EDITION English తెలుగు
డేవిడ్ వార్నర్ మరియు భార్య కాండిస్ బాల్-టాంపెరింగ్ కుంభకోణం తరువాత గర్భస్రావం చేస్తారు   చైనా హఫీజ్ సయీద్ ను వెలుపలికి వెలుపల కోరుకుంటున్నారు.   MH17 రష్యన్ సైనిక క్షిపణి వ్యవస్థ డౌన్ కూలిపోయింది, పరిశోధకులు చెప్పారు   అమెరికాపై ఆధారపడిన సంబంధం భారత్కు ఎప్పటికీ ఉండదు: నిపుణుడు కాంగ్రెస్ సభ్యులకు చెబుతాడు   హెల్త్కేర్ యాక్సెస్ అండ్ క్వాలిటీలో 195 దేశాలలో నెమ్మదిగా మెరుగుపరుచుకోవడం, భారతదేశం రాంక్స్ 145   ఢిల్లీ మనిషి తన కుమారుని హతమార్చాడు   పెట్రోల్ ధరలు పెరగడంతో పలు నగరాల్లో 80 రూపాయల మేరకు ధరలు పెరిగాయి   కేరళ ప్రభుత్వం గత 24 గంటల్లో బాధిత ప్రాంతాల్లో తాజా కేసులను నమోదు చేయకుండా, సమయానుగుణ జోక్యం ద్వారా వ్యాప్తిని తగ్గించింది.   మనిషి ఇండోర్-గోవా ఇండిగో విమానంలో టేకాఫ్ ముందు తన ప్రియురానికి ప్రతిపాదించాడు.   జెడి (ఎస్) నాయకుడు హెచ్డి కుమారస్వామి కర్నాటకలో 24 వ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు.

ప్రజల చిల్లర కష్టాలు ఒకవైపు..! అవినీతి సొమ్ముతో విలాసాలు మరోవైపు…!

Author:

చలామణిలో ఉన్న 500,1000 నోట్లని రద్దు చేయటంతో దేశంలో సామాన్య ప్రజల పరిస్థితి అతలాకుతలం అయింది, చిల్లర కోసం గంటలు గంటలు బ్యాంకుల ముందు, ఏటీఎంల ముందు నిల్చుంటున్నారు, గ్రామీణ ప్రాంతాలలో పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది, అక్కడ కొంతమందికి బ్యాంకు అకౌంట్ లు కూడా లేవు, కొంతమంది వారి పాత నోట్లని మారుస్తాం అని చెప్పి కమిషన్ పేరుతో వారి కష్టార్జితాన్ని మోసపూరితంగా క్యాష్ చేసుకుంటున్నారు, ఇలా ప్రతి ఒక్కరు నోట్ల రద్దుతో ఇబ్బంది పడుతున్నారు, నల్ల ధనాన్ని పోగేసుకున్న వారు ఏదోలా కష్టపడి కూలీలని పెట్టి బ్యాంకులలో డబ్బుని జమచేస్తున్నారు, ఇలా ఒకవైపు భారతదేశంలో ఉన్న అత్యధిక మంది ప్రజలు ఉన్న పనులు వదిలేసి పాత నోట్లని పట్టుకొని బ్యాంకుల చుట్టే తిరుగుతుంటే మరోవైపు ప్రజల సొమ్ముని అక్రమ మార్గాలలో సంపాదించి కొన్ని వేల కోట్లు వెనకేసుకున్న కొంతమంది మాత్రం దర్జాగా బతుకుతున్నారు.

gali-janardhan-reddy-daughter-marriage-1

గాలి జనార్ధనరెడ్డి గురుంచి, అతని అక్రమాల గురుంచి, ఆస్తుల గురుంచి అందరికి తెలుసు, అక్రమ మైనింగ్ కేసులో దాదాపు మూడు సంవత్సరాలు జైలులో ఉన్నాడు, బెయిల్ కోసం ఏకంగా జడ్జీకే లంచం ఇచ్చాడు, ఇప్పుడు దేశంలో ఎవరు చేయనంత అంగరంగ వైభవంగా తన కూతురి పెళ్లిని చేస్తున్నాడు, దాదాపు 500 కోట్లు ఖర్చుతో కూతురి పెళ్ళికి ఏర్పాట్లు చేయించాడు. పెళ్లి పత్రికల కోసమే 5 కోట్ల దాక ఖర్చుపెట్టారు, ఈ పెళ్లి ఉత్సవం నవంబర్ 12 న మొదలై నవంబర్ 16 ముగిసేలా ఏర్పాట్లు చేసారు, ఈ పెళ్ళిలో చిందులు వేయడానికి బాలీవుడ్ స్టార్లని, ఇంటర్నేషనల్ లెవెల్ సింగర్స్ ని పిలించారు.

gali-janardhan-reddy-daughter-marriage-2

గాలి జనార్ధనరెడ్డి ఇన్ని కోట్లు ఎలా సంపాదించాడో అందరికి తెలుసు, కానీ మన దేశంలో ఇలాంటి వారిని ఏమి చెయ్యలేము, విజయ్ మాల్యా కొన్ని వేల కోట్ల రుణాన్ని బ్యాంకుల నుండి తీసుకోని దర్జాగా విదేశాలకి చెక్కేసాడు, ఇప్పుడు అక్రమ ధనార్జన కేసులో మూడు సంవత్సరాలు జైలులో ఉండి బెయిల్ పై బయటకి వచ్చి తన కూతురి పెళ్లి 500 కోట్ల ఖర్చుతో చేస్తుంటే కూడా మనం ఏమి చేయలేము, ఇలా చాలామంది నాయకులూ, అధికారులు అక్రమ ఆస్తుల కేసులో జైలులో ఉండి బెయిల్ పై వచ్చి హాయిగా బతుకుతున్నారు, ఇలాంటి వారిని వదిలేసి నిజాయితిగా సంపాదించే వారిని బ్యాంకుల ముందు గంటలు గంటలు నిలబెట్టడం ఎంత వరకు న్యాయమో మోడీయే చెప్పాలి.

(Visited 2,552 times, 35 visits today)

Comments

comments