EDITION English తెలుగు
బాలకృష్ణపై నాగబాబు షాకింగ్ కామెంట్స్.! అసలు బాలకృష్ణ గురించి ఎందుకు టాపిక్ వచ్చింది?   ఈ స్వీట్ కేజీ 9000 రూపాయలు అంట.! అంత ధర ఎందుకో తెలుసా.? ఎలా తయారుచేస్తారంటే?   ముంబై ఎయిర్ పోర్ట్ లో సరికొత్త రికార్డ్.! అంబానీ కూతురు పెళ్లా మజాకా...!   పాతబస్తీలో ఓటింగ్ తగ్గడానికి కారణం అదేనంట.? ఆలస్యంగా వెలుగులోకి.!   సోదరి సుహాసిని తరుపున ఎన్ఠీఆర్ ఎందుకు ప్రచారం చేయలేదో తెలుసా.? కారణం ఇదేనట!   చాలామంది పండ్లపై ఉప్పు చల్లుకొని తింటారు..! అలా తినడం వల్ల ఏమవుతుందో తెలుసా.?   2014లో ఎంత శాతం మంది ఓట్లు వేసారో తెలుసా.? ఇప్పుడు మారిన లెక్కల వల్ల గెలుపు తారుమారవుతుందా.?   రాజమౌళి, ఎన్ఠీఆర్ ఓట్లు వేశారు.! మరి రామ్ చరణ్ ఎందుకు వేయలేదు.? అసలు కారణం ఇదే!   పాటలు పాడుతూ.. స్టెప్‌లు వేసిన కోహ్లీ.! మైదానంలో కోహ్లీ వెరైటీ డాన్స్ వైరల్ వీడియో.!!   గుత్తాజ్వాల ఓట్ల గల్లంతుపై మరో సంచలన ట్వీట్..! నెట్ లో చూస్కుంటే..?
Home / Devotional / చనిపోయిన వారి పేరుతో కాకికి ఆహారం ఎందుకు పెడతారో తెలుసా..?

చనిపోయిన వారి పేరుతో కాకికి ఆహారం ఎందుకు పెడతారో తెలుసా..?

Author:

హిందూ సంప్రదాయం ప్రకారం ఎవరైనా చనిపోతే మూడవ రోజు నుండి పదో రోజు వరకు పక్షులకు (కాకులకు) పిండం (ఆహారం) పెట్టడం చూస్తుంటాం, మరణించిన వారు కాకి రూపంలో కుటుంబ సభ్యులు పెట్టిన ఆహారాన్ని తినడానికి వస్తారు అనే నమ్మకం మన ముత్తాతల కాలం నాటి నుండే ఉంది, ఈ కారణంగానే ఎవరైనా పెద్దలు లేదా కుటుంబ సభ్యులు కాలం చేసినప్పుడు పిండం పెట్టడం ఆచారం. కర్మకాండలలో భాగంగా కాకులకు అన్నం పెడుతుంటారు. ఆ ఆహారాన్ని కాకి తింటే తమ పెద్దలు సంతృప్తి చెందారనీ, ఒక వేళ కాకి ముట్టనట్లైతే వారికి ఇష్టమైన కోరిక ఏదో తాము తీర్చనందువలన అసంతృప్తికి గురయ్యారని అనుకుంటూ వుంటారు. ఆ కోరిక ఏదో తెలుసుకుని దానిని తీర్చడానికి ప్రయత్నాలు చేస్తుంటారు. ఇక్కడ అసలు విషయమేమిటంటే.

హిందూ ధర్మం ప్రకారం అన్ని జీవరాశులకి మనుషులు ఏదో రకంగా సహాయం చెయ్యాలి, అందుకే హిందూ కుటుంబాలలో చనిపోయిన వారికి కర్మకాండలు జరుపుతారు, చనిపోయిన వ్యక్తి కుటుంబీకులు కర్మకాండలు జరిపించి పిండప్రదానం చేస్తారు, కర్మకాండలు చేసే సమయంలో బ్రాహ్మణులు “ఇదం పిండంగృధ్ర వాయస, జలచర ముఖేన ప్రేత భుజ్యతాం” అనే మంత్రాన్ని చదువుతారు, ఆ మంత్రానికి అర్థం “గాలిలో విహరించే పక్షుల, నీటిలో నివసించే జలచరాల రూపంలో ఉండే పితృ దేవతలకి ఆహారం అందించాలి ” అని..!

Crow-Eating-Food-Death

వాయస పిండం/కాకికి పిండం:

  • పక్షిజాతికి భోజనం పెట్టడం అనేది అందులో పరమార్ధం, పూర్వం మనుషులు నివసించే ప్రాంతాలలో కాకులే ఎక్కువగా జీవించేవి, అందుకే మన పూర్వికులు పిండప్రదానం చేసిన తరువాత కాకులకి ఆహారాన్ని పెట్టేవారు అదే ఆనవాయితీగా కొనసాగుతూ వచ్చింది. చనిపోయిన వారి ఆత్మ పక్షి రూపంలో వచ్చి ఆహారాన్ని స్వీకరిస్తుంది అని కొన్ని శాస్త్రాలలో ఉంది.
  • రామాయణం ప్రకారం రాముడు ఒక భక్తుడికి నీ పూర్వికులు కాకి రూపంలో విహరిస్తుంటారు, కాకులకి ఆహారం పెడితే నీ పూర్వికులకి చేరుతుందని ఒక వరం ఇస్తాడు, రాముడి వరం ప్రకారమే నేటికీ కాకులకి ఆహారాన్ని పెడతారనే నానుడి కూడా ఉంది.

వికిర పిండం/నీటిలో వదిలే పిండం:

నీటిలో ఉండే జలచరాలకి ఆహారాన్ని పెట్టడం అనేది అందులో ఉన్న పరమార్థం, చాలామంది చనిపోయిన వారి ఆస్థికలని నది దగ్గరికి తీసుకెళ్లి పిండప్రదానం చేసి నదిలో వదిలేస్తారు, ఆస్థికలతో పాటు ఆహారాన్ని కూడా నదిలో వేస్తారు, ఇలా చేస్తే చనిపోయిన వారి ఆత్మకి శాంతి చేకూరుతుంది అని నమ్మకం.

గోవుకు పెట్టే పిండం:

పిండాన్ని గోవులకి పెట్టనీయటం లేదనే విమర్శ కూడా ఉండి. అది చాలా తప్పు.. అపోహ కూడా.! ఆవుకి బలమైన ఆహారం అందించడమే పిండ ప్రదానంలోని గుణం. ఆవులకు పెట్టె పిండాలలో పాలు పాల పదార్ధాలైనవి (నెయ్యి వంటీవి) కలవవు
జంతువంటే గోవు మాత్రమేనా? ఇంకేం లేవా..? కుక్కకో పిల్లికో పెట్టొచ్చుకదా? అని మీకు సందేహం రావొచ్చు. వాటికి కూడా సమాధానం లేకపోలేదు.

ఆవు ఎన్నో ఔషద గుణాలున్న మేలు జాతి పశువని గుర్తించారు మన పూర్వీకులు. అంతే కాదు, ఆరోజుల్లో ప్రతి ఇంటిలో కుక్క ఉన్నా, లేకున్నా ఆవు మాత్రం ఉండేది. అందుకే ఆ కాలం వారు సుభిక్షంగా ఉన్నారనడంలో సందేహం లేదు. అన్నీ ఇళ్ళల్లో ఆవులుంటాయి కాబట్టి, వాటికి కూడా భోజనం పెట్టడమే ముఖ్యోద్దేశ్యం

ఇంకా చనిపోయిన వారి పేరిట, వారి ఆత్మకి శాంతి చేకూరాలని బంధువులకు, ఊరి ప్రజలందరికి అన్నదానం చేస్తారు, మన హిందూ ధర్మంలో ఆచరించే ఉన్న ప్రతి ఆచారం వెనుక సైన్స్ తో పాటు మనుషుల జీవనానికి ఉపయోగపడే ప్రయోజనాలు ఉన్నాయి అని అందరు తెలుసుకోవాలి.

Also Read: ప్రపంచంలోనే ఒక వింత..! కదిలే శివలింగం..! ఆశ్చర్యపోతున్న శాస్త్రవేత్తలు…!

(Visited 8,951 times, 165 visits today)