Home / Latest Alajadi / ప్రజల కష్టాలను తీర్చడానికి వస్తున్న మైక్రో ఏటీఎం మిషన్లు…!

ప్రజల కష్టాలను తీర్చడానికి వస్తున్న మైక్రో ఏటీఎం మిషన్లు…!

Author:

పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు పడుతున్న బాధలను ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా తీర్చాలని కేంద్ర ప్రభుత్వం చూస్తోంది. దానిలో భాగంగానే ఇప్పుడు కొత్తగా మైక్రో ఏటీఎంలను ప్రవేశపెడుతున్నట్లు తెలియజేసింది. మామూలు ఏటీఎంలనే చూసిన ప్రజలకు ఈ మైక్రో ఎటిఎంలు ఎలా ఉంటాయో ఎవరికీ పెద్దగా తెలియదు అనే చెప్పాలి. వీటి అవసరం మనకు ఎప్పుడు రాలేదు. ప్రస్తుత సమయంలో అందుబాటులో ఉన్న బ్యాంకులు, ఎటిఎంలు కూడా సరిపోవడం లేదు అందుకే కేంద్ర ప్రభుత్వం మైక్రో ఏటీఎంలను ప్రవేశపెడుతుంది.

micro-atm

మైక్రో ఎటిఎంలు స్వైపింగ్ మిషన్ లాగా ఉంటాయి. వీటికి జీపీఆర్ఎస్ కనెక్షన్ ఉండి మన ఏటీఎం కార్డు( డెబిట్ కార్డు) స్వైప్ చేయగానే వెంటనే సంబంధింత బ్యాంకుకు అనుసంధానం అయి వెంటనే ఖాతాదారుని వివరాలు డిస్ప్లే అవుతాయి. మనం ఎంత మొత్తం కావలి అనుకుంటామో అంత మన అకౌంట్ నుండి తగ్గుతుంది. మన డ్రా మొత్తాన్ని మెషిన్ తీసుకొచ్చిన బ్యాంకు అధికారి మనకు అందజేస్తాడు. వీటిని మొదట్లో డిపాజిట్లకు సేకరణకు ఉపయోగించిన ఇపుడున్న అవసరం కోసం విత్ డ్రాకు ఉపయోగిస్తున్నారు. మాములుగా ఒక్క ఏటీఎం నిర్వహణ ఖర్చు నెలకు దాదాపు 20 వేలకు పై అవుతుంది. కానీ ఈ మిషన్ ఖరీదే 20 వేలు. దీనిని సిగ్నల్ ఉన్న ఎలాంటి ప్రాంతానికైనా తీసుకెళ్లే వెసులుబాటు ఉంటుంది. కానీ దీన్ని తీసుకు వచ్చిన బ్యాంకు అధికారి దగ్గర ఎంత డబ్బు ఉంటుందో అంత వరకు మాత్రమే సేవలు అందించగలదు.వీటిని చిల్లర సమస్య ఎక్కువగా ఉన్న గ్రామీణ ప్రాంతాలకి ఎక్కువగా పంపాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది.

Comments

comments