EDITION English తెలుగు
"పీవీ సింధు..మమ్మల్ని క్షమించు"   Video: ప్రియురాలి శవానికి తాళి కట్టి పెళ్లి చేసుకున్న ప్రేమికుడు.   Video: ఒక్క పాటతో ఇంటర్నెట్ ని ఊపేస్తున్న మల్లు బ్యూటీ..!   నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా చేసాడు.. సంపాదించిన ఆస్తి రూ.3930 మాత్రమే..!   మహేష్ బాబు, అల్లు అర్జున్ లకు షాక్ ఇచ్చిన రజినీకాంత్..!   లవర్స్ మధ్య జరిగిన ఈ వాట్సాప్ చాట్ లు చూస్తే ఖచ్చితంగా నవ్వుకుంటారు..! 3వది అయితే హైలైట్..!   మహారాజశ్రీ హైకోర్టు న్యాయమూర్తి గారికి....! కదిలించిన జెడ్పి విద్యార్థినిల లెటర్..!   హైదరాబాద్ లోని ఈ హాస్పిటల్ లో రూ. 10 లక్షలు అయ్యే చికిత్సలు అన్ని ఉచితం..!   తల్లి చనిపోతూ తన కొడుక్కి రాసిన లెటర్..! అది చదివితే కన్నీళ్లొస్తాయి...!   బీటెక్ స్టూడెంట్స్ కు నెలకు రూ.80వేల స్కాలర్ షిప్.
Home / Inspiring Stories / హాస్టల్ వార్డెన్ ల ఆగడాలకు సెల్ఫీ తో చెక్ పెట్టిన కలెక్టర్ ఆమ్రపాలి.

హాస్టల్ వార్డెన్ ల ఆగడాలకు సెల్ఫీ తో చెక్ పెట్టిన కలెక్టర్ ఆమ్రపాలి.

Author:

ఈ మధ్య అన్ని రకాల స్మార్ట్ ఫోన్ లలో వస్తున్న ఫీచర్ సెల్ఫీ కెమెరా, సెల్ఫీ కెమెరా అంటే మనకి మనమే సొంతగా ఫోటోలు తీసుకోవచ్చు అని ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే, ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాలలో కూడా సెల్ఫీ కెమెరాల జోరు ఎక్కువైపోయింది, సెల్ఫీతో కేవలం మన ఫోటోలు మనమే తీసుకోవడం కాదు దానితో అక్రమార్కుల ఆగడాలకు చెక్ పెట్టవచ్చు అని నిరూపించారు వరంగల్ అర్బన్ కలెక్టర్ ఆమ్రపాలి గారు.

ఆమ్రపాలి

వరంగల్ జిల్లాలో ఉన్న 35 ప్రభుత్వ సంక్షేమ హాస్టల్ లలో దాదాపు 5000 మంది విద్యార్థులు ఉంటూ చదువుకుంటున్నారు, అధికారుల నిర్లక్ష్యం, హాస్టల్ వార్డెన్ ల అలసత్వం కారణంగా ఆ హాస్టల్ లలో ఉంటున్న విద్యార్థులకి సరైన భోజనం అందట్లేదు, అలాగే అధికారుల నిర్లక్ష్యం వల్ల హాస్టల్ వార్డెన్లు అక్రమాలకు పాల్పడుతున్నారు, విద్యార్థుల సంఖ్యను తారుమారు చేస్తూ అక్రమాలు చేస్తున్నారని, హాస్టల్ వార్డెన్ లు హాస్టల్ లకి వెళ్ళటం లేదని, వెళ్లిన కూడా వెంటనే తమ సొంతపని చూసుకుంటున్నారన్న విషయం వరంగల్ కలెక్టర్ ఆమ్రపాలి దృష్టికి వచ్చింది, ప్రభుత్వం నుండి జీతం పొందుతూ హాస్టల్ లో వార్డెన్లు ఉండకపోవటాన్ని తీవ్రంగా పరిగణించిన కలెక్టర్ సెల్ఫీ ఐడియాకి శ్రీకారం చుట్టారు.

ఆమ్రపాలి

స‌ద‌రు సంక్షేమ వ‌స‌తి గృహాల వార్డెన్లు, సంబంధిత అధికారులు, ఉపాధ్యాయులు అంద‌రికీ క‌లిపి ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశారు క‌లెక్ట‌ర్ ఆమ్ర‌పాలి. ఆమే ఈ గ్రూప్‌కు అడ్మిన్‌గా ఉన్నారు. ఈ క్ర‌మంలో స‌ద‌రు హాస్ట‌ల్స్‌కు చెందిన వార్డెన్లు రోజూ త‌మ త‌మ పాఠ‌శాల‌లు, క‌ళాశాల‌ల‌కు వెళ్లి మ‌ధ్యాహ్న భోజ‌నం వ‌డ్డించి, అదే స‌మ‌యంలో అక్క‌డి విద్యార్థులంద‌రితో క‌లిసి సెల్ఫీ దిగాలి. అనంత‌రం ఆ సెల్ఫీని ఆమ్ర‌పాలి క్రియేట్ చేసిన వాట్సాప్ గ్రూప్‌లో పెట్టాలి. దీంతో వారు రోజూ హాస్ట‌ల్‌కు వ‌చ్చేది, రానిదీ, భోజ‌నం ఎలా పెడుతుందీ సుల‌భంగా తెలుస్తుంది. ఈ ఆలోచ‌న వ‌ల్ల ప్రస్తుతం ఆ హాస్ట‌ల్స్ వార్డెన్లు అంద‌రూ స‌రైన స‌మ‌యానికి వ‌చ్చి విద్యార్థుల‌కు నాణ్య‌మైన భోజ‌నం పెట్ట‌డ‌మే కాదు, వారికి మౌలిక స‌దుపాయాల‌ను క‌ల్పిస్తున్నార‌ట‌. దీంతో పాఠ‌శాల‌ల‌కు, క‌ళాశాల‌ల‌కు రెగ్యుల‌ర్‌గా వ‌చ్చే విద్యార్థుల సంఖ్య పెరిగింద‌ట‌. వార్డెన్ ల చేతివాటం కూడా తగ్గుముఖం పడుతుంది, వారు రోజూ సెల్ఫీలు దిగి పెడుతుండ‌డంతో ఎవ‌రు ఎలా ప‌నిచేస్తున్నారో క‌లెక్ట‌ర్ ఆమ్ర‌పాలికి తెలుస్తున్న‌ద‌ట‌. ఎవ‌రైనా ఒక్క రోజు అలా భోజ‌నం స‌మ‌యంలో సెల్ఫీ దిగి పెట్ట‌క‌పోయినా ఆమె క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటున్నార‌ట‌. అవును మ‌రి, ఇలాంటి క‌ఠిన‌మైన, నిజాయితీ ఉన్న క‌లెక్ట‌ర్లు ఉంటే ఇక ఎవ‌రి ఆగ‌డాలు సాగుతాయి చెప్పండి. ఏది ఏమైనా క‌లెక్ట‌ర్ ఆమ్ర‌పాలి చేస్తున్న ప‌నికి ఆమెను మ‌నం అభినందించాల్సిందే క‌దా..!

Comments

comments