EDITION English తెలుగు
Home / Political / హోలి పండుగ దాని యొక్క విశేషాలు…

హోలి పండుగ దాని యొక్క విశేషాలు…

Author:

Holi_Festival_of_Colors

ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసం లో పౌర్ణిమ రోజు హోలీ పండుగ జరుపుకుంటారు. ఈ పండుగని సత్యయుగం నుంచి జరుపుకుంట్టున్నట్టుగా హిందూ పురాణాలలో వివరించబడింది. హోళీ అంటే అగ్ని, అగ్నిచే పునీతమైనది అనే అర్ధాలు చెప్పబడ్డాయి. హోళీని హోళికా పుర్ణిమగా కూడ వ్యవహరిస్తూవుంటారు.వసంత కాలంలో వచ్చే ఈ పండుగను రంగుల పండుగ, హోలీ, కాముని పున్నమి, డోలికోత్సవముగా దేశ వ్యాప్తంగా ఆనందోత్సాహాల మధ్య జరుపుకుంటారు.హోలీ పండుగ పుట్టుపూర్వోత్తరాల గురించి విభిన్నగాథలు ప్రచారంలో ఉన్నాయి. ఉత్తర భారతంలో ప్రధాన ఆహారధాన్యమైన గోధుమలు కోతకు వచ్చే తరుణం. ఆ కోతల కోలాహలమే- హోహోకారమే హోలీ అయిందని కొందరి అభిప్రాయం.

ప్రచారంలో ఉన్న కథ :

హిరణ్యకశపుడు రాక్షస రాజు. అతను వరగర్వితుడు. హిరణ్యకశపుడు తన కుమారుడైనా విష్ణుచింతనతో కాలం వెళ్లబుచ్చే ప్రహ్లాదుణ్ణి మట్టుబెట్టాలని నిర్ణయంచుకొన్నాడు. ఒకరోజు హిరణ్యకశపుడు తన సోదరి హోలికను పిలుస్తాడు. ఆమెకున్న వరంతో ప్రహ్లాదుణ్ణి మంటలకు ఆహుతిచేయమని పురమాయస్తాడు. ఆ హోలీక తన సోదరుని కోరిక తీర్చడానికి ఆమె ఒడిలో కూర్చోబెట్టుకొని మంటల్లో దూకుతుంది. కానీ విష్ణుమాయవల్ల హోలిక ఆ మంటల్లో కాలి బూడిదైపోతుంది. ప్రహ్లాదుడు మాత్రం సజీవుడై నిలిచాడు. హోలిక దహనమైన రోజు కనుక హోలీపండుగను చేసుకొంటారు.

holi with flowers

పూర్వం రోజులలో ఈ పండుగ నాడు రకలరకాల పూవులను ఒకరిపై ఒకరు చల్లుకుంటూ వారి సంతోషాన్ని పంచుకొనేవారట. కాని రానురాను పూవుల స్థానంలో రకరకాల రంగులు వచ్చిచేరాయి. ఈ రంగులను నీళ్లల్లో కలిపి ఒకరిపై ఒకరు చల్లుకొంటారు. ఇలా చల్లుకోవడం వల్ల ప్రేమతో పాటు సౌభాగ్యాలు వెల్లి విరుస్తాయని అందరూ భావిస్తారు.వంగదేశంలో డోలోత్సవాన్ని జరుపుకుంటారు. శ్రీకృష్ణునితో కలిసి గోపికలు ఆనాడు బృందావనంలో పూవులతో, రంగులతో ఈ ఉత్సవాన్ని జరుపుకున్నట్లుగా భావించి ఈ హోళి పండుగనాడు శ్రీకృష్ణుడిని రాధను ఊయాలలో పెట్టి డోలోత్సావాన్ని చేస్తారు.

radha-krishna-holi

హోలికను గురించి మరో కథ ప్రచారంలో వుంది :

కృతయుగంలో రఘునాదుడనే సూర్యవంశపు మహారాజు వుండేవాడు. ఎంతో జనరంజకంగా రాజ్యపాలన చేస్తూ వుండగా కొందరు ప్రజలు వచ్చి హోలిక అను రాక్షసి వచ్చి తమ పిల్లలను బాధిస్తోందని మొరపెట్టుకున్నారు. ఆ సమయములో అక్కడే వున్న నారద మహర్షి రఘునాధ మహారాజా హోలిక అను రాక్షసిని ప్రతి సంవత్సరం ఫాల్గుణ పూర్ణిమ రోజు పూజించాలి. అలా పూజించిన వారి పిల్లలను ఆ రాక్షసి ఏమీ చెయ్యదు . కనుక రాజ్యంలో అందరిని వచ్చే ఫాల్గుణ పూర్ణిమ నాడు హోలికను పూజించమని ఆదేశించండి, అన్ని బాధలు తొలగిపోతాయి అన్నాడు. రాజ్యములోని ప్రజలందరూ ఫాల్గుణ పూర్ణిమ రాత్రి కాలమందు బిడ్డలను ఇంటిలోనే ఉంచి హోలికకు పూజలు చెయ్యాలని మహారాజు ఆదేశించాడు. పగటిపూట పూజ చేసిన వారికి దుఃఖములు కలుగుతాయి. కనుక హోలికకు రాత్రే పూజలు చేయాలి. అలా ఈ హోళీ ….. హోలిక పూజ వాడుకలోకి వచ్చిందని తెలుస్తోంది. ఈ హోలిక హిరణ్య కశిపుని చెల్లెల్ని, ప్రహ్లాదుని అగ్నిలో తోయించినప్పుడు ప్రహ్లాదునితోపాటు ఈ హోలిక కూడా అగ్నిలో ప్రవేశించి మారి భస్మం అయ్యిందని అందువల్ల పిల్లల రక్షణ కొరకు ఆమెను పూజించడం ఆచారంగా మారిందని పెద్దలు చెప్తారు.

(Visited 2,627 times, 175 visits today)