Home / Technology / 16 రూపాయలకే గంట అన్ లిమిటెడ్ 4G డేటా ఇస్తున్న వోడాఫోన్.

16 రూపాయలకే గంట అన్ లిమిటెడ్ 4G డేటా ఇస్తున్న వోడాఫోన్.

Author:

జియో దెబ్బకు మిగిలిన అన్ని నెట్ వర్క్ కంపనీలకు దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అయ్యింది. మొదలు పెట్టిన మూడు నెలలలోపే 5 కోట్లకుపైగా వినియోగదారులను సంపాదించుకున్న జియో కు అడ్డుకట్ట వెయ్యడానికి మిగిలిన నెట్ వర్క్ లు వింత వింత కొత్త ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. అందులో బాగంగానే వోడాఫోన్ తమ వినియోగదారులకు ఒక కొత్త డేటా ఆఫర్ ను అందుబాటులోకి తేనుంది. ఈ ఆఫర్ ప్రకారం వోడాఫోన్ ప్రీపెయిడ్ వినియోగదారులు 16 రూపాయల రీచార్జ్ తో ఒక గంట పాటు అపరిమిత 3G లేదా 4G డేటా ను పొందవచ్చు. గంట అపరిమిత డేటా అంటే రీచార్జ్ చేసిన టైం నుండి మిగిలిన 60 నిముషాల వరకు ఎటువంటి పరిమితులు లేకుండా 3G లేదా 4G డేటా వాడుకోవచ్చు.

vodafone-data-offer

ఈ అఫర్ కి పరిమితి ఏమి లేదు రోజుకు ఎన్ని సార్లు అంటే అన్ని సార్లు ఈ 16 రూపాయల రీచార్జ్ చేయించుకోవచ్చు. ఎన్ని సార్లు రీచార్జ్ చేస్తే అన్ని గంటలు ఈ అఫర్ ప్రకారం డేటా వాడుకోవచ్చు. మీ ఊరిలో 3G లేదా 4G డేటా సిగ్నల్స్ అందుబాటులో లేకపోతే 7 రూపాయలు రీచార్జ్ తో గంట పాటు అపరిమిత 2G డేటా ను వాడుకోవచ్చు. ఇంతకుముందు అవసరం లేకున్నా డెయిలి డేటా ప్యాకుతో డబ్బులు వృదా చేసుకున్న వారికి ఈ ఆఫర్ బాగా నచ్చుతుంది అని వోడాఫోన్ సంస్థ భావిస్తుంది. ప్రస్తుతం ఈ ఆఫర్ కొన్ని పట్టణాల వరకే అందుబాటులోకి రానుంది. ఈ అఫర్ జనాలకు కనెక్ట్ అయితే అందరికి అందుబాటులోకి తేవాలని వోడాఫోన్ సంస్థ భావిస్తుంది.

(Visited 274 times, 14 visits today)