Home / Latest Alajadi / ఆ మూడు రోజుల్లో మాత్రమే మంచి ముహూర్తాలు లక్షలాదిగా జరగనున్న వివాహాలు

ఆ మూడు రోజుల్లో మాత్రమే మంచి ముహూర్తాలు లక్షలాదిగా జరగనున్న వివాహాలు

Author:

తెలుగు రాష్టాల్లో పెళ్ళి సందడి జోరుగా మొదలైంది. రెండు నెలల విరామం తర్వాత కేవలం మూడే మూడు రోజులు దివ్యమైన ముహూర్తాలుండడంతో పెళ్ళిళ్ళు హోరెత్తనున్నాయి.

మార్చి 3 నుండీ మార్చి 11 వరకూ భాజా భ‌జంత్రీలు మ్రోగనున్నాయి.

ముఖ్యంగా మార్చి 4వ తేదీ చాలా మంచి ముహూర్తంగా భావిస్తుండడంతో ఆ రోజే వేల సంఖ్యలో జంటలు ఒక్కటవుతున్నారు.

ఇక మార్చి 6, 11 తేదీల్లో తెలంగాణాలో లక్షల పెళ్ళిళ్ళు జరగబోతున్నాయి.

indian-wedd-4

ముహుర్తబలం
చాలమంది తదియ, పంచమి ,దశమి తిథుల్లో హస్త,స్వాతి,పూర్వాషాఢ నక్షత్ర ఘడియల్లోనే ముహూర్త బలం బాగుండడంతో పెళ్ళి పీటలెక్కేందుకు సిద్ధమయ్యారు. ఇకపోతే మార్చి 11శ్రీరామ నవమి తర్వాత మార్చి 25వరకు ముహుర్తాలు లేవని పండితులు చెబుతున్నారు.ఏప్రిల్ నెలలో మంచి రోజులున్నా ముహూర్త బలం లేనందు వల్ల పెళ్ళిళ్ళు తక్కువే.
మొత్తానికి పై మూడు రోజుల్లోనే చాలా మంది మూడుముళ్ళు వేసేసి కళ్యాణ వీణలు మ్రోగించేస్తున్నారు.

తెలుగు డాట్ అలజడి డాట్ కామ్ ను ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌,ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.

(Visited 1 times, 45 visits today)