EDITION English తెలుగు
"పీవీ సింధు..మమ్మల్ని క్షమించు"   Video: ప్రియురాలి శవానికి తాళి కట్టి పెళ్లి చేసుకున్న ప్రేమికుడు.   Video: ఒక్క పాటతో ఇంటర్నెట్ ని ఊపేస్తున్న మల్లు బ్యూటీ..!   నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా చేసాడు.. సంపాదించిన ఆస్తి రూ.3930 మాత్రమే..!   మహేష్ బాబు, అల్లు అర్జున్ లకు షాక్ ఇచ్చిన రజినీకాంత్..!   లవర్స్ మధ్య జరిగిన ఈ వాట్సాప్ చాట్ లు చూస్తే ఖచ్చితంగా నవ్వుకుంటారు..! 3వది అయితే హైలైట్..!   మహారాజశ్రీ హైకోర్టు న్యాయమూర్తి గారికి....! కదిలించిన జెడ్పి విద్యార్థినిల లెటర్..!   హైదరాబాద్ లోని ఈ హాస్పిటల్ లో రూ. 10 లక్షలు అయ్యే చికిత్సలు అన్ని ఉచితం..!   తల్లి చనిపోతూ తన కొడుక్కి రాసిన లెటర్..! అది చదివితే కన్నీళ్లొస్తాయి...!   బీటెక్ స్టూడెంట్స్ కు నెలకు రూ.80వేల స్కాలర్ షిప్.
Home / General / ఎవరు అసలైన ధనవంతుడు …ఈ స్టోరీ చదివి మీరే చెప్పండి.

ఎవరు అసలైన ధనవంతుడు …ఈ స్టోరీ చదివి మీరే చెప్పండి.

Author:

అనగనగా ఓ ఊరిలోని ఒక చిన్న సందర్భం. అదేంటంటే ఒక ఇంట్లో ఆ యజమానురాలి కొడుక్కి పెళ్లి కుదిరింది. అయితే అబ్బాయి గారి పెళ్లి కదమ్మా నాకు ఒక చీర పెట్టవా అని అడిగింది వాళ్ళ పనిమనిషి. సరే అన్న ఆ యజమానురాలు చీరల షాప్ కి వెళ్లి, అబ్బాయి… తక్కువ రేట్ లో కొన్ని చీరలు చూపించమ్మా మా పనిమనిషి కి పెట్టాలి అన్నది. సరే అన్న ఆ షాప్ అబ్బాయి అడిగిన రేట్ లో కొన్ని చీరలు చూపెట్టాడు. అందులో ఒక చీర సెలెక్ట్ చేసుకొని వెళ్ళింది యజమానురాలు. మరి కాసేపటికి యజమానురాలి ఇంట్లో పనిమనిషి కూడా ఆ షాప్ కి వచ్చి, బాబూ మా అమ్మ గారి అబ్బాయి పెళ్ళండి, చాల డబ్బులు కూడపెట్టాను, మంచి ఖరీదైన చీర చుపించవా… అని అడిగింది. అయితే అన్నట్టు గానే ఒక మంచి ఖరీదైన చీర కొనుక్కుని అక్కడి నుంచి వెళ్ళింది. అంతా బాగానే ఉంది కానీ ఆశ్చర్యపోవటం షాప్ వారి పని అయింది. మనిషికి… మంచి మనసున్న మనిషికి తేడా ఉంది కదా…. అని. ఇప్పుడు మీరు చెప్పండి డబ్బున్న అమ్మగారు గొప్పదా..? లేక పేదదైనా పనిమనిషి గొప్పదా…?

who is rich people

మరి ఇంకో సందర్భం చూద్దాం .
ఒక రోజు ఒక ఫ్యామిలీ రెస్టారంట్ కి వెళ్ళింది. ఆ ఫ్యామిలీలో ఒక చంటి పాప కూడా ఉంది. కాసేపటికి ఆ పాప పాలకోసమని గుక్క పెట్టి ఏడుస్తుంది. అప్పుడు ఆ పాప తల్లి హోటల్ మేనేజర్ దగ్గరికి వెళ్లి ఒక కప్పు పాలు ఇవ్వగలరా, పాప ఏడుస్తుంది అన్నది. తప్పకుండా మేడమ్, ఒక కప్పు పాలు 100 రూపాయలు అవుతుందండి అన్నాడు. నో ప్రాబ్లెమ్ కాస్త తొందరగా తెప్పించరా అంది. పాలు తాగి పాప హ్యాపీ గా నిద్ర పోయింది. కాసేపటికి ఆ ఫ్యామిలీ ఒక టీ స్టాల్ దగ్గర ఆగి టీ తాగుతున్నారు. అప్పుడు ఆ పాప మళ్ళీ ఏడుస్తుంటే టీ స్టాల్ అతను పాప ఏడుపుని గమనించి ఇదిగో అమ్మ పాపకి పాలు అని ఒక కప్పు పాలు ఇచ్చాడు. పాపకి పాలు పట్టి ఎంత..? అని డబ్బులివ్వగా.. ఏం పరవాలేదండి మేము చిన్న పిల్లల పాలకి డబ్బులు తీసుకోము అన్నాడు. అంతే గాక మరో కప్పు పాలు ప్రయాణంలో అవసరం అవుతాయి అని ఒక చిన్న సీసా లో పోసి ఇచ్చాడు. కార్ లో తిరిగి వెళ్తుండగా ఆ తల్లి ఆశ్చర్య పోతూ ఎవరిది గొప్పతనం అని ఆలోచించసాగింది. ధనవంతుడైన స్టార్ హోటల్ మేనేజరా…? లేక రోజు వారి సంపాదన మీద బతికే ఆ టీ స్టాల్ వ్యక్తా…? అని.

ఇలా సందర్భాలు చెప్పుకుంటూ పోతే లెక్కలేనన్ని… కానీ అందరు ఆలోచించాల్సింది ఒక్కటే, ప్రతి ఒక్కరికి ఇలా ఎన్నో సందర్భాలు ఎదురవుతూనే ఉంటాయి. మనకి తోచిన సహాయం చేయటం మన ధర్మం. ఇలా చేయడం వల్ల ఎదుటి వారికే కాదు మనకి ఏంతో సంతోషం కలుగుతుంది. నలుగురికి సంతోషాన్ని పంచటం ఒక కళ. అది అందరూ అలవాటు చేసుకోవాలి.

Comments

comments