్కు ఎప్పటికీ ఉండదు: నిపుణుడు కాంగ్రెస్ సభ్యులకు చెబుతాడు   హెల్త్కేర్ యాక్సెస్ అండ్ క్వాలిటీలో 195 దేశాలలో నెమ్మదిగా మెరుగుపరుచుకోవడం, భారతదేశం రాంక్స్ 145   ఢిల్లీ మనిషి తన కుమారుని హతమార్చాడు   పెట్రోల్ ధరలు పెరగడంతో పలు నగరాల్లో 80 రూపాయల మేరకు ధరలు పెరిగాయి   కేరళ ప్రభుత్వం గత 24 గంటల్లో బాధిత ప్రాంతాల్లో తాజా కేసులను నమోదు చేయకుండా, సమయానుగుణ జోక్యం ద్వారా వ్యాప్తిని తగ్గించింది.   మనిషి ఇండోర్-గోవా ఇండిగో విమానంలో టేకాఫ్ ముందు తన ప్రియురానికి ప్రతిపాదించాడు.

వ్యక్తిగత అభిమానమే తప్ప నేను దేశద్రోహిని కాదు.

Author:

Virat Kohli Fan Arrested in Pakisthan

వ్యక్తిగత స్వేచ్చ ఎంత ఉన్నా కొన్ని దేశాల చట్టాలు అన్నిటినీ తేలిగ్గ తీసుకోవు. ఆటగాడి పై అభిమానం వేరూ దేశం మీద చూపే గౌరవం వేరు. సరిగ్గా ఒక క్రికెట్ అభిమాని విషయంలో ఇదే జరిగింది. భారత ఆటగాడైన విరాట్ కోహ్లీ మీద ఉన్న వీరాభిమానమే అతనికి కష్టాల్ని తెచ్చింది. దీనికి కారణం అతను పాక్ దేశస్తుడు కావటమే.పాక్ చట్టాల ప్రకారం వేరే దేశాల ఝంఢాలను తమ ఇళ్ళమీద గానీ,కార్యాలయాల మీద గానీ,ప్రధాన కూడళ్ళలో గానీ ఎగురవేయటం, ప్రదర్శించడం నేరం కిందకి వస్తుంది. ఐతే ఈ విషయం తెలియని లాహోర్‌కు సమీపంలోని ఓకారా కు చెందిన ఉమర్ అనే వ్యక్తి కోహ్లిపై ఉన్న అభిమానాన్ని వ్యక్తం చేస్తూ తన ఇంటిపై భారత దేశ చిహ్నం అయిన త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశాడు. వేరే దేశపు ఝండా అందులోనూ పాక్ శతృవుగా భావించే భారత పతాకం కావటంతో. పాక్ పోలీసులకూ,కోర్టులకూ ఆ అమాయక క్రీడాభిమానిలో దేశ ద్రోహి కనిపించాడు.

అంతే అతని మీద పాకిస్థాన్‌ శిక్షా స్మృతిలోని దేశ సార్వభౌమత్వానికి వ్యతిరేకంగా వ్యవహరించే నిబంధనల ఆధారంగా కేసు నమోదు చేశారు. ఈ ఆరోపణలు రుజువై అతడికి గురువారం నాడు పదేళ్ల వరకూ జైలు శిక్ష పడింది. కోహ్లిపై అభిమానాన్ని చాటిచెప్పేందుకు మాత్రమే భారత పతాకాన్ని ఎగురవేశానని,తన దేశ చట్టాలలో ఇది నేరమని తనకు తెలియదని,తనకు ఒక ఆటగాడిగా నచ్చిన విరాట్ అంటే ఉన్న అభిమానం తోనే ఇంట్లో అతని పోస్టర్లను అతికించుకున్నాననీ కేవలం అతని మీద ఇష్టంతోనే అలా పతాకాన్ని తన ఇంటిపై పెట్టానని ఉమర్‌ ఎంత మొత్తుకున్నా పట్టించుకోకుండా. అతనికి పదేళ్ళ కారాగార శిక్ష విధించింది. పాక్ కోర్టు.

Must Read: సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు సినిమా పర్ఫెక్ట్ రివ్యూ & రేటింగ్.

(Visited 1,546 times, 49 visits today)

Comments

comments