మంగళ, శుక్ర వారాల్లో ఈ పనులు చేయకూడదా?

Author:

మనలో చాలా మందికి ఇది తెలిసిన విషయమే… కాకపొతే ఇందులో నిజమెంతో ఎవరికీ సరీగా తెలీదు. ఎవరైనా డబ్బు ఇవ్వాల్సి ఉన్నా కూడా మంగళ, శుక్ర వారాల్లో సాధారణంగా ఇవ్వరు. రేపు ఇస్తాం అంటుంటారు. మనం కూడా చాలా మందితో అలాగే చెప్తుంటాం. శుక్రవారం ఎవరికైనా రుణం ఇస్తే తిరిగి రావడం కష్టమనీ, మంగళవారం అప్పు ఇస్తే క‌ల‌హాలు పెరుగుతాయని చాలా మంది నమ్మకం. అసలు విషయం ఏంటో ఇప్పుడు తెలుసు కుందాం.

tuesday friday money transaction

నిజానికి శ్రీమహాలక్ష్మీ భృగుమహర్షి కుమార్తె. అందుకే లక్ష్మీదేవికి శుభదినంగా భావించే శుక్రవారానికి మరో పేరు భృగువారం. లక్ష్మీ దేవికి ఇష్టమైన ఈ రోజు లక్ష్మిని ఇంట్లోంచి పంపకూడదని మన నమ్మకం. అలా పంపితే మన ఇంట్లో లక్ష్మీ నిలవదనే భావన. అలాగే మంగళవారం కుజగ్రహానికి సంబంధించినది. ఈ రోజు మన చేతిలోంచి డబ్బులిస్తే గొడవలకు దారి తీస్తుందనే ప్రచారం ఉంది. అందుకే శుక్రవారం ఎవరికైనా రుణం ఇస్తే తిరిగి రావడం కష్టం అనీ, మంగళవారం నాడు అప్పు ఇస్తే క‌ల‌హాలు పెరుగుతాయని పెద్దలు చెబుతుంటారు. అందుకే ఈ రెండు రోజుల్లో ఎవరికీ అప్పు ఇవ్వరు. అయితే ఇందులో ఎలాంటినిజం లేదని, పూర్తిగా అశాస్త్రీయమైన వాదన అని వాదించే వాళ్ళూ లేకపోలేదు. మంగళ, శుక్రవారాల్లో అప్పులు తీర్చుకోవడమే కాదు, ఇంటిపనులకు, ఇతర కుటుంబ వ్యవహారాల కోసం నిరభ్యంతరంగా ఖర్చు పెట్టవచ్చని కొందరు ఖర్చు పెట్టి మరీ చెబుతున్నారు. ఇందులో ఏది నిజమో ఏది అబద్దమో తెలియకపోయినా.. ఏమో మనకెందుకులే అనే భావన వల్లే చాల మంది ఈ రెండు రోజులు ఎలాంటి ఖర్చు పెట్టారు. అయినా ఇలాంటి నియమాలు, మూడ నమ్మకాలని ప్రజలు నమ్మినంత కాలం ఎవరూ ఏమీ చేయలేరు.

(Visited 2,287 times, 226 visits today)