Home / Inspiring Stories / చైనా లోని వాహన నిర్మాణ సంస్తలు భారత దేశం లో ఉన్న ఈ చిన్న మెకానిక్ వెంట ఎందుకు పడుతున్నాయి?

చైనా లోని వాహన నిర్మాణ సంస్తలు భారత దేశం లో ఉన్న ఈ చిన్న మెకానిక్ వెంట ఎందుకు పడుతున్నాయి?

Author:

మహమ్మద్ రయీజ్ మార్కని…. ఉత్తర్ ప్రదేశ్ లోని సాగర్ అనే టౌన్ లో కార్ మెకానిక్.. పెద్దగా చదువుకున్నదేం లేదు కానీ ఆయన ప్రపంచానికే అవసరమైన ఒక పెనుసవాల్ కి ఒక ప్రత్యామ్నాయాన్ని సృష్టించ గలిగాడు అదే నీళ్ళతో నడిచే కార్. ఇంథన వనరుల సంక్షోభం ఇప్పుడు ప్రపంచం మొత్తాన్ని పట్టి పీడిస్తున్న సమస్య. అయితే ఇప్పుడు రయీజ్ దానికో సమాధానాన్ని కనుగొన్నాడు. నీళ్ళూ,కాల్షియం కార్బైడ్ ల చర్య తో విడుదలయ్యే ఎసిటలిన్ గ్యాస్ తో నడిచే ఇంజన్ ని తయారు చేసేందుకు ఆయన ఆరేళ్ళుగా తన గ్యారేజ్ లో కృషి చేస్తూనే ఉన్నాడు. ఎట్టకేలకు అన్ని సమస్యలూ అధిగమించి ఎకో-ఫ్రెండ్లీ ఇంజన్ ని తయారు చేసి విజయవంతంగా వాహనాన్ని నడపటానికి ఆయనకు ఆరు సంవత్సరాలు పట్టింది.కాల్షియం కార్బైడ్ తో నీటిని కలిపినప్పుడు వచ్చే ఎసిటలిన్ గ్యాస్ ని మామూలుగా మనం “గ్యాస్ వెల్డింగ్” ప్రక్రియలో చూస్తూనే ఉంటాం. సరిగ్గా అదే పద్దతిలో విడుదలయ్యే ఎసిటలిన్ గ్యాస్ ని మండించి ఇంజన్ ని పనిచేయించటం ద్వారా లీటర్ పెట్రోల్ ని 70 నుంచీ80 రూపాయలు పెట్టి కొనుగోలు చేస్తున్న సామాన్యుడి భారాన్ని తగ్గించే ప్రయత్నం చేసాడు రయీజ్.

“ప్రపంచం లోని ప్రతీ వాహన నిర్మాణ సంస్థా ఇప్పుడు కాలుష్యాన్ని,ఇంథనం వాడకాన్ని తగ్గించే ప్రత్యామ్నాయ ఇంజన్ కోసం చూస్తోంది. ఇప్పుడు నేను రూపొందించిన ఫార్ములా తో నడిచే ఇంజన్ ఇప్పుడు వారికి ఎంతో అవసరం. తర్వాతి తరం మొత్తం ఇలాంటి ఎకో ఫ్రెండ్లీ కారమీదే ఆధార పడబోతోంది” అంటున్నాడు రయీజ్.
చైనాకి చెందిన కొన్ని ఆటో మొబైల్ కంపెనీలు కొన్ని రయీజ్ చేసిన ప్రయోగాన్ని చూసి తమ సంస్థలతో కలిసి పని చేయాల్సిందిగా. చైనాకు ఆహ్వానించాయట. అయితే రయీజ్ వారికొక షరతు పెట్టాడు.ఏ కంపెనీ అయినా సరే ఉత్తర్ ప్రదేశ్ లో ఉన్న తన పట్టణమైన సాగర్ దగ్గరలో తమ ప్లాంట్ ఏర్పాటు చేస్తానని ఒప్పందం కుదుర్చుకుంటేనే తాను వారితో కలిసి పని చేస్తానని చెప్తున్నాడు…

అయితే ఇదే తరహాలో నీళ్ళతో నడిచే కారుని ఇదివరలోనే తెలుగు వాడైన సుందర్ అనే వ్యక్తి తయారు చేసారు. ఫార్ములా వేరైనప్పటికీ లీటర్‌ నీటితో ఏకంగా 1500 కిలోమీటర్లు మైలేజీ ఇచ్చే విధంగా కార్ ని తయారు చేసారు సుందర్‌.సమస్త జీవరాశుల మనుగడకు ఆధారంనీరు. జీవరాశుల జీవనానికి ఆధారమైన నీటితో వాహనాలు ఎందుకు నడపలేం!!! అన్న సందేహం నుంచి పుట్టిన ఆలోచనే నీటితో నడిచే కారు అంటున్నారు సుందర్‌. నీరు అంటే సాంకేతిక భాషలో హెచ్‌టూఓ. హైడ్రోజన్‌, ఆక్సీజన్‌ల మిశ్రమమే నీరు. నీటి నుంచి హైడ్రోజన్‌ వేరు చేసి వెహికిల్‌కు ఇందనంగా ఎందుకు మార్చలేం అనుకుని శ్రమించిన సుందర్‌ తొమ్మిదేళ్ల సుదీర్ఘ ప్రయాత్నాలతో అనుకున్నది సాధించారు.
ఆక్సీజన్‌, హైడ్రోజన్‌లుగా విడగొట్టే హైడ్రాలసిస్‌ విధానం ఆధారంగా వెహికిల్‌ మైలేజ్‌ పెంచే సాంకేతికతకు కనిపెట్టారు. వాటర్‌ ఫ్యుయల్‌ టెక్నాలజీలో భాగంగా.. రసాయనాలు కలిపిన నీటి కిట్‌ను వెహికిల్‌కు అమర్చారు. ఈ కిట్‌ వాటర్‌లోని హైడ్రోజన్‌, ఆక్సీజన్‌లను వేర్వేరుగా విడగొడుతుంది. హైడ్రోజన్‌ నేరుగా ప్రత్యేక పరికరం ద్వార ఇంజన్‌కు చేరుతుంది. వాహనం స్టార్ట్‌ చేయగానే. ఇందనంతోపాటు హైడ్రోజన్‌ కూడా మండుతుంది. దీంతో వెహికిల్‌కు పెట్రోల్‌ లేదా డీజిల్‌ వినియోగం 50 శాతం తగ్గుతోంది.అయితే వాటర్‌ ఫ్యుయల్‌ టెక్నాలజీ వెహికిల్‌ ద్వారా ఆక్సీజన్‌ విడుదలవుతోందంటున్నారు సుందర్‌.నీటి నుంచి విడిపోయిన ఆక్సీజన్‌ పొగ రూపంలో బయటకు వస్తుందంటున్నారు.అయితే ఈ పద్దతిలో ఎంతో కొంత ఇంథనం అవసరం అవుతోంది. రయీజ్ ఇంజన్ మాదిరిగా ఇది పూర్థి స్థాయి ఎకో ఫ్రెండ్లీ ఇంజన్ కాదు…

(Visited 1,728 times, 42 visits today)