EDITION English తెలుగు
హెల్త్కేర్ యాక్సెస్ అండ్ క్వాలిటీలో 195 దేశాలలో నెమ్మదిగా మెరుగుపరుచుకోవడం, భారతదేశం రాంక్స్ 145   ఢిల్లీ మనిషి తన కుమారుని హతమార్చాడు   పెట్రోల్ ధరలు పెరగడంతో పలు నగరాల్లో 80 రూపాయల మేరకు ధరలు పెరిగాయి   కేరళ ప్రభుత్వం గత 24 గంటల్లో బాధిత ప్రాంతాల్లో తాజా కేసులను నమోదు చేయకుండా, సమయానుగుణ జోక్యం ద్వారా వ్యాప్తిని తగ్గించింది.   మనిషి ఇండోర్-గోవా ఇండిగో విమానంలో టేకాఫ్ ముందు తన ప్రియురానికి ప్రతిపాదించాడు.   జెడి (ఎస్) నాయకుడు హెచ్డి కుమారస్వామి కర్నాటకలో 24 వ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు.   ఈ ఫొటో చూడగానే "బాషా" సినిమా గుర్తు వస్తే తప్పు లేదు. నిజంగానే ఆటో వెనకాల రాసిన దాన్ని ఆచరించి చూపిస్తున్నాడు హైదరాబాద్ కు చెందిన ఈ ఆటో డ్రైవర్.   స్మార్ట్ టీవీ ఇక మన బడ్జెట్ లోనే-MI వారి కొత్త ఉత్పత్తులు   పండంటి కాపురానికి పది సూత్రాలు..   ఇలా పండ్లు ఎప్పటికీ పిల్లలకు పెట్ట కూడదు

లవ్ చేసిన ఆఫీసర్ నే పెళ్లి చేసుకోబోతున్న కలెక్టర్ ఆమ్రపాలి.

Author:

వరంగల్ రూరల్ మరియు అర్బన్ జిల్లాల కలెక్టర్ ఆమ్రపాలి కాటా త్వరలోనే ఓ ఇంటివారు కాబోతున్నారు, 2010 ఐఏఎస్ బ్యాచ్ కి చెందిన ఆమ్రపాలి, 2011 ఐపీఎస్ బ్యాచ్ కి చెందిన సమీర్ శర్మని ప్రేమ వివాహం చేసుకోబోతున్నారు, ఫిబ్రవరి 18న జమ్మూలో సమీర్ శర్మతో పెళ్లి జరిపేందుకు పెద్దలు నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఫిబ్రవరి 23న వరంగల్ కలెక్టర్ బంగ్లాలో జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులు, పురప్రముఖుల సమక్షంలో రిసెప్షన్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోన్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.

ఆమ్రపాలి గారి తండ్రి విశాఖపట్నానికి చెందిన కాట వెంకటరెడ్డి. ఆయన ఆంధ్రా యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేసి రిటైర్డ్ అయ్యారు. ఆమ్రపాలి ఐఐటీ మద్రాస్ నుంచి సివిల్ ఇంజినీరింగ్‌ పూర్తి చేసి తర్వాత బెంగళూరు IIM నుంచి పీజీ డిప్లొమా పట్టా అందుకున్నారు.IAS కాకముందు బ్యాంకులో పనిచేశారు. 2010లో సివిల్స్‌ రాసి 39వ ర్యాంక్ సాధించారు. మంచి ర్యాంక్ రావడంతో సొంత రాష్ట్ర కేడర్‌లో ఐఏఎస్‌గా ఎంపికయ్యారు.

ఆమ్రపాలి కి పెళ్లి కుదిరింది

2014లో వికారాబాద్ సబ్ కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన ఆమ్రపాలి తర్వాత మహిళా శిశు సంక్షేమ విభాగానికి మారారు. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత వరంగల్‌ అర్బన్‌ కలెక్టర్‌గా ఆమ్రపాలి 2016 అక్టోబరు 11న బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచి పాలనలో తనదైన ముద్ర వేస్తూ వరంగల్ జిల్లా ప్రజల అభిమానాన్ని గెలుచుకున్నారు. ఆమ్రపాలికి కాబోయే భర్త సమీర్ శర్మ ఐపీఎస్ ప్రస్తుతం డయ్యు డామన్ ఎస్పీగా పనిచేస్తున్నారు.

(Visited 1,105 times, 1,152 visits today)

Comments

comments