Home / Inspiring Stories / వాట్సాప్ లో విడాకులు పంపాడు…!?

వాట్సాప్ లో విడాకులు పంపాడు…!?

Author:

“నువ్వొక కొరికి పడెసిన ఆపిల్ వి ఇక నువ్వు నాకొద్దు అందుకే నీకు విడాకులిస్తున్నా తలాక్..! తలాక్..!! తలాక్…!!!” పెళ్లైన మూడు వారాలకు దుబాయ్ నుంచి ఆమె భర్త పంపిన మెస్సేజ్ అది. 21 ఏళ్ళ అమ్మయికి ఆ మెసేజ్ చూసి ఏం చేయాలో పాలు పోలేదు ఒక్క సారి కాలం స్థంబించింది అసలేం జరిగిందో కూడా అర్థం కాలేదు. ఒక స్త్రీ గ తనకున్న విలువ ఇంతేనా అన్నది ఆమెను మరింతగా బాధించిన విషయం.

డెంటల్ కాలేజ్ లో చదువుకుంటున్న కూతురి పెళ్ళీకోసం  తాను కూడబెట్టుకున్న డబ్బులన్నీ ఖర్చు చేసింది, కట్నం కింద రూ.10 లక్షల తో పాటు 80 సవర్ల బంగారాన్ని కూడా ముట్టజెప్పింది. పెళ్ళయిన పది రోజులకే ఉధ్యోగం కోసం అంటూ  దుబాయ్ వెళ్ళిన వరుడు. మరో రెండు వారాలకే విడాకుల “మెసేజ్” పంపాడు. మెసేజ్ చూసుకున్న తర్వాత ఆమె అత్త వారింటి నుంచి వచ్చి తన తల్లికి విషయాన్ని చెప్పింది. వెంటనే వారు పాల కొట్టాయం లో ఉన్న వుమన్ కమీషన్ అదాలత్ లో ఈ విశయం పై ఫిర్యాదు చేసారు. ఈ ఫిర్యాదును స్వీకరించిన కమీషన్ సెల్ల్ వాట్స్ ఆప్ లో విడాకులు పరిగణలోకి తీసుకోవచ్చా అన్నవిషయం పై విచారణ చేపట్టింది.  వెంటనే ప్రవాస కేరళ కమీషన్ ని అప్రమత్తం చేసి ఆ అమ్మాయి భర్త యొక్క వివరాలని తెలుసుకునే ప్రయత్నాలు మొదలు పెట్టింది.

ఐతే తాజా పరిణామాల ప్రకారం అసలు ఇస్లాంలో ఉన్న తలాక్ పద్దతిని వ్యతిరేకిస్తున్నట్టు 91% మహిళలు తెలిపారు. ఇంత సులభంగా విడాకులు ఇచ్చి భార్యని వదిలేసే సాంప్రదాయానికి స్వస్తి చెప్పాలని వారు కోరుకుంటున్నారు. ఇక స్కైప్,వాట్సాప్ లలో కూడా తలాక్ ఇవ్వటం అనేది వారు దారుణం గా ఖండిస్తున్నరు కూడా. “ఈ కాలం యువతీ యువకులలో మార్పు రావలనే కోరుకుంటాం కానీ మరీ ఇంత దిగజారిపోవటం విచారకరం అంటూ తన ఆందోళనను వెలిబుచ్చారు “కేరళ స్టేట్ వుమెన్ కమీషన్ అధ్యక్షురాలూ, సామాజిక కార్యకర్తా, కవయిత్రి కూడా అయిన సుగత కుమారి. ఆ యువతి భర్తని శిక్షించాలని ఆమె డిమాండ్ చేసారు.

యువతీ,ఆమె భర్తా మాత్రమే కాది ఇద్దరి కుటుంబసభ్యుల సమక్షం లో చర్చలు జరిగాకే అప్పటికీ అబ్బాయికి ఇష్టం లేకపోతే తప్ప అతను “తలాక్” చెప్పటానికి వీలు లేదనీ, తలాక్ చెప్పినా అది కొన్ని నిబందనలకు లోబడే చెల్లుతుందని..కేరళ రాష్ట్ర హజ్ కమిటీ జిల్లా చైర్మన్  సయ్యద్ ఆత్త కోయ తంగల్ తెలిపారు.వాట్స్ ఆప్ లో చెప్పటం తలాక్ ఇస్లాం ప్రకారం ఏ మాత్రం ఆమొదించ బడదు అని ఆయన స్పష్టం చేసారు. తలాక్ అనేది ముఖాముఖి గా అందరి సమక్షం లో జరగాల్సిన విషయం అనీ అలా కుదరని పక్షం లో అందుకు సంబందించిన పత్రాలు సాక్షుల సంతకాలతో ఉంటే తప్ప చెల్లవనీ ఆయన చెప్పారు.. ప్రక్రియ మొత్తం కావొచ్చు ”

కేరళ నద్వథుల్ ముజాహిదీన్ రాష్ట్ర అధ్యక్షుడు ట్ఫ్ అబ్దుల్లా కోయం అదాని  వాట్సాప్ లో విడాకులు అని ఏమిటి? అంటూ ఆశ్చర్య పోయారు. ” “తలాక్” అనివార్యమైన పరిస్థితులలో మరియు పరిస్థితులలో చేయాలి. “తలాక్” అనేది  వాట్సాప్ లో అనుసరించాల్సిన వ్యవహారం కాదు” అన్నారు.

ఆ యువకుడు ఇచ్చిన తలాక్ చెల్లదు ఆ అమ్మాయి విషయంలో అన్యాయం జరగటానికి వీలు లేదనీ ఆమెకు న్యాయం జరిగే దాకా తాము అండగా ఉంటామనీ చెప్పారు…

(Visited 109 times, 16 visits today)