EDITION English తెలుగు
డేవిడ్ వార్నర్ మరియు భార్య కాండిస్ బాల్-టాంపెరింగ్ కుంభకోణం తరువాత గర్భస్రావం చేస్తారు   చైనా హఫీజ్ సయీద్ ను వెలుపలికి వెలుపల కోరుకుంటున్నారు.   MH17 రష్యన్ సైనిక క్షిపణి వ్యవస్థ డౌన్ కూలిపోయింది, పరిశోధకులు చెప్పారు   అమెరికాపై ఆధారపడిన సంబంధం భారత్కు ఎప్పటికీ ఉండదు: నిపుణుడు కాంగ్రెస్ సభ్యులకు చెబుతాడు   హెల్త్కేర్ యాక్సెస్ అండ్ క్వాలిటీలో 195 దేశాలలో నెమ్మదిగా మెరుగుపరుచుకోవడం, భారతదేశం రాంక్స్ 145   ఢిల్లీ మనిషి తన కుమారుని హతమార్చాడు   పెట్రోల్ ధరలు పెరగడంతో పలు నగరాల్లో 80 రూపాయల మేరకు ధరలు పెరిగాయి   కేరళ ప్రభుత్వం గత 24 గంటల్లో బాధిత ప్రాంతాల్లో తాజా కేసులను నమోదు చేయకుండా, సమయానుగుణ జోక్యం ద్వారా వ్యాప్తిని తగ్గించింది.   మనిషి ఇండోర్-గోవా ఇండిగో విమానంలో టేకాఫ్ ముందు తన ప్రియురానికి ప్రతిపాదించాడు.   జెడి (ఎస్) నాయకుడు హెచ్డి కుమారస్వామి కర్నాటకలో 24 వ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు.

పండంటి కాపురానికి పది సూత్రాలు..

Author:

ఆధునిక యువత సర్దుకుపోవడంలేదు.పెళ్ళికి ముందు ముచ్చటగా అనిపించిన విషయాలే తర్వాత భరించలేకుండా ఉంటున్నాయి. ప్రేమరంగు పెళ్ళిలో వెలిసిపోతోంది. అలా కాకుండా ఉండాలంటే చిన్నవే అయినా కొన్ని విషయాలు ముందే గమనించాలి. అవేంటో చూద్దామా?!

మంచి జీవిత భాగస్వామిలో మీరు చూడాల్సిన లక్షణాలుః

ప్రేరణ కలిగించడం

మీరెంచుకొన్న భాగస్వామి మీకు ప్రేరణనివ్వాలి. మీలో దాగిన నిజమైన శక్తులను బ‌య‌ట‌కు తీసి, లక్ష్య సాధనలో సరైన నిర్ణయాలు తీసుకొనేలా ప్రోత్సహించాలి.

అభద్రతా భావన కలిగించకూడదు

చిన్న విషయాలకే ఒకరినొకరు అనుమానించకూడదు. అసూయ పడేలా చేయకూడదు. అదేదో సినిమాలో “అసూయ ఘాటైన ప్రేమకు థర్మామీటరు” అని అన్నా అది హద్దులు మీరకూడదు.మీ మధ్య అంతా పారదర్శకంగా ఉండాలి.మీరేమిటో మీ భాగస్వామికి ప్రతీ సారి ఋజువు చేయాల్సిన అవసరం ఉండకూడదు.

మీ చుట్టూనే తిరగాలని కోరుకోకూడదు

తన ప్రపంచం మీరే అయినా అందులో మీరొక్కరే ఉండకూడదు. మీరు పరస్పరం భాగస్వామికి ప్రేమ, గౌరవం ఇవ్వాలి. ఎప్పుడూ మీ చుట్టూ తిరుగుతూ, మీ అవసరాలు కోరికలూ తీరుస్తూ ఉండాలని కోరుకోకూడదు.

పరస్పరం స్పేస్ ఇచ్చుకోవాలి

ఎవరి కెరీర్లో వారు ముందుకెళ్ళడానికి కావలసిన స్పేస్ ఇవ్వాలి. అడగనంత వరకూ ఒకరి పనుల్లో మరొకరు తల దూర్చ కూడదు.కేవలం మీ ఇద్దరి అనుబంధానికే కాక మీతో ముడి తడిన అన్ని బంధాలకు సమయాన్ని కేటాయించుకోవాలి. ఎవరికి వారు అప్పుడప్పుడూ సొంత స్నేహితులతో గడపాలి.

సహజంగా కుటుంబంలో కలసిపోవాలి.

మీరు ఉత్తమ భాగస్వామి కావాలంటే మీదైన ప్రపంచంలోకి మీ భాగస్వామిని కలపడానికి ప్రత్యేకమైన సందర్భాలు సృష్టించక్కర్లేదు.సహజంగానే ఆమె /అతను మీ కుటుంబ సభ్యులతో స్నేహితులతో కలసిపోవాలి. వారితో అన్ని విషయాలు పంచుకోగలగాలి. చర్చించగలగాలి.

బరువు బాధ్యతలు పంచుకోవాలి

మీరు ప్రేమ ఆప్యాయతలే కాదు, వారి బాధ్యతలనూ పంచుకోవాలి. శారీరకంగా, మానసికంగానే కాదు. ఆర్థికంగా కూడా దృఢంగా ఉండాలి.తమకు తాము సహాయం చేసుకోగలగాలి. పూర్తిగా మరొకరిపై ఆధారపడ కూడదు. సంసార బాధ్యతలు సమానంగా స్వీకరించాలి.

wife

రహస్యాలు ఉండకూడదు

భాగస్వాముల మధ్య ఎటువంటి రహస్యాలు ఉండ‌కూడదు. ముఖ్యంగా సామాజిక మాధ్యమాల లో పోస్టింగులతో సహా అన్నీ ఒకరికొకరు చుపించుకో గలిగేలా ఉండాలి. అలాగే ఇరువురి సామాజిక సంబంధాలను నిర్వహించుకోగలిగే, గౌరవించగలిగే పరిణతి కలిగి ఉండాలి.

అభిప్రాయాలు ఖచ్చితంగా చెప్పగలిగే స్వేచ్ఛ ఉండాలి

ప్రతీఅంశం పై ఒక అభిప్రాయం కలిగి ఉండడం తో పాటు వాటిని ఆమె లేక ఆయనకు స్పష్టంగా చెప్పగలగాలి. స్వతంత్రంగా వ్యవహరించాలి.కేవలం అవతలి వారి సంతోషం కోసమో లేక వాదనకు భయపడో ఏకీభవించ కూడదు.ఆతర్వాత లోలోపల అసంతృప్తి చెందుతుండకూడదు.ఇద్దరిలో ఎవరుకూడా తమ అభిప్రాయాలను మరొకరిపై బలవంతంగా రుద్ద రాదు. ఏ విషయంలోనైనా విభేదించడానికి చర్చించడానికి, ఇరువురూ రాజీ పడడానికీ అవకాశం ఉండాలి.

అంతా ఒకే గాటన కట్ట కూడదు

బేధాభిప్రాయాలు వచ్చినపుడు మీరంతా ఇంతే లాంటి జనరలైజ్డ్ కామెంట్లు చేయకూడదు.వీలైనంతగా పరిస్థితిని అర్థం చేసుకొనే ప్రయత్నం చేయాలి. అలా ప్రవర్తించడానికి కారణం తెలుసుకోవాలి.

సహకారం సమన్వయం

ఎవరి జీవిత లక్ష్యాలు వారికి ముఖ్యం.వ్యక్తిగత, వృత్తి గత జీవితాన్ని సమన్వయ పరచుకోవాలి. ఇంట బయటా ఒకరికొకరు సహకరించుకోవాలి.చిన్న చిన్న త్యాగాలు చేయాలి. చిన్న చిన్న విషయాలలోనే ఆనందాన్నీ పొందాలి.

మచ్చలున్నాయని చందమామని వదులుకోనట్లే లోపాలున్నాయని భాగస్వామిని వదులుకోకూడదు.

తెలుగు డాట్ అలజడి డాట్ కామ్ ను ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌,ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.

(Visited 1 times, 72 visits today)

Comments

comments