Home / Inspiring Stories / తెలంగాణాలోనే ఉన్న అద్భుతమైన ఈ జలపాతాల గురించి మీకు తెలుసా..?

తెలంగాణాలోనే ఉన్న అద్భుతమైన ఈ జలపాతాల గురించి మీకు తెలుసా..?

Author:

waterfalls_in_telangana state

అందమైన ప్రకృతి దృశ్యం, జలపాతాలూ కొండలూ ఓహ్ అద్బుతమైన సీనరీలు. వెతుక్కుంటూ అరకు వరకూ వెళ్ళే పని లేదు. ఎక్కడికో వెళ్ళి మరీ చూసి వస్తూంటాం.అందమైన ప్రదేశాలే కానీ మన దగ్గరలోనే ఉన్న ప్రదేశాలను కూడా తెలుసుకోంటే మంచిది కదా..! మనకు దగ్గరలోనే ఉండే ఈ జలపాతాలను చూసేందుకు ఇతర ప్రాంతాల నుంచీ పర్యాటకులు వస్తూంటారు కానీ మనకు సరైన సమాచారం ఉండదు. అందుకే తెలంగాణాలో ఉన్న ఈ జలపాతాల గురించి చిన్న ఇన్ ఫర్మేషన్ .ఇవన్నీ మనకు దగ్గరలోనే ఉన్నాయి. ఒక్క రోజు ప్రయాణంతో వీటిని చేరుకోగలం. ఈ సారి ఎటైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు వీటినీ మీ లిస్ట్ లో వేసుకోండి…

భీముని జలపాతం: వరంగల్ జిల్ల నర్సం పేట పట్టణం బుధరావు పేట గ్రామానికి సమీపంలోనే ఉన్న ఈ జలపాతం గురించి పెద్దగా ప్రచారం లేదు కానీ. మీరు ఆశ్చర్య పోయే ప్రకృతి సౌందర్యం ఈ ప్రదేశం సొంతం.చూడటానికి జలపాతం చిన్నగానే కనిపించినా. చుట్టూ ఉండే అడవి మిమ్మల్ని మైమరపిస్తుంది. అక్కడె ఉండే పాండవుల గుహలు అనే ప్రాచీన గుహలని కూడా చూడవచ్చు…

మల్లెల తీర్థం జలపాతం:

తెలంగాణా రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లాలో ఉండే నల్లమల అడవుల్లో ఉందీ జలపాతం. శ్రీశైలం పట్టణానికి ఇది సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దట్టమైన అడవుల మధ్యన ఉన్నప్పటికీ రోడ్ మార్గంలో తేలికగానే ప్రయాణించవచ్చు. వర్షాకాలంలో మాత్రం రోడ్ సరిగ్గా వుండదు.ఈ మల్లెల తీర్థంలో స్నానాలు చేస్తే పాపాలు పోతాయని మోక్షం దొరుకుతుందని ఒక నమ్మకం.. కానీ ఈ నీటిలోకి చేరాలంటే సుమారు 250 మెట్లు దిగి వెళ్ళాలి కనుక, చాల జాగ్రత తీసుకోవాలి…

కుంటాల జలపాతం:

సహజ సిద్ధమైన జలపాతం కుంటాల జలపాతం. దాదాపు 45 మీటర్ల ఎత్తు నుంచీ పడే జలధార మిమ్మల్ని పరవశంలో ముంచెత్తుతుంది. ఆదిలాబాద్‌ జిల్లాలోని నిర్మల్ కి దగ్గరలో ఉన్న ఈ కుంటాల జలపాతానికి విశిష్ట గుర్తింపు ఉంది. కుంటాల గ్రామానికి సమీపం లోని అభయారణ్యంలో ఈ జలపాతం ఉంది. ఈ నీటి సొబగులు- పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. జిల్లాలో వర్షాలు పడుతుండటంతో- కుంటాల జలపాతం మరింత అందాన్ని సంతరించుకుంది. ఈ జలపాతం వద్ద సహజసిద్ధమైన శివలింగం కూడా ఉంటుంది. శివరాత్రి రోజున గిరిజనులు పెద్ద ఎత్తున ఇక్కడి వచ్చి పూజలు చేస్తారు. ఈ వాటర్‌ఫాల్స్‌ను చూసేందుకు వివిధ రాష్ట్రాల నుంచి పర్యాటలకు వస్తుంటారు.

పోచేరా జలపాతం:

నిర్మల్ కి 37 కిలోమీటర్ల దూరంలో ఉందీ పోచెరా ఫాల్స్ ఎక్కువ ప్రచారంలో లేదు కానీ అద్బుతమైన సౌందర్యం ఈ ప్రాంతం సొంతం. ఎక్కువగ రాళ్ళు నీళ్ళలో మునిగి ఉంటాయి. లోతుకూడా ఎక్కువ. అందుకే ఇక్కడికి వెళ్ళినప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి.కానీ మీరు ఇక్కడ చూసే ప్రకృతి సౌందర్యం మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది. వర్షాకాలం మొదట్లో కానీ ఆగస్టు సెప్టెంబర్ నెలల్లో కానీ ఈ జలపాతం చూడటానికి వెళ్ళొచ్చు. మిగతా సమయాల్లో అంత పచ్చగా కనిపించదు…

సిర్నాపల్లి జలపాతం:

సిర్నాపల్లి జలపాతం, జానకి బాయి జలపాతం నిజామాబాదు జిల్లాలోని ధరపల్లి మండలం లోని సిర్నాపల్లి దగ్గరలో ఉంది.తెలంగాణా నయాగారా జలపాతం అని కూడా దీనికి పేరుంది. నిజామాబాద్ నుంచి 20 కిలోమీటర్ల లోపే. ఇక్కడికి వెళ్ళటం చాలా సులబం. నిజామాబాద్ నుంచి ఆటోలో కూడా వెళ్ళిపోవచ్చు.

బోగతా జలపాతం:

తెలంగాణాలో ఇదే పెద్ద వాటర్ ఫాల్స్. ఖమ్మం జిల్లా వాజెడు దగ్గరలో ఉందీ జలపాతం. ఈ జలపాతం దగ్గరకు వెళ్లాలంటే.. ఎత్తైన పచ్చని చెట్లు, కొండల మధ్య ఉన్న అడవి నుంచి వెళ్లాలి. అడవి మధ్యలో అందమైన నీటి సెలయేర్లు కనువిందు చేస్తాయి. గుట్టల మధ్య నుంచి … ఆకాశమంత ఎత్తు నుంచి ధారలుగా నీళ్లు జారిపడుతుంటాయి. ఇక టూరిస్టుల సందడి ఈ అందాలను మరింత పెంచుతాయి.

(Visited 3,067 times, 69 visits today)