Home / Inspiring Stories / వాడిపోయిన పువ్వులని వాడి లక్షలు సంపాదిస్తున్నారు.

వాడిపోయిన పువ్వులని వాడి లక్షలు సంపాదిస్తున్నారు.

Author:

అంకిత్ అగర్వాల్, కరణ్ రస్తోగీ కాన్పూర్ కి చెందిన ఈ ఇద్దరు మిత్రులూ ఒక రోజు క్వింటాళ్ళకొద్దీ పువ్వులని గంగా నదిలో పడేయటం చూశారు. గంగాని స్వచ్చంగా ఉంచుతూనే ఆ పువ్వులతో పనికొచ్చే పనిచేయలేమా అన్న ఆలోచన వారికి లాభాల పంట పడించింది అప్పటికే పాతిక వేలకు పైగా సంపాదించే ఉద్యోగాల్లో ఉంటూనే ప్రమొషన్ల కోసం కొత్త కోర్సులు చేయాలనుకున్న ఈ ఇద్దరూ…. తమ వ్యాపారాన్ని వాడేసి వడిపోయిన పువ్వులతో మొదలు పెట్టారు. హెల్ప్ అజ్ గ్రీన్ అనే సంస్థ కు రూపకల్పన చేసారు. ఆ వ్యాపారంతో వీళ్ళ కు లాభాలే కాదు మరికొందరు పేదలకు ఉపాది దొరికింది.గుళ్ళలో,పెళ్ళిలలో వాడిన పూల వ్యర్థాల వల్ల ఉత్పన్నమయ్యే కాలుష్యమూ తగ్గింది…. అంటే ఒకే దెబ్బకి మూడు పిట్టలన్న మాట… కాన్పూర్ లోని 85 నిరుపేద కుటుంబాలకు చెందిన మహిళలకు జీవనోపాధి కల్పిస్తోంది హెల్ప్ అజ్ గ్రీన్.

Flowers 1

Source: TheBetterIndia

“మంచి ఉద్యోగాలు వదిలేసి పువ్వులు ఏరుకుంటూ కూర్చుంటారా”… ఇదీ అంకిత్ తల్లి స్పందన. ఇక కరణ్ కుటుంబం అయితే ఈ ఆలోచనే వద్దని చెప్పేసింది. కానీ ఈ ఇద్దరు మిత్రులకీ తాము చెసేపని మీద నమ్మకం ఉంది అందుకే వీళ్ళు తమ ఆలోచనని విరమించు కోలేదు. పువ్వులను కంపోస్ట్ చేసి సేంద్రియ ఎరువును ఎలా తయారు చేయాలన్నదానిపై వీరిద్దరూ పరిశోధన చేయడం మొదలుపెట్టారు. బోటనీ ప్రొఫెసర్లతో, రైతులతో మాట్లాడారు. కంపోస్టింగ్ అంటే ఆసక్తి ఉన్న వ్యక్తులతో, ఆలయ కమిటీలతో, సేంద్రీయ ఎరువులు తయారుచేసేవాళ్లతో, పువ్వుల వ్యాపారులతో మాట్లాడారు. పశువులూ,కోళ్ల పరిశ్రమల నుంచి వచ్చే జీవ వ్యర్థాలతో ఎరువులు ఎలా తయారు చేస్తున్నారనే దానిపై స్టడీ చేశారు. ఉత్తమమైన నైట్రోజన్ ఫాస్పరస్ పొటాషియ్ తయారు చేసి వెర్మి కంపోస్ట్ విలువేంటో అందరికీ చాటాలనుకున్నారు. అయితే వీరి ప్రయత్నం ఆరు నెలల తర్వాత ఫలించింది. 17 సహజపదార్థాలతో తయారు చేసిన ఎరువును కనుగొన్నారు.

Flowers 2

Source:TheBetterIndia

వర్మీకంపోస్ట్ లో నైట్రోజన్ లెవెల్ ను పెంచేందుకు కాఫీ,టీ వ్యర్థాలను వాడారు కాన్పూర్ లోని కాఫీ హోటళ్ళలో రోజూ వచ్చే టీ,కాఫీ వ్యర్థాలను వాడారు. ఖనిజాలూ, పోషకాలు, ఎంజైమ్ లతో తయారు చేసిన ఈ ఏకో ఫ్రెండ్లీ ఎరువుకు ‘మిట్టీ’ అని పేరు పెట్టారు. రసాయన ఎరువులతో పోలిస్తే కర్బన ఉద్గారాలు లేని ఈ ఎరువు సురక్షితమైన, అద్భుతమైన ప్రత్యామ్నాయం అని చెప్పొచ్చు. మిట్టీ ఎరువులో ఎలాంటి కెమికల్స్ లేకపోవడంతో దీన్ని ఉపయోగించి పండించిన పంటలన్నీ సేంద్రీయమైనవే.

Flowers 8

మిట్టీ సక్సెస్ తర్వాత వీరిద్దరూ అగరుబత్తీల తయారీపై పరిశోధనలు మొదలుపెట్టారు. సంప్రదాయ పద్ధతిలో తయారు చేసే అగరుబత్తీల్లో వాడే బొగ్గు క్యాన్సర్ కారకమైంది. అందుకే అందుకు భిన్నంగా ఆలయాల్లో వాడిన పువ్వులను ఉపయోగించి అగరుబత్తీలు తయారు చేసే పద్ధతిని కనిపెట్టారు. ‘స్టిక్స్ అండ్ స్టోన్స్’ పేరుతో చేతితో సహజసిద్ధమైన అగరుబత్తులను తయారుచేస్తున్నారు. ఎక్కడా పర్యావరణానికి హాని కలగకుండా, భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా జాగ్రత్తపడుతున్నారు. ప్యాకింగ్ విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మార్కెట్లో శాండల్ వుడ్ అగరుబత్తుల్ని 30 రూపాయలకు కొంటారు. కానీ శాండల్ వుడ్ ఆయిల్ ధర కిలోకు లక్షపైనే ఉంది. ఈ లెక్కలు చాలు… వాళ్లు కేవలం కెమికల్స్ తో తయారైనవి కొంటున్నారని చెప్పడానికి. మా అగరుబత్తుల్ని చేత్తో తయారు చేస్తారు. స్టిక్స్ అండ్ స్టోన్స్ అగరుబత్తుల్ని సహజసిద్ధంగా సేకరించిన ఆయిల్ లోనే ముంచి తీస్తాం.” అంటారు అంకిత్.

Flowers 7

భారతదేశంలోని ఆలయాలు, మసీదులు, గురుద్వారాల్లో పువ్వులను సమర్పించడం అందరికీ అలవాటు. ఇలా పువ్వులను సమర్పించి వారి భక్తిని చాటుకుంటారు భక్తులు. అలా నదుల్లో కూడా పువ్వులను విడిచిపెట్టి భక్తిని చాటుకుంటారు. కానీ ఆ తర్వాత జరిగే పరిణామాల గురించి వాళ్లు పట్టించుకోరు. ఈ పువ్వుల వల్లే చేపలు చనిపోతున్నాయని, జలాశయాల్లో పొరలు దెబ్బతింటాయని, అపారమైన కాలుష్యానికి కారణమవుతుందని వారికి తెలియదు. ఎందుకంటే పువ్వులు పెరగడానికి పురుగుమందులను, రసాయన ఎరువులను ఉపయోగిస్తున్నారు. ఈ పువ్వులను నదిలో కలపడం ద్వారా నీళ్లు అత్యంత విషపూరితంగా మారుతున్నాయి. ప్రతీ సంవత్సరం ఎనిమిది లక్షల టన్నుల పువ్వులను భారతీయ నదుల్లో వేస్తారని అంచనా. గంగా నదిలో కాలుష్యానికి ప్రధాన కారణాల్లో ఇదీ ఒకటి. అందుకే ప్రజల ఆలోచనల్లో, ప్రవర్తనలో మార్పు తీసుకురావాలని అనుకున్నారు వీరిద్దరు.

Source: TheBetterIndia

Source: TheBetterIndia

వీరి ఉత్పత్తులు ఇప్పుడు దేశసరిహద్దులనీ దాటాయి…. హెల్ప్ అజ్ గ్రీన్ కు ప్రశంసల జల్లు కురుస్తోంది. ఐఎస్బీ ఐడియా ఛాలెంజ్ 2015, ఐఐఎం ఇండోర్ కల్పవృక్ష ఛాలెంజ్ 2015, ఐఐటీ కాన్పూర్ సోషల్ ఛాలెంజ్ 2015 అవార్డులు గెలుచుకున్నారు. టాటా సోషల్ ఎంటర్ ప్రైజ్ ఛాలెంజ్ 2016లో ఫైనలిస్ట్. ఈ స్థాయిలో వస్తున్న గుర్తింపు వారి కుటుంబ సభ్యులు, స్నేహితుల అభిప్రాయాల్ని మార్చేశాయి.హెల్ప్ అజ్ గ్రీన్ ఉత్పత్తులు ఇండియన్ మార్కెట్ లో కూడా దొరుకుతున్నాయి. యజ్ఞ పేరుతో ఫ్లిప్ కార్ట్, అమెజాన్, స్నాప్ డీల్ లాంటి ప్రముఖ ఇ-కామర్స్ పోర్టల్స్ లో అమ్ముతున్నారు. ఈ పోర్టల్స్ నుంచి రెండు శాతం సేల్స్ వస్తున్నాయి….. “ప్రకృతికి మేలు చేసేది ఏదైనా మనకూ మేలు చేస్తుంది. అందుకే పర్యావరణానికి మేలు చేయాలనుకున్నాం తద్వారా మాకు మేమూ మేలు చేసుకున్నాం”అంటున్నారీ ఇద్దరు మిత్రులూ…

(Visited 3,099 times, 61 visits today)